అడిలైడ్: యాసిర్ షా సెంచరీ, బాబర్ అజామ్‌ల పోరాటం పాకిస్తాన్‌ను ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించలేకపోయాయి. ఆసీస్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్ ఫాలోఆన్‌కు సిద్ధమైంది. పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌట్ కావడంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను వెంటనే ఆరంభించాల్చి వచ్చింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే 287 పరుగులు వెనుకబడి ఉండటంతో పాకిస్తాన్ ఫాలోఆన్ ఆడక తప్పలేదు.
ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ఫాలోఆన్‌కే మొగ్గు చూపడంతో పాక్ రెండో ఇన్నింగ్స్‌కు దిగింది. పాక్ ఇన్నింగ్స్‌ను షాన్ మసూద్, ఇమాముల్ హక్‌లు ఆరంభించారు. పాక్ ఆటగాళ్లలో యాసిర్ షా(113; 213 బంతుల్లో 13 ఫోర్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అతనికి జతగా బాబర్ అజామ్(97) సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు సాధించగా, ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీశాడు. హజల్‌వుడ్‌కు వికెట్ దక్కింది. అంతకుముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌ను 589/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. డేవిడ్ వార్నర్(335 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ సాధించగా, లబూషేన్(162) భారీ శతకంతో మెరిశాడు.
Comments
Please login to add a commentAdd a comment