తిరువనంతపురం: కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది. వైరస్ వ్యాప్తి కోసం లాక్‌డౌన్ విధించడంతో ఎందరో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. బతుకుతెరువు కోసం పట్టణానికి వచ్చిన వారు తిరిగి పల్లే బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ అంబులెన్స్ డ్రైవర్‌గా మారింది. వివరాలు.. కేరళ కోజికోడ్‌కు చెందిన దీప జోసేఫ్ కరోనాకు ముందు ఓ కాలేజ్‌లో బస్సు డ్రైవర్‌గా పని చేసేది. అయితే వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూత పడ్డాయి. దాంతో దీప ఉద్యోగం కోల్పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో అంబులెన్స్ డ్రైవర్‌గా మారింది. (కష్టకాలంలో.. కరోనా పరుపు)
ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ.. ‘కాలేజీ మూతపడటంతో చేస్తున్న ఉద్యోగం ఉడింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ మాయదారి రోగం వల్ల ప్రస్తుతం కేరళలో ఎక్కువ ఉద్యోగాలు లేవు. మా ఇంట్లో నేను, నా భర్త, ఇద్దరు పిల్లలు, మా అమ్మ ఉంటున్నాం. వీరందరిని పోషించాలంటే ఏదో ఒక పని చేయాలి. దాంతో అంబులెన్స్ డ్రైవర్‌గా మారాను. నా కొడుకు పదో తరగతి చదువుతున్నాడు.. కుమార్తె 8వ తరగతి చదువుతోంది. వారు నాకు పూర్తి మద్దతు ఇస్తారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment