హత్య చేసి కెమెరాలో చిక్కారు | Bengaluru: 27-year-old man's murder caught on camera | Sakshi
Sakshi News home page

హత్య చేసి కెమెరాలో చిక్కారు

Published Wed, Feb 24 2016 6:15 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

హత్య చేసి కెమెరాలో చిక్కారు

హత్య చేసి కెమెరాలో చిక్కారు

ఓ యువకుడిని అతికిరాతకంగా చంపిన హంతకులు కెమెరాలో దొరికిపోయారు.

బెంగళూరు: ఓ యువకుడిని కిరాతకంగా చంపిన హంతకులు కెమెరాలో దొరికిపోయారు. సీసీటీవీ ఫుటేజి ద్వారా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఈ నెల 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

బెంగళూరు జేజే నగర్లో ఆ రోజు రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. డబ్బు విషయంలో వివాదం ఏర్పడినట్టు తెలుస్తోంది. కొందరు యవకులు అంజాద్ ఖాన్ (27) అనే వ్యక్తిని హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలన్ని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అనంతరం అంజాద్ ఖాన్ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించి 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు బెంగళూరు పశ్చిమ డీసీపీ లభు రామ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement