
నిందితుల అరెస్టు చూపుతున్న ఏసీపీ
నిజామాబాద్ సిటీ: మానసిక దివ్యాంగురా లిపై లైంగిక దాడి చేసి ఆమె గర్భం దాల్చడానికి కారణమైన కానిస్టేబుల్, మరో నిందితుడైన బాధితురాలి పెదనాన్నను, వీరికి సహకరించిన పెద్దమ్మను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఆ వివరాలను నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌కాలనీకి చెందిన ఓ యువతి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది.
తన పెద్దమ్మ రామవ్వ దగ్గర ఉంటోంది. కాగా రామవ్వకు పరిచయమున్న ఏఆర్ కానిస్టేబుల్‌తోపాటు, రామవ్వ భర్త, యువతికి పెదనాన్న వరసైన గంగారాం కూడా మూడేళ్లుగా యువతిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. గురువారం మరోసారి దాడికి ప్రయతి్నస్తుండగా గమనించిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే.