పాకిస్తాన్ క్రికెటర్ సస్పెన్షన్ | ICC suspends Yasir Shah after positive dope test | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ క్రికెటర్ సస్పెన్షన్

Published Sun, Dec 27 2015 3:41 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

పాకిస్తాన్ క్రికెటర్ సస్పెన్షన్

పాకిస్తాన్ క్రికెటర్ సస్పెన్షన్

కరాచీ:ఇప్పటికే పేలవమైన ప్రదర్శనతో అల్లాడుతున్న పాకిస్తాన్ క్రికెట్ లో మరో కలకలం రేగింది. పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ యాసిర్ షా డోపీగా తేలడంతో  అతనిపై సస్సెన్షన్ వేటు పడింది. గత నెల 13 వ తేదీన యాసిర్ కు నిర్వహించిన డోపింగ్ టెస్టులో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు  తేలడంతో అతన్ని తాత్కాలికంగా సస్పండ్ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. 

 

ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.' యాంటీ డోపింగ్ కోడ్ ప్రకారం యాసిర్  క్లోర్ టేలిడాన్ అనే మాత్రను తీసుకున్నట్లు తేలింది. ఇలా తీసుకోవడం డబ్యూఏడీఏ (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) జాబితాలోని సెక్షన్- 5 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించడమే. దీంతో యాసిర్ ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నాం. దీనిపై యాసిర్ అప్పీల్ చేసుకునే వీలుంది'  అని ఐసీసీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement