ప్రపంచవ్యాప్తంగా కెమెరాలు ఫొటోలు, వీడియోలు తీయడానికే ఉపయోగపడతాయి. పోలరాయిడ్ కెమెరాలైతే, తక్షణమే ఫొటోలను ముద్రించి అందిస్తాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న కెమెరాను పోలరాయిడ్ కెమెరా స్ఫూర్తితోనే తయారు చేశారు. అయితే, ఇది ఫొటోలకు బదులుగా కవిత్వాన్ని ముద్రిస్తుంది. ఈ కెమెరాతో ఏవైనా దృశ్యాలను బంధిస్తే, దృశ్యాలకు అనుగుణమైన కవిత్వాన్ని ముద్రించి అందిస్తుంది. దృశ్యాల ద్వారా కవిత్వాన్ని సృష్టించడానికి ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది.
ఈ కెమెరా విడిభాగాలుగా దొరుకుతుంది. విడిభాగాలను జోడించుకుని, దీనిని ఎవరికి వారే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో సింగిల్‌బోర్డ్ కంప్యూటర్, రేకు డబ్బా, వెబ్‌కామ్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దీని ద్వారా కోరుకున్న స్థానిక భాషల్లో కూడా కవిత్వాన్ని ముద్రించుకోవచ్చు. థర్మల్ పేపర్‌పై ఈ కెమెరా ముద్రించే కవితల కాగితాలు చూడటానికి సూపర్ మార్కెట్ రశీదుల్లా కనిపిస్తాయి. అమెరికన్ డిజైనర్ శామ్ గార్‌ఫీల్డ్ ఈ కెమెరాకు రూపకల్పన చేశాడు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment