రాజస్తాన్: రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ రేప్ కేసు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రజలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ఆయన చేసిన వ్యాఖ్యలకు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చకునేందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఈ మేరకు ఆశోక్ గెహ్లాట్ నిర్భయ కేసు తర్వాత నిందితులు ఉరి తీయాలన్న డిమాండ్ ఊపందుకుని చట్టం అమలులోకి వచ్చంది గానీ ఆ తర్వాత ఇలాంటి ఘటనల తోపాటు హత్యలు కూడా ఎక్కువయ్యాయని అన్నారు.
దీంతో బీజేపీ కాంగ్రెస్‌ని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలు అస్తిరంగా ఉన్నాయనడానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి షేకావత్. ఈ విషయమై జాతీయ మహిళా కమిషన్‌ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి అన్నారు. రాజస్తాన్ ప్రభుత్వం ఏకైక ప్రాధాన్యత రాష్ట్రంలో తమ సీటును కాపాడు కోవడమేనని దుయ్యబట్టారు. గత మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను గురించి పట్టించికోవడం లేదంటూ షేకావత్ విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టారు.
వివరణ ఇచ్చిన సీఎం
రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ బీజేపీ ఆరోపణలకు స్పందిస్తూ...తాను వాస్తవమే మాట్లాడానని అన్నారు. తన వ్యాఖ్యలను వివాదాస్పదం మార్చేందుకు యత్నిస్తున్నారంటూ ఆక్రోశించారు. ఈ మేరకు ఆయన వివరణ ఇస్తూ...నిర్బయ ఘటన నుంచి నిందితులను ఉరి తీయడం వంటి చట్టం అమలులోకి వచ్చింది. అందువల్లే అత్యాచార బాధితురాళ్లను చంపడం కూడా ఎక్కువైంది. ఎందుకంటే నిందితుడు తాను పట్టుబడతాననే భయంతో హత్యలు చేస్తున్నారని, పైగా అందువల్ల ఎప్పుడూ లేని విధంగా హత్యలు కూడా పెరిగాయని అన్నారు.
ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని వివరణ ఇచ్చారు. ఐతే బీజేపీ ఆశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలను సిగ్గుచేటు, దురదృష్టకరం అని అభివర్ణించింది. ఈ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాని వివరణ ఇవ్వాలంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా డిమాండ్ చేశారు. ఆమె ఒక వైపు పార్టీలో "నేను అమ్మాయిని పోరాడగలను" అంటూ నినాదాలు చేస్తూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను ప్రోత్సహిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
అంతేకాదు ఆయన గెహ్లాట్ ప్రభుత్వంలోని మంత్రి శాంతిలాల్ ధరివాల్ వ్యాఖ్యలను కూడా ఉదహరించారు. ఆయన గతంలో రాజస్తాన్ పురుషుల రాష్ట్రం అని అత్యాచారాల్లో రాజస్తాన్ నంబర్ వన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. తాజాగా ఆశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలకు ముడిపెడుతూ షెహజాద్ పూనావల్లా విమర్శలు ఎక్కుపెట్టారు
Comments
Please login to add a commentAdd a comment