ఫేస్‌బుక్‌లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్‌! | After Befriending A Girl On Facebook Raped And Made Pornographic Video Of Victim Girl | Sakshi
Sakshi News home page

Lucknow: ఫేస్‌బుక్‌లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్‌!

Published Thu, Dec 2 2021 9:25 PM | Last Updated on Thu, Dec 2 2021 9:31 PM

After Befriending A Girl On Facebook Raped And Made Pornographic Video Of Victim Girl - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, లక్నో: ఫేస్‌బుక్‌లో యువతితో స్నేహం చేసి అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో తాజాగా వెలుగు చూసింది. అంతేకాకుండా నిందితుడు అత్యాచారాన్ని వీడియోతీసి బాధితురాలి తండ్రి ఫోన్‌కు పంపి 10 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశాడు. బాధితురాలి పిర్యాదుమేరకు నిందితుడిని అరెస్టుచేసి జైలుకు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి 2019లో ఫేస్‌బుక్‌ ద్వారా సన్నీ గుప్త అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆగ్రాకు చెందిన సన్నీ తరచుగా ఫేస్‌బుక్‌లో చాట్‌ చేసేవాడు. ఐతే లక్నో చేరుకున్న సన్నీ బాధితురాలిని హోటల్‌కు రావల్సిందిగాకోరాడు. అతని పన్నాగం తెలియని బాధితురాలు హోటల్‌కు చేరుకోగా ఆమెకు మత్తుమందిచ్చి, అత్యాచారానికిపాల్పడ్డాడు. పోర్నోగ్రఫీ వీడియో చిత్రీకరించి ఆమెను తరచుగా బ్లాక్‌మెయిల్‌ చేసి, పలుమార్లు అత్యాచారానికిపాల్పడ్డాడు కూడా. 

ఖ్యాతి గర్జ్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అ‍భ్యంతరకర వీడియోను బాధితురాలి తండ్రికి పంపి పది లక్షలు డిమాండ్‌ చేయడంతో, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు ఫైల్‌ చేసిన పోలీసులు అలంబాగ్‌లో నిందితుడు సన్నీ గుప్తను అరెస్ట్‌ చేసినట్లు మీడియాకు తెలిపారు.

చదవండి: ల్యాప్‌ టాప్‌, స్మార్ట్‌ ఫోన్‌ను డిటర్జెంట్‌తో శుభ్రం చేసిన టెకీ భార్య.. విడాకుల పంచాయితీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement