Villagers concern
-
అంబేడ్కర్ చిత్రపటాన్ని కాల్పించిన టీచర్‌కు దేహశుద్ధి
పెదపులివర్రు (భట్టిప్రోలు): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని విద్యార్థులతో ముక్కలు చేయించి, కాల్పించిన ఉపాధ్యాయుడికి పెదపులివర్రు గ్రామస్తులు బుధవారం దేహశుద్ధి చేశారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రులోని నాదెళ్ల సుబ్బరాయచౌదరి ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు వి.నరసింహారావు ఏప్రిల్ 14న విద్యార్థులతో అంబేడ్కర్ చిత్రపటాన్ని ముక్కలు చేయించి, కాల్పించాడు. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. హైస్కూల్ స్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు. వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునః ప్రారంభమైనా సమస్య పరిష్కారమవలేదు. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. ఉపాధ్యాయుడు నరసింహారావుకు బుధవారం దేహశుద్ధి చేశారు. గొరిగపూడి పంచాయతీ వరికూటివారిపాలేనికి చెందిన నరసింహారావు మొదటి నుంచీ ఎస్సీ విద్యార్థులపై వివక్ష చూపే వాడని, చితకబాదేవాడని గ్రామస్తులు ఆరోపించారు. విద్యార్థుల మధ్య కుల చిచ్చు పెడతాడని తెలిపారు. పోలీసులు గ్రామానికి చేరుకు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని హైస్కూల్ గదిలో ఉంచారు. బాపట్ల డిప్యూటీ డీఈవో ఎం. వెంకటేశ్వర్లు కూడా అక్కడికి వచ్చి గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయుడు నరసింహారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని విద్యా శాఖాధికారులు ప్రకటించారు. ఇందుకు గ్రామస్తులు ససేమిరా అన్నారు. అంబేడ్కర్ చిత్రపటాన్ని ముక్కలు చేసి కాల్పించిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రిసిటీ యాక్ట్ – 2015 ప్రకారం కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిచే అంబేడ్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేయించి, క్షమాపణ చెప్పించాలని గ్రామస్తులు భీష్మించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సాయంత్రం 6:30 గంటలకు బాపట్ల డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు అక్కడికి చేరుకున్నారు. రాత్రి 8:30 గంటల వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు పోలీసులు గ్రామస్తులను చెల్లా చెదురు చేశారు. ఆ తరువాత ఉపాధ్యాయుడు నరసింహారావును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తునకు జిల్లాస్థాయి ప్రత్యేక అధికారిని నియమించాలని రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బుస్సా నాగరాజు, వేమూరు నియోజకవర్గ కన్వీనర్ గద్దె యతీష్, ఆలిండియా షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కార్యదర్శి యన్నం సురేష్ డిమాండ్ చేశారు. నరసింహారావుకు సహకరించిన మరో పీఈటీ వి.శ్రీనివాసరావుపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్ను
ఇచ్ఛాపురం రూరల్: ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్నుపడింది. దానిని చదును చేసి.. ప్లాట్లుగా విభజించి విక్రయించాలన్న దురాలోచనతో పొక్లెయిన్‌తో రంగంగలోకి దిగాడు. అడ్డొచ్చిన వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. దీంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తులసిగాం పంచాయతీ పరిధిలోని ఇన్నేశుపేట పొలిమేరలో 20 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. అందులో పాతికేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శీర పురుషోత్తం చెట్లు నాటి గ్రామస్తుల సహకారంతో ఆధ్యాత్మిక స్థలంగా అభివృద్ధి చేశాడు. ఆయనను స్థానికులు పూజారిగా పిలుచుకుంటారు. దీనికి పక్కనే ప్రభుత్వం విశ్రాంతి భవనం నిర్మించింది. ఇదే ప్రాంతంలో ప్రస్తుతం రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణంలో ఉంది. ఆ స్థలం పక్కనే బలరాంపురం గ్రామానికి చెందిన లండ సూర్యనారాయణ (బగ్గేడు)కు స్థలం ఉంది. దీన్ని టీడీపీ నేత దుక్క వెంకటేష్ ఇటీవల ప్లాట్లుగా విభజించి విక్రయించే నిమిత్తం కొనుగోలు చేశాడు. రోడ్డు పక్కనే విలువైన ఆధ్యాత్మిక స్థలం ఉండటంతో దాన్ని ఆక్రమించేందుకు ఇటీవల పొక్లెయిన్‌తో చెట్లు పడగొట్టాడు. అడ్డుకోవడానికి వెళ్లిన పురుషోత్తంపై దౌర్జన్యం చేసి కొట్టాడు. దీంతో గ్రామపెద్దలు, మహిళలు టీడీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేసి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది కూడా దుక్క వెంకటేష్‌కు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేశా గ్రామస్తుల సహకారంతో స్థలాన్ని అభివృద్ధి చేశాను. కార్తీక మాసంలో మహిళలు ఇక్కడ వన భోజనాలు చేస్తుంటారు. రోడ్డు పక్కన ఉండటంతో ఈ స్థలాన్ని వెంకటేష్ ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. చెట్లను ధ్వంసం చేశారు. అడ్డుకుంటే నాపై దాడి చేశారు. – శీర పురుషోత్తం, ఇన్నేశుపేట -
బాలికపై లైంగికదాడికి యత్నం
సాక్షి, దాచేపల్లి : మండలంలోని పెదగార్లపాడు గ్రామంలో బాలికపై లైంగికదాడి యత్నం జరిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అత్యాచారయత్నంకు పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్తులు భారీ సంఖ్యలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తల్లి చనిపోగా, తండ్రి మరో చోట ఉండటంతో 17 సంవత్సరాల వయస్సున్న మైనార్టీ వర్గానికి చెందిన బాలిక తాతయ్య, నాయనమ్మల వద్ద ఉంటోంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో గ్రామానికి చెందిన కర్పూరపు వెంకటేశ్వర్లు కుమారుడు నాగేశ్వరరావు బాలిక ఉంటున్న ఇంట్లో కరెంట్ మెయిన్ స్విచ్ ఆపి ఇంట్లోకి ప్రవేశించాడు. ఎంత సేపటికి కరెంట్ రాకపోవటంతో ఇంట్లో ఉన్న వృద్ధులు, బాలిక నిద్ర లేచారు. పక్కింట్లో కరెంట్ ఉండి వీరి ఇంట్లో లేకపోవటంతో బోర్డు వైపు చూడగా, కరెంట్ మెయిన్ ఆపి ఉన్నట్టు గమనించి తిరిగి వేశారు. దీంతో కరెంట్ సరఫరా అయింది. ఇంట్లో గదిలో పడుకున్న బాలికపై అప్పటివరకు మంచం కింద దాక్కున్న నాగేశ్వరరావు లేచి లైంగిక దాడి చేయబోయాడు. బాలిక కేకలు వేయటంతో తాత, నాయనమ్మలు లేచి నాగేశ్వరరావును బలవంతంగా బయటకు పంపించారు. బయటకు ఈ విషయం చెప్పొద్దంటూ నాగేశ్వరరావు బెది రించాడు. బాలిక, తాత, నాయనమ్మ ముస్లిం పెద్దలకు చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం ముస్లింలతో పాటు మహిళలు భారీగా తరలివచ్చి బాలికతో ఫిర్యాదు ఇప్పించారు. అత్యాచార యత్నం చేసిన నాగేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం నేతలు డిమాండ్ చేశారు. బాలిక ఫిర్యాదుమేరకు నిందితుడు నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రఫీ చెప్పారు. -
ఘనంగా సామూహిక వివాహాలు
బజార్హత్నూర్(బోథ్): మండలంలోని భూతాయి(బి) గ్రామపంచాయతీ పరిధి వంజర్‌భూతాయిలో సోమవారం గ్రామాభివృద్ధి కమిటీ, హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఎనిమిది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. గ్రామ పెద్ద పాటిల్ పడ్ మాట్లాడుతూ గ్రామంలో 1992 నుంచి సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో పేద, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారేనని, ఒక వివాహం చేయాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులంతా ఒక నిర్ణయానికి వచ్చి సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించామని, 25 సంవత్సరాలుగా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఒక సంవత్సరంలో గ్రామంలో ఎన్ని సంబంధాలు కుదిరినా వాటన్నింటికీ ఒక తేదీ నిర్ణయించి సామూహిక వివాహాలు జరిపిస్తామని, మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఒక్కో జంటకు రూ.20వేల నుంచి రూ.30 వేలు తీసుకుని మొత్తం రూ.2లక్షలతో టెంట్లు, భోజన ఏర్పాట్లు, బ్యాండుమేళాలు, పెండ్లికి పూలదండలు, బ్రహ్మణుల ఖర్చులు అన్నింటినీ అందులో నుంచే ఖర్చు చేస్తామని తెలిపారు. ఒక్కో జంటకు రూ.30 వేలతో వివాహం చేసే వెసులుబాటు ఉంటుందని, ఆ కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా గ్రామస్తులందరూ సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దినేశ్ ముండే, హరిచంద్ ముండే, ప్రహ్లాద్ పడ్, వినాయక్ ముండే, ప్రభాకర్ ముండే హనుమాన్ యూత్ సభ్యులు ఈశ్వర్, సంతోష్ పడ్, మారుతీ, నాగనాథ్, శివరాజ్, మాధవ్ పాల్గొన్నారు. పెళ్లికి హాజరైన బంధువులు, గ్రామస్తులు -
ప్రైవేట్ పాఠశాలల బస్సులకు నో ఎంట్రీ
పాలకుర్తి, రేగొండ: ప్రైవేట్ పాఠశాలలపై తిరుగుబాటు మొదలైంది. ఆ స్కూల్‌బస్సులను అడ్డుకుంటున్నారు. వరంగల్ జిల్లా రేగొండ మండలం దామరంచపల్లిలో గురువారం ప్రైవేట్ స్కూల్ బస్సును గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మూడున్నరేళ్ల పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలని కోరారు. పాలకుర్తి మండలం గూడూరు సర్పంచ్ మాచర్ల పుల్లయ్య ప్రైవేటుస్కూళ్లకు నోటీ సులు జారీ చేశారు. తమ పిల్లలను ప్రభుత్వ స్కూ ళ్లకే పంపించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.