తిరువనంతపురం : కేరళలో వర్షాలు, వరదల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన ప్రాంతాల్లో ఉన్న కరోనా వైరస్ సోకిన వారికి కేరళ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. వర్షాల కారణంగా రావాణా మార్గాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మంది కరోనా వైరస్ పేషెంట్లను ఆస్పత్రికి తరలించేందుకు రెస్య్కూ బోట్లను అంబులెన్స్‌లుగా మార్చింది. రాష్ట్ర జల రవాణా శాఖ ఈ ఆలోచన సత్ఫలితాలను ఇస్తోందని విజిలెన్స్ వింగ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఇక పోతే భారత్‌లో తొలి కోవిడ్ కేసు వెలుగు చూసిన కేరళలో సోమవారం కొత్తగా 1,725 కేసులు నమోదయ్యాయి. మొత్తం 46,140 మంది కరోనా బారిన పడగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 15,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 30,025 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కేవలం 169 మంది మృత్యువాత పడ్డారు. (కేరళ గోల్డ్ స్కామ్ : మరో కీలక అప్ డేట్)
Comments
Please login to add a commentAdd a comment