
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. ఓ మహిళను తెలిసిన వ్యక్తే రేప్ చేశాడు. తాగిన మత్తులో ఆమె ఇంటికి వెళ్లి ఈ అఘాత్యానికి ఒడిగట్టాడు. దక్షిణ ఢిల్లీ మెహ్రౌలీ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది.
అయితే ఘటన అనంతరం బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించింది. నిందితుడు గదిలో ఉండగా.. ఎలాగోలా తాను బయటకు వచ్చి తాళం వేసింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. రంగంలోకి దిగిన వాళ్లు అతడ్ని అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
నిందితుడు ఖాన్పూర్‌కు చెందిన హర్‌జీత్ యాదవ్ అని పోలీసులు వెల్లడించారు. ఇతడు బాధితురాలికి 45 రోజులుగా తెలుసని పేర్కొన్నారు. అంతేకాదు అతడు ఓ రాజకీయ పార్టీకి బ్లాక్ స్థాయి అధ్యక్షుడు అని వివరించారు. మద్యం మత్తులో వెళ్లి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పారు.
చదవండి: పీఎఫ్‌ఐపై రెండో విడత దాడులు.. కర్ణాటకలో 45 మంది అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment