Thermal
-
కవిత్వాన్ని ముద్రించే కెమెరా
ప్రపంచవ్యాప్తంగా కెమెరాలు ఫొటోలు, వీడియోలు తీయడానికే ఉపయోగపడతాయి. పోలరాయిడ్ కెమెరాలైతే, తక్షణమే ఫొటోలను ముద్రించి అందిస్తాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్న కెమెరాను పోలరాయిడ్ కెమెరా స్ఫూర్తితోనే తయారు చేశారు. అయితే, ఇది ఫొటోలకు బదులుగా కవిత్వాన్ని ముద్రిస్తుంది. ఈ కెమెరాతో ఏవైనా దృశ్యాలను బంధిస్తే, దృశ్యాలకు అనుగుణమైన కవిత్వాన్ని ముద్రించి అందిస్తుంది. దృశ్యాల ద్వారా కవిత్వాన్ని సృష్టించడానికి ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. ఈ కెమెరా విడిభాగాలుగా దొరుకుతుంది. విడిభాగాలను జోడించుకుని, దీనిని ఎవరికి వారే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో సింగిల్బోర్డ్ కంప్యూటర్, రేకు డబ్బా, వెబ్‌కామ్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దీని ద్వారా కోరుకున్న స్థానిక భాషల్లో కూడా కవిత్వాన్ని ముద్రించుకోవచ్చు. థర్మల్ పేపర్‌పై ఈ కెమెరా ముద్రించే కవితల కాగితాలు చూడటానికి సూపర్ మార్కెట్ రశీదుల్లా కనిపిస్తాయి. అమెరికన్ డిజైనర్ శామ్ గార్ఫీల్డ్ ఈ కెమెరాకు రూపకల్పన చేశాడు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
నెలాఖరులోగా గ్రిడ్‌కు ‘సూపర్ థర్మల్’!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న 1,600 (2 *800) మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి దశలోని 800 మెగావాట్ల యూనిట్‌ను ఈ నెలాఖరులో గా గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. తొలి యూనిట్ ద్వారా గత రెండు వారాలుగా 650 మెగావాట్ల వరకు నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్తగా నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు, సామర్థ్యం పరీక్షల్లో భాగంగా నిరంతరంగా 72 గంటల పాటు పూర్తి స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాణిజ్యపరమైన ఉత్పత్తికి అర్హత సాధించిన తేదీ(కమర్షియల్ ఆపరేటింగ్ డేట్/సీఓడీ)ని ప్రకటిస్తారు. సీఓడీ ప్రకటన తర్వాత విద్యుత్ కేంద్రాన్ని గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 800 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యంతో తొ లి యూనిట్లో విద్యుదుత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ ఏ ర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను 27 నుంచి గ్రిడ్‌కు సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్‌కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) నుంచి ఇటీవల స్లాట్లను పొందింది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులోగా తొలి యూనిట్ సీఓడీ ప్రకటన ప్రక్రియ పూర్తి చేసుకుని గ్రిడ్‌కు అనుసంధానం కానుంది. వచ్చే అక్టోబర్‌లో రెండో యూనిట్‌కు సీఓడీ ప్రక్రియ నిర్వహించాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణంలో మూడున్నరేళ్ల జాప్యం ! ఎన్టీపీసీ తొలి యూనిట్ నుంచి జూన్ 2020, రెండో యూనిట్ నుంచి నవంబర్ 2020 నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును జూలై 2023కు పొడిగించారు. యూనిట్–1 నిర్మా ణం దాదాపు 8 నెలల కిందటే పూర్తయింది. కాగా, బాయిలర్‌లోని రీహీటర్ ట్యూబ్స్‌కు పగుళ్లు రావడంతో గత డిసెంబర్లో జరగాల్సిన సీఓడీ ప్రక్రియను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరమ్మతుల్లో భా గంగా ట్యూబ్స్‌కు పగుళ్లు వచ్చి న చోట కట్ చేసి వెల్డింగ్‌తో మళ్లీఅతికించారు. ఏకంగా 7,500 చోట్లలో వెల్డింగ్ చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచి్చన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాల్సి ఉండగా, తొలి దశ కింద 1,600 మెగా వాట్ల కేంద్రాన్ని నిర్మి స్తున్న విషయం తెలిసిందే. రూ.10,599 కోట్ల అంచనా వ్య యంతో తొలి దశ ప్రాజెక్టును చేపట్టగా, గత మార్చి నాటికి రూ.10,437 కోట్ల వ్య యం జరిగింది. పనుల్లో జాప్యంతో అంచనా వ్యయా న్ని రూ.10,998 కోట్లకు పెంచారు. డిస్కంలకు ఊరట..! ఎన్టీపీసీ తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే నిరంతరం పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు వీలుపడుతుంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్‌ను రాష్ట్ర పంపిణీ సంస్థ (డిస్కం)లు అధిక ధరలతో పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే విద్యుత్ కొనుగోళ్ల భారం కొంత వరకు తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు. -
‘థర్మల్’ కాల్పులకు ఏడేళ్లు..!
సంతబొమ్మాళి: పొట్ట నింపుతున్న కన్న తల్లిలాంటి తంపర భూములను కాపాడుకోవడం కోసం మత్స్యకారులు, రైతులు రక్తం చిందించి బుధవారం నాటికి ఏడేళ్లు పూర్తికానున్నాయి. అయినా ‘థర్మల్’ మంటలు రగులుతూనే ఉన్నాయి. తమకు జీవనాధారమైన తంపర భూముల్లో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించొద్దని ఉద్యమం హోరున సాగింది. ఈ క్రమంలోనే 2011 ఫిబ్రవరి 28న ఇదే డిమాండ్‌తో రోడ్డెక్కిన థర్మల్ వ్యతిరేకులపై పోలీసులు బుల్లెట్ల వర్షం కురిపించారు. తూటా లకు ముగ్గురు నేలకొరిగారు. వందలాది మంది గాయపడ్డారు. వడ్డితాండ్రలో సుమారు 60 ఇళ్లు, వందలాది ఎకరాల వరిచేలు కుప్పలు బూడిదయ్యారు. ఈ ఘటన అనంతరం థర్మల్ పోరాట ఉద్యమ నాయకులతో పాటు మరి కొందరు అమాయకులు జైలుపాలయ్యారు. నేటికీ కొందరు కేసులంటూ కోర్టులచుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు ఏం జరిగిందంటే... ! సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు... మిట్ట మధ్యాహ్నం... ఉద్యమకారుల లక్ష్యాన్ని నెరవేరనివ్వకుండా చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలతో వందలాది మంది పోలీసు బలగాలు పోతునాయుడుపేట జంక్షన్ వద్ద మోహరించారు. థర్మల్ ప్లాంట్ వద్దంటూ ఆకాశలక్కవరం, గొదలాం, హనుమంతునాయుడుపేట, పోతునాయుడుపేట, సీరపువానిపేట, కొల్లిపాడు, మేఘవరం తదితర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. థర్మల్ ప్లాంట్ వద్దంటూ శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యమకారులపై తొలుత పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తర్వాత విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వజ్రా వాహనం నుంచి పొంగబాంబుల వర్షం కురిపించారు. అప్పటి ఎస్పీ గోపాలరావు నేతత్వంలో ఓఎస్డీ తివిక్రమ్వర్మ, ఏఎస్పీ శ్యామసుందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, సాగర్ తదితరులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పోలీసుల చర్యలకు నిరసనగా ఉద్యమకారులంతా ఉవ్వెత్తున తరలివచ్చి పోలీస్ వాహనాన్ని దగ్ధం చేసి ప్లాంటు పరిసర ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. సహనం కోల్పోయిన పోలీసులు తుపాకీలకు పని చెప్పారు. తూటాల వర్షం కురిపించారు. దీంతో బుల్లెట్లు దూసుకుపోవడంతో జీరు నాగేశ్వరరావు (ఆకాశలక్కవరం), సీరపు యర్రయ్య (సీరపువానిపేట)లు అక్కడికక్కడే కన్నుమూశారు. బత్తిన బారికివాడు (గూళ్లవానిపేట) శరీరంలోనుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ 2011 మే 26వ తేదీన ప్రాణాలు వదిలాడు. వందలాది మంది గాయాల పాలయ్యారు. ఇక్కడ బాంబుల మోత మోగుతుండగానే, మరో వైపు వడ్డితాండ్రలో పోలీస్ బలగాలు అత్యుత్సాహంతో మత్స్యకారులు, స్థానికుల ఇళ్లను తగులబెట్టి వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ రణరంగానికి సరిగ్గా మూడు రోజులు ముందు నుంచే (2011 ఫిబ్రవరి 24 రాత్రి నుంచి) పోలీస్ బలగాలు థర్మల్ పరిసర ప్రాంతాలైన వడ్డితాండ్ర, పోతునాయుడుపేట తదితర గ్రామాలను చుట్టు ముట్టారు. ఇదే ఉత్సాహంతో వడ్డితాండ్ర, హనుమంతునాయుడుపేటల వద్ద థర్మల్ ప్లాంటుకు వ్యతిరేకంగా ఉద్యమ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా, సహాయ నిరాకరణ శిబిరాలను పోలీస్ బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. చల్లారని ఉద్యమ స్ఫూర్తి పోలీసుల తూటాలకు ముగ్గురు ఉద్యమకారులు బలైనా ఉద్యమ స్ఫూర్తి మాత్రం తగ్గలేదు. వడ్డితాండ్రలో థర్మల్‌కు వ్యతిరేకంగా 2010 ఆగస్టు 15 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షలను అప్పటి ఎమ్మెల్సీ ఎంవీఎస్.శర్మ ప్రారంభించారు. మంగళవారం నాటికి వడ్డితాండ్ర దీక్షలు 3,116వ రోజుకు చేరుకున్నాయి. ప్లాంటు ఆగేంత వరకు దీక్షలు ఆగవని ఉద్యమకారులు తేల్చి చెప్పారు. థర్మల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యమకారులను, నాయకులను 400 మందిని అరెస్టు చేయగా 1800 మందికి పైగా కేసులు నమోదు చేశారు. పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను 2011 మార్చి 2వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు. అలాగే మార్చి 3న సీపీఐ, సీపీఎం అప్పటి రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, రాఘవులు పర్యటించి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అలాగే మార్చి 7న వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి థర్మల్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. తాము అధికారంలోకి వస్తే థర్మల్ ప్లాంటును రద్దు చేస్తామని ప్రకటించారు. థర్మల్‌కు వ్యతిరేకంగా మొదటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంది. కాకరాపల్లి కాల్పులపై 2011 డిసెంబర్ 14, 21 తేదీల్లో టెక్కలి ఆర్డీవో కార్యాలయంలో అప్పటి జేసీ శ్రీధర్ మెజిస్ట్రేరియల్ విచార ణ జరిపారు. మెజిస్ట్రేరియల్ విచారణ వలన న్యాయం జరగదని జుడీషయల్ విచారణ చేపట్టాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఏది ఏమైనప్పటికీ కాకరాపల్లి తంపరలో ఈస్టుకోస్టు థర్మల్ ప్లాంటు నిలుపుదల అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని పోరాట కమిటీ కన్వీనర్ అనంతు గన్నూరావు స్పష్టం చేస్తున్నారు. -
‘యాదాద్రి’ ప్లాంటుపై పునర్విచారణ!
జెన్కోకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశం పర్యావరణ అనుమతుల జారీపై నిర్ణయం వాయిదా సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నిర్మించ తలపెట్టిన 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మళ్లీ బహిరంగ విచారణ నిర్వహించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించి జెన్కో రూపొందిన ‘పర్యావరణ ప్రభావంపై అంచనా (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ ఈఐఏ)’ నివేదికలో తీవ్ర లోపాలుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఈఐఏ నివేదికను రూపొందించాలని, దాని ఆధారంగా ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మరోమారు బహిరంగ విచారణ నిర్వహించాలని స్పష్టం చేసింది. గత ఆగస్టు 29న జరిగిన ‘పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ)’ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులపై తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు సమావేశానికి సంబంధించిన మినిట్స్ కాపీని సవరించి మళ్లీ విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినిట్స్‌లో బహిరంగ విచారణ నిర్ణయాన్ని పొందుపరచలేదు. ఈ నేపథ్యంలో తాజాగా చేర్చి సవరించిన మినిట్స్ కాపీని విడుదల చేసింది. కాపీ పేస్ట్ నివేదిక ఇతర ప్రాజెక్టుల నివేదికల నుంచి సమాచారాన్ని తస్కరించి (కాపీ పేస్ట్) ఈ నివేదికను జెన్కో రూపొందించిందని, ప్రాజెక్టుకు సంబంధం లేని ఎన్నో అంశాలను ఈ నివేదికలో చొప్పించినట్లు నిపుణుల కమిటీ నిర్ధారించింది. కథ మళ్లీ మొదటికి కమిటీ అక్షింతల నేపథ్యంలో జెన్కో కొత్తగా ఈఐఏ నివేదిక రూపొందించి దాని ఆధారంగా బహిరంగ విచారణ నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల కోసం జెన్కో చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అధికారుల తప్పిదాలతో ప్లాంట్ నిర్మాణంలో మరింత ఆలస్యం జరుగుతోంది. -
అణువిద్యుత్‌తోనే భవిష్యత్
– జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ ఎచ్చెర్ల: భవిష్యత్ అవసరాలకు అణువిద్యుత్ తప్పనిసరి అని జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం నిర్మాణ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఎన్యూమరేటర్లకు చిలకపాలెంలోని శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్ల తర్వాత బొగ్గు కొరత వెంటాడుతుందని, అప్పుడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అసాధ్యం అని చెప్పారు. ఈ నేపథ్యంలో అణువిద్యుత్ ప్లాంట్లు నిర్మాణం తప్పనిసరి అన్నారు. ఈ ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం సాగుతుందన్నారు. దేశంలో మొత్తం 10 అణుప్రాజెక్టులు ఉన్నాయని, అటువంటి ప్రాజెక్టు మన జిల్లాలో నిర్మించడం జిల్లాకు జాతీయస్థాయి ప్రాధాన్యం లభించినట్లేనని తెలిపారు. ఢిల్లీ, చెన్నై వంటి నగర ప్రాంతాల సమీపంలో అణుపార్కులు ఉన్నాయని చెప్పారు. భవిష్యత్‌లో అణువిద్యుత్ ప్లాంటులు, సౌర, పవన విద్యుత్‌లకు ప్రాధాన్యం పెంచవల్సిన అవసరం ఉందన్నారు. గతంలో 1894 చట్టం ప్రకారం భూసర్వేలు చేసేవారని, 2014లో కొత్త భూ సేకరణ చట్టాలు వచ్చాయన్నారు. ఈ చట్టాలు మేరకు ప్రజల అభిప్రాయం క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లు ప్రజలను చైతన్య పర్చటం, అణువిద్యుత్ ప్రాధాన్యం వివరించటం కీలకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి.మురళీకృష్ణ, ఎచ్చెర్ల డీటీ బి.శ్రీహరిబాబు, ఆర్ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
వైజాగ్ స్టీల్‌కు కోల్ బ్లాక్‌లు కేటాయించండి
బొగ్గు శాఖను కోరిన ఉక్కు శాఖ న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం అవసరమయ్యే థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్‌లను కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖను ఉక్కు మంత్రిత్వశాఖ కోరింది. రాష్ట్రీయ ఇస్పాత నిగమ్ లిమిటెడ్(ఆర్ఐఎన్ఎల్-వైజాగ్ స్టీల్) తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3 మిలియన్ టన్నులకు పెంచుకుంది. అధునికీకరణ, యూనిట్ల అప్‌గ్రెడేషన్‌తో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7.3 మి. టన్నులకు పెంచుకోవాలని యోచి స్తోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 మిలియన్ టన్నులకు పెంచుకునే ప్రయత్నాలను కూడా ఈ కంపెనీ చేస్తోంది. ఉత్పత్తి సామర్త్యం పెంపు కోసంవ థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్‌లను నేరుగా కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖను వైజాగ్ స్టీల్ కోరింది. నవరత్న హోదా ఉన్న ఆర్ఐఎన్ఎల్కు ఇప్పటిదాకా సొంత ఇనుము, బొగ్గు వనరులు లేవు. -
చురుగ్గా ‘థర్మల్’పైలాన్ నిర్మాణం
వీర్లపాలెం (దామరచర్ల) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా మండల పరిధిలోని వీర్లపాలెం గ్రామ శివారులో జెన్కో సంస్థ నిర్మిస్తున్న పైలాన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో 5 ఎకరాల స్థలంలో పైలాన్‌ను నిర్మిస్తున్నారు. పనులను ఖమ్మం కేవీ కన్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించారు. పనుల పరిశీలనకు జెన్కో ఈఈ సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది. ఆదిలో అడ్డంకులను అధిగమించి.. ఆదిలో అడ్డంకులను అధిగమించి....థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం దామరచర్ల మండలంలోని అటవీభూములు 10,500 ఎకరాలు సర్వే చేయించి క్లియరెన్స్ కోసం కేంద్రానికి నివేదిక పంపింది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ నిర్మాణానికి 4676 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్యులు జారీ చేసింది. దీంతో జెన్కో అధికారులు స్థానిక అధికారులకుగానీ, నాయకులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పైలాన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో ఇటీవల తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామస్తులు తమకు నష్టపరిహారం విషయంలో హామీ ఇవ్వకుండా పైలాన్ పనులు ఎలా చేపట్టారని కార్యాలయాన్ని ముట్టడించి ఫర్నిచర్‌ను తగులబెట్టిన విషయం విదితమే. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో కదలికవచ్చి ఆర్టీఓ కిషన్‌రావు, డీఎస్పీ గోనె సందీప్‌ను గ్రామస్తులతో సమావేశపరిచి వారికి నచ్చజెప్పి ఆటంకాలను అధిగమించేలా చేశారు. రోజూ మూడు టీంలు దీంతో నాలుగు రోజులుగా పనులు వేగవంతం చేశారు. నిర్మాణానికి రోజూ మూడు టీంల తాపీ మేస్త్రీలు, కూలీలను ఏర్పాటు చేసి నిర్మాణ పనులు చకచకా కొనసాగిస్తున్నారు. రోజుకు సుమారు 18 గంటలు, సుమారు వంద మంది కూలీలతో పైలాన్ పనులను నిర్వహిస్తున్నారు. పరిశీలనకు జెన్కో ఈఈతో పాటు ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి జెన్కో డీఈ దాస్, ఏఈ నాగరాజును డిప్టేషన్పై ఇక్కడ నియమించారు. ఈ నెల చివరిలోగా నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, అన్ని అనుకూలిస్తే అనుకున్న సమయంలో పూర్తిచేస్తామని ఈఈ సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. -
థర్మల్ దెబ్బ
దేవరకొండ: ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. ‘థర్మల్’ దెబ్బ దేవరకొండపైనే పడనుంది. దామరచర్ల మండలంలో నిర్మించతలపెట్టిన థర్మల్‌పవర్‌ప్లాంట్‌కు అవసరయ్యే 10 వేల భూములకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూములిస్తేనే అటవీశాఖ నుంచి క్లియరెన్స్ వస్తుంది. అయితే మొదట నేరేడుచర్ల, మఠంపల్లి మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూములను సేకరిస్తామని భావించినా, ఇప్పుడు జిల్లాయంత్రాంగం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం. తాజాగా దేవరకొండ నియోజకవర్గపరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించడంతో, జిల్లా అధికారులు అటవీశాఖ పరిధిలోని భూముల్లో ఆగమేఘాల మీద సర్వే చేశారు. పనిలోపనిగా శుక్రవారం దేవరకొండ రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా అటవీశాఖ అధికారులు చందంపేట మండలంలో పర్యటించారు. ప్రభుత్వభూమి..పదివేల ఎకరాలు దేవరకొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల వివరాలను జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే సేకరించింది. చందంపేట మండలంలో 3700 ఎకరాలు, దేవరకొండలో 1700 ఎకరాలు, డిండిలో 3032, పీఏపల్లి మండలంలో 988 ఎకరాలు, చింతపల్లిలో సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. అయితే ప్రభుత్వం అటవీశాఖకు అప్పగించదలుచుకున్న 7500 ఎకరాల్లో 6500 ఎకరాలు దేవరకొండ నియోజకవర్గం నుంచే సేకరించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చందంపేట, డిండి మండలాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉండడంతో ఈ భూమి ఫారెస్ట్ ఆధీనంలోకి తీసుకోవడానికి అటవీశాఖ అధికారులు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. జనంలో.... గుబులు : గతంలో పీఏపల్లి మండలం పెద్దగట్టు, చందంపేట మండలం చిత్రియాల అటవీ ప్రాంతాల్లో యురేనియం నిల్వలను కేంద్రప్రభుత్వం గుర్తించింది. అక్కడ వెలికితీసే యురేనియం నిక్షేపాలను శుద్ధి చేయడం కోసం దేవరకొండ మండలంలోని శేరిపల్లి అనువైందిగా భావించింది. అక్కడున్న 500 ఎకరాల్లో యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలనియూసీఐఎల్ భావించింది. ఇందు కోసం శేరిపల్లి ప్రాంతంలో సర్వే కూడా నిర్వహించారు. జేత్యతండా సమీపంలో అధికారుల నివాసానికి రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాల్సిందిగా, జిల్లా అధికారుల నుంచి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ విషయం స్తబ్దుగా ఉన్నప్పటికీ, గతంలో యురేనియం ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఇదే క్రమంలో చందంపేట మండలంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు జరుగుతుండగా, నక్కలగండి ప్రాజెక్టు కోసం ముంపునకు గురయ్యే 3వేల ఎకరాలకు భూమిని సేకరించే పనిలో ప్రభుత్వం ఉంది. అక్కడ కేవలం 300 ఎకరాలు మాత్రమే సేకరించగా, ముంపు బాధితుల నుంచినిరసన గళం వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే నాగార్జునసాగర్ ముంపునకు గురైనప్పుడు తెల్దేవర్పల్లిలో ఆవాసాలు కల్పించగా, మళ్లీ అదే ప్రాంతం నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతుంది. వారికి ఇంకా ప్రభుత్వ భూమిని ప్రత్యామ్నాయంగా చూపించనేలేదు. నూతన భూసేకరణ చట్టం నిబంధనల ప్రకారం వారు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూములను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో థర్మల్ పవర్ ప్లాంట్‌కు చందంపేట, డిండి ప్రభుత్వ భూములను ప్రత్యామ్నాయంగా భావించడం..అధికారగణం ఇందుకు సంబంధించిన సర్వేలు చేస్తుండడంతో ఈ ప్రాంతవాసుల్లో గుబులు మొదలయ్యింది. -
రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్‌కు సమైక్య సెగ