బాపట్లలో పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.విష్ణు, జిల్లా అధ్యక్షురాలు యేసమ్మ తదితరులు
సాక్షి, బాపట్ల: మహిళలపై దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.విష్ణు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం భారీ ప్రదర్శన జరిగింది. అనంతరం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో జరిగిన సభలో విష్ణు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను సమర్ధంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు.
హిందూత్వ ఫాసిస్టు దాడులను, పితృస్వామిక, కులోన్మాద దాడులు, అత్యాచారాలు, హత్యలపై ప్రతిఘటించే విషయమై మహిళలను చైతన్యపరచాలని కోరారు. వివక్షను, దోపిడీని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి శీలం యేసమ్మ, తెనాలి డివిజన్ అధ్యక్షురాలు టి.కల్పన, పల్లవి, కొండా అన్నమ్మ, జి.మరియమ్మ, పి.లక్ష్మి, అజిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment