పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం | TDP leader raped girl in Pithapuram: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం

Oct 8 2024 3:42 AM | Updated on Oct 8 2024 5:55 AM

TDP leader raped girl in Pithapuram: Andhra pradesh

శివారుకు తీసుకెళ్లి అఘాయిత్యం

కేసు మాఫీకి పోలీసులపై టీడీపీ నేతల ఒత్తిడి 

నిందితుడి భార్య టీడీపీ పట్టణ అధ్యక్షురాలు

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలి­కపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి  అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.  పిఠాపురానికి చెందిన దుర్గాడ జాన్‌ టీడీపీ నేత. ఆయన భార్య దుర్గాడ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్, ప్రస్తుతం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు.

ఆటో డ్రైవర్‌  జాన్‌ మరో మహిళతో కలిసి సోమవారం సాయంత్రం పట్టణంలోని స్టేట్‌ బ్యాంకు వద్ద ఉన్న ఓ బాలికను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నారు. పిఠాపురం శివారు మాధవపురం సమీపంలోని డంపింగ్‌ యార్డు వద్దకు తీసుకెళ్లి  అక్కడ మహిళను కాపలాగా పెట్టి, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా డంపింగ్‌ యార్డులో ప్లాస్టిక్‌ బాటిళ్లు ఏరుకునే వారు జాన్‌ను, మహిళను పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితురాలిని పిఠా­పురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. జాన్‌ను కేసు నుంచి తప్పించాలంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే బాధితురాలి బంధువులు ఆందోళనకు సిద్ధపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement