5-Year-Old Girl Kidnapped, Raped in North Delhi - Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఘోరం..ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

Published Fri, Dec 23 2022 2:42 PM | Last Updated on Fri, Dec 23 2022 3:25 PM

5 Year Old Girl Kidnaped And Molestaion In North Delhi - Sakshi

ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముంగిట ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఒక దుండగుడు. ఈ ఘటన బుధవారం ఉత్తర ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...చిన్నారి తల్లిదండ్రులు తమ పాప కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో పోలీసులు ఆ చిన్నారి ఫోటోను అన్ని పోలీస్టేషన్‌లకు పంపించి వెతకడం ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా... ఒక అపరిచిత వ్యక్తి చిన్నారిని ఎత్తుకుని తీసుకువెళ్తున్నట్లు కనిపించింది. దీంతో పోలీసులు ఆ రోజు రాత్రి వరకు ఆ చిన్నారి కోసం తీవ్రంగా గాలించారు. ఐతే ఎట్టకేలకు ఆ పాప ఒక పార్క్‌ సమీపంలో కనిపించింది. ఈ మేరకు పోలీసులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్యుల ధృవీకరించారు.

దీంతో పోలీసులు అతడి ఆచూకి కోసం బృందాలుగా ఏర్పడి గాలించడం ప్రారంభించారు. ఈ మేరకు డిప్యూటీ కమీషనర్‌ దేవేశ్‌ కుమార్‌ మహల్‌ మాట్లాడుతూ...ఆ చిన్నారి తల్లిదండ్రులు దినసరి కూలీలని చెప్పారు. ఉత్తర ఢిల్లీలో ఆ చిన్నారి కోసం తీవ్రంగా గాలించామని, ఎట్టకేలకు ఆ బాలికను గుర్తించగలిగామని అన్నారు. తొందరలోనే నిందితుడి ఆచూకిని కనుక్కొని అరెస్టు చేస్తామని వెల్లడించారు.

(చదవండి: హెడ్‌ మాస్టర్‌ బాగోతం.. హాస్టల్‌ విద్యార్థినులను ప్రత్యేక క్లాస్‌ల పేరుతో పిలిచి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement