
ఏ పాత్ర చేస్తే కెమెరా ముందు ఆ పాత్రలా మారిపోతుంటారు చాలామంది నటీనటులు. ఒకవేళ ఆ పాత్రతో బాగా కనెక్ట్ అయితే షూటింగ్ పూర్తయ్యాక కాసేపు ఆ పాత్రలానే ఉండిపోతారు. తాప్సీ ఆ కోవకే చెందుతారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నేను ఒక పాత్ర చేస్తున్నప్పుడు షూటింగ్ ప్యాకప్ చెప్పాక కూడా ఆ పాత్ర ప్రభావం కనీసం పది శాతం అయినా నా మీద ఉంటుంది. అందుకు ఓ ఉదాహరణ చెబుతాను.
‘మన్‌మర్జియాన్’ సినిమాలో నేను ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయిగా చేశాను. మనసులో అనుకున్నది ముఖం మీద చెప్పేస్తాను.గట్టిగా మాట్లాడే పాత్ర. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక కూడా ఆ పాత్రలోనే ఉండిపోయాను. అలాంటి సమయంలో ఒక వ్యక్తి నా అనుమతి తీసుకోకుండా ఫోన్‌తో ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. అంతే.. ‘ఆ ఫోన్ నువ్వు లోపల పెట్టకపోతే ఫోన్‌ని విరగ్గొడతాను’ అని అరిచేశాను. అంత చిన్న విష యానికి అంతలా రియాక్ట్ కానవసరంలేదు. అయితే ఆ పాత్ర తాలూకు ప్రభావం ఉండటంతో అలా చేశాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment