సుమోటోగా కేసు నమోదు
సీఎస్, డీజీపీలకు నోటీసులు
రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనలో వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలను అమర్చి వీడియోలను చిత్రీకరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎన్నో రోజులుగా వ్యవహారం జరుగుతున్నా బయటకెందుకు రాలేదని ప్రశి్నంచింది. అర్థరాత్రి వరకూ విద్యార్థినులు ధర్నా చేయడం.. ఘటనపై వివిధ పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచి్చనట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.
పత్రికా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీచేసింది. విద్యార్థినుల వీడియోలను రహస్య కెమెరాలతో రికార్డ్ చేసి, వాటిని అమ్మడం వంటి వ్యవహారాలు జరగడం అత్యంత దుర్మార్గమంటూ మండిపడింది. ఈ విషయంలో కళాశాల యాజమాన్యం ఎందుకింత నిర్లక్ష్యంగా ఉందని తీవ్రస్థాయిలో ప్రశి్నంచింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సైతం తమకు వివరించాలని అందులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment