బాలికపై లైంగికదాడికి యత్నం | Man Tried To Rape Girl In Guntur | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడికి యత్నం

Published Tue, Nov 27 2018 10:16 AM | Last Updated on Tue, Nov 27 2018 10:16 AM

Man Tried To Rape Girl In Guntur - Sakshi

దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌ ముందు పెద్ద సంఖ్యలో గుమిగూడిన మహిళలు

సాక్షి, దాచేపల్లి : మండలంలోని పెదగార్లపాడు గ్రామంలో బాలికపై లైంగికదాడి యత్నం జరిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అత్యాచారయత్నంకు పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలికి న్యాయం  చేయాలని గ్రామస్తులు భారీ సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తల్లి చనిపోగా, తండ్రి మరో చోట ఉండటంతో 17 సంవత్సరాల వయస్సున్న మైనార్టీ వర్గానికి చెందిన బాలిక తాతయ్య, నాయనమ్మల వద్ద ఉంటోంది.

శనివారం రాత్రి 11 గంటల సమయంలో గ్రామానికి చెందిన కర్పూరపు వెంకటేశ్వర్లు కుమారుడు నాగేశ్వరరావు బాలిక ఉంటున్న ఇంట్లో కరెంట్‌ మెయిన్‌ స్విచ్‌ ఆపి ఇంట్లోకి ప్రవేశించాడు. ఎంత సేపటికి కరెంట్‌ రాకపోవటంతో ఇంట్లో ఉన్న వృద్ధులు, బాలిక నిద్ర లేచారు.

పక్కింట్లో కరెంట్‌ ఉండి వీరి ఇంట్లో లేకపోవటంతో బోర్డు వైపు చూడగా, కరెంట్‌ మెయిన్‌ ఆపి ఉన్నట్టు గమనించి తిరిగి వేశారు. దీంతో కరెంట్‌ సరఫరా అయింది. ఇంట్లో గదిలో పడుకున్న బాలికపై అప్పటివరకు మంచం కింద దాక్కున్న నాగేశ్వరరావు లేచి లైంగిక దాడి  చేయబోయాడు. బాలిక కేకలు వేయటంతో తాత, నాయనమ్మలు లేచి నాగేశ్వరరావును బలవంతంగా బయటకు పంపించారు. బయటకు ఈ విషయం చెప్పొద్దంటూ నాగేశ్వరరావు బెది రించాడు. బాలిక, తాత, నాయనమ్మ ముస్లిం పెద్దలకు చెప్పారు.

ఈ నేపథ్యంలో సోమవారం ముస్లింలతో పాటు మహిళలు భారీగా తరలివచ్చి బాలికతో ఫిర్యాదు ఇప్పించారు. అత్యాచార యత్నం చేసిన నాగేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం నేతలు డిమాండ్‌ చేశారు. బాలిక ఫిర్యాదుమేరకు నిందితుడు నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రఫీ చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement