women attacks
-
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యను టార్గెట్ చేసి..
కాజులూరు, తూర్పు గోదావరి: తనపై భర్త, అతడి ప్రియురాలు హత్యాయత్నానికి పాల్పడ్డారని.. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పోలీసులు నెల రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని.. ఇకనైనా న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడం కలకలం రేపింది. మీడియాకు ఆమె మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు శివారు చాకిరేవు మెరకకు చెందిన అనసూరి లోవలక్ష్మికి పదేళ్ల కిందట కె.గంగవరం మండలం శివల గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. అయితే అతడు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై లోవలక్ష్మి నిలదీసింది. ఈ నేపథ్యంలో ఒక రోజు అర్ధరాత్రి భర్త, అతడి ప్రియురాలు కలిసి లోవలక్షి్మపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న లోవలక్ష్మి కాజులూరులోని పుట్టింటికి వచ్చేసింది. తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు న్యాయం చేయాలని గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్‌లో ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో కాకినాడ జిల్లా ఎస్పీ రవీద్రనాథ్‌బాబును కలిసి పరిస్థితి వివరించింది. ఎస్పీ ఆదేశాల మేరకు గొల్లపాలెం పోలీసులు లోవలక్ష్మి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అయితే ఎటువంటి కేసూ నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో తనను నెల రోజులుగా అర్ధరాత్రి వరకూ ముద్దాయి మాదిరిగా పోలీస్ స్ట్షేన్ చుట్టూ తిప్పుతున్నారని, ఇకనైనా తనకు న్యాయం చేయకపోతే గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్ ఎదుట ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరో దారి లేదని లోవలక్ష్మి పేర్కొంది. ఆమె ఈవిధంగా మాట్లాడుతున్న వీడియోపై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కౌన్సెలింగ్ వల్లనే జాప్యం ఇది భార్యాభర్తలకు సంబంధించిన కేసు. ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. అందువల్లనే కేసు నమోదు ఆలస్యమైంది. రెండుసార్లు కౌన్సెలింగ్ చేసినా వారు అంగీకరించలేదు. దీంతో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. – ఎం.తులసీరామ్, ఎస్సై, గొల్లపాలెం -
అర్ధరాత్రి వైన్స్ వద్ద ఉద్రిక్తత.. మహిళలపై దాడి
అర్ధరాత్రి నడిరోడ్డుమీద మహిళలు హల్చల్ చేశారు. వైన్ షాప్ వద్ద బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఓ వైన్ షాప్ వద్దకు గురువారం అర్ధరాత్రి కొందరు మహిళలు చేరుకున్నారు. అనంతరం వైన్ షాపు మూసివేయాలని వారు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహిళలు, వైన్ షాపు సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, వైన్ షాపులో ఉన్న మహిళా బౌన్సర్లు.. నిరసనకు దిగిన మహిళలపై దాడులకు దిగడంతో వారు కూడా ఎదురు దాడికి పాల్పడ్డారు. బౌన్సర్లు.. మహిళలను చితకబాదడంతో వారు గట్టిగా కేకలు వేశారు.కాగా, ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్న దక్షిణ ఢిల్లీలోని తిగ్డి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రంజిత్ జోక్యం వారికి నప్పజెప్పే ప్రయత్నం చేశాడు. ఫుల్ ఫైర్‌లో ఉన్న మహిళలు.. పోలీసులపై దాడి చేయడంతో అతడి డ్రెస్ చిరిగిపోయింది. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని 10 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. देवली रेजिडेंशियल ऐरिया में अवैध शराब के ठेके का विरोध कर रही महिलाओं को शराब माफिया ने बाहर के गुंडों को बुलाकर उनको बुरी तरह से पिटवाया। दिल्ली सरकार की नई लीकर पॉलिसी के करण जगह-जगह यही मौहोल बनता जा रहा है केजरीवाल जी आप से निवेदन इस तरह दिल्ली को बर्बाद न करें। pic.twitter.com/7I7lSkWAnO — Siddharthan (@siddharthanbjp) June 24, 2022 ఇది కూడా చదవండి: ఫన్నీ వీడియో: తప్పతాగి పెళ్లి కూతురి బదులు.. చెంప పగలకొట్టి రచ్చ చేసిన మరదలు -
బెల్ట్‌షాపు నిర్వాహకుడిపై మహిళల దాడి
-
వీఆర్ఏపై మహిళా చెప్పుతో దాడి
సాక్షి, ఆసిఫాబాద్ : తమకు వారసత్వంగా రావాల్సిన భూమిని రెవెన్యూ అధికారులు తమ బంధువులకు పట్టాచేశారని, తమకు న్యాయం చేయాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని ఆగ్రహించిన మహిళా రైతు ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్ఏపై చెప్పుతో దాడి చేసిన సంఘటన మంగళవారం కుమురంభీం జిల్లాలోని రెబ్బెన మండలంలో చోటు చేసుకుంది. బాధిత రైతు కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... రెబ్బెన మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన దుర్గం సాంబయ్య తండ్రికి సుమారు 42 ఎకరాలు భూమి ఉంది. వారసత్వంగా సాంబయ్యకు అందులో సగభాగం రావాల్సి ఉంది. రెవెన్యూ అధికారుల అండదండలతో దుర్గం ప్రభాకర్, మల్లయ్య పట్టాలు చేయించుకున్నారని ఆరోపించింది. దీంతో తమకు న్యాయంగా రావాల్సిన భూమి తమకు అప్పగించాలని కోరుతూ సాంబయ్య కుటుంబ సభ్యులు రెండు సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇదే సమస్యను పరిష్కరించాలని కోరుతూ గతంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఎంతకీ తమకు న్యాయం జరగకపోవటంతో గత నెల 29న సాంబయ్య కుమారుడు దుర్గం శ్రీనివాస్ ఏకంగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి సైతం ప్రయత్నించాడు. దీంతో ఆర్డీవో సిడాం దత్తు వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన నేటికి పరిష్కారం లభించలేదు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సాంబయ్య కుటుంబ సభ్యులు దుర్గం శ్రీనివాస్, మల్లయ్య, పోషయ్య, దుర్గం లక్ష్మి, దుర్గం జమున, దుర్గం అమృతలు వీఆర్వో ఉమ్‌లాల్‌తో వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహానికిలోనైన దుర్గం లక్ష్మి వీఆర్ఏ జానయ్యపై చెప్పుతో దాడికి పాల్పడింది. విషయాన్ని తెలుసుకున్న ఎస్సై రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అకారణంగా దాడికి పాల్పడ్డారు: వీఆర్ఏ దుర్గం సాంబయ్య భూమి సమస్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ అకారణంగా దుర్గం లక్ష్మి తహసీల్దార్ కార్యాలయంలోనే చెప్పుతో దాడి చేసింది. 1993లో మల్లయ్య, ప్రభాకర్‌కు పట్టాలు అయ్యాయి. నేనేమో 2008లో ఉద్యోగంలో చేరాను. నేనే పట్టాలు చేయించానని అకారణంగా నాపై దాడి చేసి అక్కడే ఉన్న వీఆర్వో ఉమ్‌లాల్‌పై సైతం దాడి చేసేందుకు ప్రయత్నించారు. -
మహిళలపై దాడులను ప్రతిఘటించాలి
సాక్షి, బాపట్ల: మహిళలపై దాడులు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.విష్ణు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం భారీ ప్రదర్శన జరిగింది. అనంతరం స్థానిక అంబేడ్కర్ భవన్లో జరిగిన సభలో విష్ణు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను సమర్ధంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. హిందూత్వ ఫాసిస్టు దాడులను, పితృస్వామిక, కులోన్మాద దాడులు, అత్యాచారాలు, హత్యలపై ప్రతిఘటించే విషయమై మహిళలను చైతన్యపరచాలని కోరారు. వివక్షను, దోపిడీని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి శీలం యేసమ్మ, తెనాలి డివిజన్ అధ్యక్షురాలు టి.కల్పన, పల్లవి, కొండా అన్నమ్మ, జి.మరియమ్మ, పి.లక్ష్మి, అజిత పాల్గొన్నారు. -
మోదీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల బీజేపీ ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును గట్టిగా వ్యతిరేకించిన యశ్వంత్ మరోసారి తన వ్యాఖ్యలతో అధికార పార్టీని ఇరుకున పెట్టారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, మహిళల రక్షణ, విదేశాంగ విధానం, అంతర్గత ప్రజాస్వామ్యం తదితర అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ భారత్ అని బీజేపీ ప్రభుత్వం చెపుతున్న వ్యాఖ్యలను యశ్వంత్ సిన్హా తిప్పికొట్టారు. ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం కాగా.. దేశంలో రోజురోజుకు మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లైంగిక హత్యలకు ఆరికట్టకపోగా, కొందర బీజేపీ నేతలు హత్యల్లో నిందితులుగా ఉన్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ... గత నాలుగేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్నదని.. దేశంలో రైతులు, నిరుద్యోగులు, పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయంగా మారిందని, పేదల సొమ్ముతో విదేశాలకు పారిపొయిన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై స్పందిస్తూ.. దేశంలో గతంతో పోలిస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిలో బీజేపీ నేతల ప్రమేయం ఉన్నా వారిని శిక్షంచడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. విదేశాంగ విధానం పూర్తిగా అసంబద్దంగా ఉందని, పాకిస్తాన్, చైనాతో అనుసరిస్తున్న విధానం దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. వివిధ దేశాలు తిరుగుతూ ఆ దేశ నేతలను కౌగిలించుకోవడం తప్ప మోదీ విదేశీ పర్యటనలతో దేశానికి ఎలాంటి లాభం లేదన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పూర్తిగా నాశనమైందని, ఎంపీలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలిపే అవకాశం కూడా మోదీ కల్పించలేకపోయారని దుయ్యబట్టారు. ఎలాంటి చర్చ జరగకుండానే పార్లమెంట్ సమావేశాలు తుడిచిపొట్టుకుపొవడాన్ని ప్రస్తావిస్తూ... దేశంలో ప్రజాస్వామ్యం ముప్పులో ఉందని సిన్హా హెచ్చరించారు. గత ఎన్నికల్లో బీజేపీ 31 శాతం ఓట్లు మాత్రమే సాధించిందని, 69 శాతం మంది ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. -
కానిస్టేబుల్‌ను చితకబాదిన మహిళలు
చెన్నై: మద్యం మత్తులో మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన కానిస్టేబుల్‌కు ప్రజలు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై సబర్బన్‌లో చోటుచేసుకుంది. సేలం జిల్లా ఓమలూరు సమీపానగల అమరకుంది గ్రామవాసి ముత్తుసామి కుమారుడు మహేంద్రన్. చెన్నై సబర్బన్ సాయుధ దళంలో పోలీసు కానిస్టేబుల్‌గా మహేంద్రన్ పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య శారద ఉంది. 10 రోజుల కిందట శారద మగబిడ్డను ప్రసవించింది. బిడ్డను చూసేందుకు మహేంద్రన్ సెలవు తీసుకున్నాడు. ఈ క్రమంలో మహేంద్రన్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. మహేంద్రన్ బృందం అరుపులతో ఇబ్బందికి గురైన అదే ప్రాంతానికి చెందిన మహిళలు మద్యం సేవించవద్దని సూచించారు. అందుకు మహేంద్రన్ తాను పోలీసునని, తననేమీ చేయలేరని తెలుపుతూ మహిళలను అసభ్యంగా దూషించాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు స్థానిక ప్రజలకు ఈ విషయం తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న ప్రజలు అక్కడ మద్యం సేవించవద్దని, గొడవ చేయొద్దని చెప్పడంతో ఆగ్రహించిన మహేంద్రన్ వారిపై దాడికి యత్నించాడు. దీంతో గ్రామస్థులతో కలిసి మహిళలు మహేంద్రన్‌పై ఎదురు దాడికి దిగారు. తర్వాత అతణ్ని విద్యుత్ స్తంభానికి కట్టివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులకు మహేంద్రన్ను అప్పగించారు.