‘హైబ్రిడ్’ మోడల్‌కు దాదాపు అంగీకారం
త్వరలో ఐసీసీ అధికారిక ప్రకటన
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ–2025 నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకు గట్టిగా పట్టుదల కనబర్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పనిసరి పరిస్థితుల్లో మెత్తపడింది. ‘హైబ్రిడ్’ మోడల్‌కు అంగీకరించేది లేదని, మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే నిర్వహిస్తామని చెబుతూ వచి్చన పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ ఆ ఆశలు వదిలేసుకున్నారు. శనివారం ఐసీసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘మేం ఏం చేసినా క్రికెట్ మేలు కోసమే’ అంటూ ఐసీసీ షరతులకు తలవంచారు. ఐసీసీ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా... నఖ్వీ మాటలను బట్టి చేస్తూ ‘హైబ్రిడ్’ మోడల్ ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఇరు దేశాల ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. కాబట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఐసీసీ త్వరలోనే సమగ్ర ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సమస్యల కారణంగా పాకిస్తాన్‌కు తాము వెళ్లమని బీసీసీఐ గతంలోనే ప్రకటించింది. దాంతో ఐసీసీ ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చింది.
. ‘హైబ్రిడ్’ మోడల్ ప్రకారం భారత్ ఆడే మ్యాచ్‌లు మినహా ఇతర మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లోనే జరుగుతాయి. భారత్ మాత్రం మరో వేదికలో ఆడుతుంది. ప్రస్తుతానికి అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అయ్యే అవకాశం ఉంది. అయితే చివరి ప్రయత్నంగా పీసీబీ కొన్ని డిమాండ్లు చేసినట్లు సమాచారం. ఐసీసీ టోరీ్నల విషయంలో తాము ‘సమానత్వం’ కోరుకుంటున్నట్లు నఖ్వీ వెల్లడించారు. దీని ప్రకారం మున్ముందు భారత్‌లో జరిగే ఐసీసీ టోరీ్నలకు కూడా ‘హైబ్రిడ్’ మోడల్ అమలు చేయాలని పీసీబీ కోరింది. అంటే తాము కూడా ఇకపై భారత్‌కు వెళ్లి మ్యాచ్‌లు ఆడమని...తమ కోసం ప్రత్యామ్నాయ వేదికను చూడాలని పీసీబీ డిమాండ్ చేసింది. 2026లో టి20 వరల్డ్ కప్, 2029లో చాంపియన్స్ ట్రోఫీ, 2031లో వన్డే వరల్డ్ కప్‌లతో పాటు ఆసియా కప్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మరో వైపు ఐసీసీ నుంచే తమకు లభించే ఆదాయాన్ని కూడా కొంత శాతం పెంచాలని, ‘హైబ్రిడ్’కు అంగీకరించినందుకు కొంత అదనపు మొత్తాన్ని ఇవ్వాలని కూడా పీసీబీ కోరినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి – మార్చిలో జరగనుంది. పాక్‌లో వేదికలుగా లాహోర్, కరాచీ, రావల్పిండలను నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment