
అర్ధరాత్రి నడిరోడ్డుమీద మహిళలు హల్‌చల్ చేశారు. వైన్ షాప్ వద్ద బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది.
వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఓ వైన్ షాప్ వద్దకు గురువారం అర్ధరాత్రి కొందరు మహిళలు చేరుకున్నారు. అనంతరం వైన్ షాపు మూసివేయాలని వారు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహిళలు, వైన్ షాపు సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, వైన్ షాపులో ఉన్న మహిళా బౌన్సర్లు.. నిరసనకు దిగిన మహిళలపై దాడులకు దిగడంతో వారు కూడా ఎదురు దాడికి పాల్పడ్డారు. బౌన్సర్లు.. మహిళలను చితకబాదడంతో వారు గట్టిగా కేకలు వేశారు.కాగా, ఆ ప్రాంతంలోనే విధులు నిర‍్వహిస్తున్న దక్షిణ ఢిల్లీలోని తిగ్డి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రంజిత్ జోక్యం వారికి నప్పజెప్పే ప్రయత్నం చేశాడు.
ఫుల్ ఫైర్‌లో ఉన్న మహిళలు.. పోలీసులపై దాడి చేయడంతో అతడి డ్రెస్ చిరిగిపోయింది. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని 10 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
देवली रेजिडेंशियल ऐरिया में अवैध शराब के ठेके का विरोध कर रही महिलाओं को शराब माफिया ने बाहर के गुंडों को बुलाकर उनको बुरी तरह से पिटवाया।
— Siddharthan (@siddharthanbjp) June 24, 2022
दिल्ली सरकार की नई लीकर पॉलिसी के करण जगह-जगह यही मौहोल बनता जा रहा है केजरीवाल जी आप से निवेदन इस तरह दिल्ली को बर्बाद न करें। pic.twitter.com/7I7lSkWAnO
ఇది కూడా చదవండి: ఫన్నీ వీడియో: తప్పతాగి పెళ్లి కూతురి బదులు.. చెంప పగలకొట్టి రచ్చ చేసిన మరదలు
Comments
Please login to add a commentAdd a comment