Rescue boats
-
రెస్య్కూ బోట్లను అంబులెన్స్‌లుగా మార్చిన కేరళ
తిరువనంతపురం : కేరళలో వర్షాలు, వరదల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన ప్రాంతాల్లో ఉన్న కరోనా వైరస్ సోకిన వారికి కేరళ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. వర్షాల కారణంగా రావాణా మార్గాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మంది కరోనా వైరస్ పేషెంట్లను ఆస్పత్రికి తరలించేందుకు రెస్య్కూ బోట్లను అంబులెన్స్‌లుగా మార్చింది. రాష్ట్ర జల రవాణా శాఖ ఈ ఆలోచన సత్ఫలితాలను ఇస్తోందని విజిలెన్స్ వింగ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఇక పోతే భారత్‌లో తొలి కోవిడ్ కేసు వెలుగు చూసిన కేరళలో సోమవారం కొత్తగా 1,725 కేసులు నమోదయ్యాయి. మొత్తం 46,140 మంది కరోనా బారిన పడగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 15,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 30,025 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కేవలం 169 మంది మృత్యువాత పడ్డారు. (కేరళ గోల్డ్ స్కామ్ : మరో కీలక అప్ డేట్) -
ఐ మిస్ యూ ... అంటూ ఎస్ఎంఎస్లు
ఓ వైపు పిల్లలు, పెద్దలు రక్షించండి, కాపాడండి అంటూ అర్తనాదాలు... మరో వైపు కళ్ల వెంట దారాపాతంగా కారుతున్న కన్నీరు. మృత్యువు తమను కబళించేందుకు సిద్ధంగా ఉందని తెలుసు... ఏ క్షణానైన మరణం తన కౌగిట్లోకి తమను బలవంతంగా లాక్కుపోతుంది. ఆ తరుణంలో ఆ చిన్నారి విద్యార్థులకు తల్లితండ్రులు, కుటుంబసభ్యులు గుర్తుకు వచ్చారు. అంతే ఇక ఆలస్యం చేయలేదు. తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లు బయటకు తీశారు. తర్వాత క్షణం ఏం జరుగుతోందో తెలియని ఆ విద్యార్థులు తల్లితండ్రులపై ప్రేమ, ప్రమాదంలో చిక్కుకున్నామనే భయం, జీవితం ఇక లేదనే నిరాశలతో సమ్మిళితమైన సంక్షిప్త సందేశాల (ఎస్ఎంఎస్)ను తమ తమ తల్లితండ్రులకు పంపారు. ఐ లవ్ యూ మమ్, ఐ లవ్ యూ డాడ్ , ఐ మిస్ యూ... జీవితంలో మరోసారి ఈ సందేశం పంపేందుకు అవకాశం రాకపోవచ్చు అంటూ షిన్ యంగ్ జిన్ అనే విద్యార్థి తన తల్లితండ్రులకు ఎస్ఎంఎస్ పంపగా, తాను ప్రయాణిస్తున్న నౌక ఓ పక్కకు ఒరిగిపోయింది... తమను రక్షించండి అంటూ మరో విద్యార్థి కిమ్ వూంగ్ కి తన సోదరుడిని ఎస్ఎంఎస్ ద్వారా వేడుకున్నాడు. ఆ ఎస్ఎంఎస్లు గురువారం దేశవ్యాప్తంగా వివిధ మీడియాలు సంస్థలు తమ తమ పత్రికలలో ప్రచురించాయి. విహార యాత్రకు వెళ్లి విషాద యాత్రగా మారిన తరుణంలో కన్న బిడ్డలు జాడ తెలియక ఆయా కుటుంబాలు విద్యార్థులు పంపిన సందేశాలను చూసి రోధిస్తున్న తీరు దేశవ్యాప్తంగా ప్రజలను శోక సంద్రంలో ముంచింది. దాదాపు 459 మంది (అత్యధిక మంది విద్యార్థులు)తో విహార యాత్రకు బయలుదేరిన ఫెర్రీ (నౌక) బుధవారం ఉదయం దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఫెర్రీ క్రమక్రమంగా నీటీలో మునిగిపోయింది. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న దక్షిణ కొరియా ఉన్నతాధికారులు వెంటనే తీర గస్తీ దళం, సైన్యాన్ని రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టింది. ఆ ప్రమాదంలో నలుగురు మరణించగా, 55 మంది గాయాలతో బయటపడ్డారు. మరో 292 మంది జాడా ఇంత వరకు తెలియరాలేదు. కొరియాలో సంభవించిన ఫెర్రీ దుర్ఘటన 1912లో ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. అనాటి నౌక దుర్ఘటనలో పలువురుని సైన్యం కాపాడిన 1500 మంది జల సమాధి అయిన సంగతి తెలిసిందే. -
మరో ‘టైటానిక్’ ప్రమాదం
* ద.కొరియా తీరంలో నౌక మునక * నలుగురి మృతి, 292 మంది గల్లంతు సియోల్: దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో ఘోరమైన ప్రమాదం సంభవించింది. 459 మంది తో ప్రయాణిస్తున్న నౌకలో ప్రమాదం తలెత్తి బుధవారం మెల్లమెల్లగా మునిగిపోయింది. ఇది మునగడానికి గంటల సమయం పట్టడంతో ఈలోగా హెలికాప్టర్లు, ఇతర నౌకల్లో అక్కడకు చేరుకున్న సహాయక సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయినా ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 55 మంది గాయాలతో బయటపడ్డారు. మరో 292 మంది జాడ లేదు. ఈ ప్రమాదం 1912లో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక ఉదంతాన్ని గుర్తుకుతెచ్చింది. నాటి ఘటనలోనూ నౌక కొన్ని గంటలపాటు మునగ్గా, లైఫ్బోట్ల సాయంతో పలువురిని కాపాడారు. ఆ ప్రమాదంలో 1,500 మంది దాకా చనిపోయారు. తాజా ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. జాడ తెలియని వారిలో చాలామంది ఓడలోనే చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 146 మీటర్ల పొడవైన ఈ ఓడ ద.కొరియా వాయవ్య ప్రాంతంలోని ఇంచియాన్, జెజు దీవి మధ్య వారానికి రెండు సార్లు ప్రయాణిస్తుంది. ఆ క్రమంలో మంగళవారం రాత్రి ఇంచియాన్ను నుంచి బయలుదేరిన ఈ ఓడ 14 గంటల పాటు ప్రయాణించి పర్యాటక దీవి జెజు చేరాల్సి ఉంది. అయితే మరో మూడుగంటల్లో గమ్యాన్ని చేరుతుందనగా బ్యాంగ్‌పుంగ్ దీవికి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఓడలో16 నుంచి 17 ఏళ్ల వయసున్న 325 మంది హైస్కూల్ విద్యార్థులు, 15 మంది టీచర్లు, 89 మంది సాధారణ ప్రయాణికులు, 30 మంది సిబ్బంది ఉన్నారని ద.కొరియా భద్రత మంత్రి కంగ్ యంగ్ యు చెప్పారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళా సిబ్బంది, ఒక హైస్కూల్ బాలుడు ఉన్నారు. 164 మందిని కాపాడామన్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం సహాయక చర్యలపైనే దృష్టి పెట్టామని చెప్పారు. నౌక మునిగిపోవడానికి గల కారణాలు తర్వాత అన్వేషిస్తామని అధికారులు చెప్పారు. 37 మీటర్ల లోతున్న సముద్రంలో బురద ఎక్కువగా ఉండడంతో నీటి లోపల అన్వేషణకు కష్టతరంగా ఉందన్నారు.