క‌రోనా బాధితురాలిపై డ్రైవ‌ర్‌ లైంగిక దాడి | Ambulance Driver Arrested For Allegedly Raping Teen Covid Patient | Sakshi
Sakshi News home page

క‌రోనా బాధితురాలిపై డ్రైవ‌ర్‌ లైంగిక దాడి

Published Sun, Sep 6 2020 4:17 PM | Last Updated on Sun, Sep 6 2020 4:25 PM

Ambulance Driver Arrested For Allegedly Raping Teen Covid Patient - Sakshi

తిరువ‌నంత‌పురం : కేరళలో దారుణం చోటు చేసుకుంది. క‌రోనా బారీన ప‌డ్డ యువ‌తిని ‌ఐసోలేష‌న్ కేంద్రానికి తీసుకెళ్తూ మార్గం మ‌ధ్య‌లో అంబులెన్స్  డ్రైవర్ ఆమెపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం ఆమెను ఐసోలేషన్ కేంద్రంలో వ‌దిలి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న శ‌నివారం అర్ధరాత్రి జ‌రిగింది.

వివరాలు.. తిరువ‌నంత‌పురానికి 100 కిమీ దూరంలో ఉన్న ప‌ఠ‌న‌మిట్ట ప్రాంతంలో 19 ఏళ్ల యువ‌తికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆమె బంధువులు క్వారంటైన్ సెంట‌ర్‌కు తర‌లించేందుకు అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఈ నేప‌థ్యంలో యువతిని ఐసోలేష‌న్ కేంద్రానికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌ నౌఫాల్‌ (25) వచ్చాడు. అయితే అప్ప‌టికే ఒక వృద్ధురాలిని కూడా క్వారంటైన్ సెంట‌ర్‌కు తీసుకెళ్లాల్సి ఉంది. దీంతో ఇద్దరిని వేర్వేరు చోట్లకు తీసుకెళ్లాల్సి రావడంతో మొదట వృద్ధ మహిళను ఒక ఆసుప‌త్రిలో వ‌దిలి అక్క‌డినుంచి యువ‌తిని తీసుకొని పండాల‌మ్ ఆసుప‌త్రికి బ‌యల్దేరాడు.(చ‌ద‌వండి :మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌: వేషం మార్చి..)

అయితే అప్ప‌టికే యువ‌తిపై క‌న్నేసిన నౌఫాల్‌ అంబులెన్స్ ఖాళీ ప్ర‌దేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. అనంతరం అర్ధరాత్రి ఆమెను కోవిడ్‌ -19 సంరక్షణ కేంద్రంలో వదిలేశాడు. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు అరన్ములా పోలీసులు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఘటనపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైవర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని '108 సర్వీస్' కార్యాచరణ భాగస్వామి జీవీకే సంస్థకు సూచించారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement