gudlavalleru engineering college
-
గుడ్లవల్లేరు కాలేజీ కి నోటీసులు..
-
ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు బేఖాతరు
గుడివాడ రూరల్: దేశవ్యాప్తంగా కలకలం రేపిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్ వాష్‌రూమ్‌ల్లో హిడెన్ కెమెరాలు పెట్టిన వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసినా.. పోలీసులు, ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై పత్రికా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీలకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. వీటిని సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందేందుకే తీవ్రంగా కృషి చేస్తున్నారని విద్యార్థి, మహిళా సంఘాలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహరం వెలుగుచూసి ఆరు రోజులు కావస్తున్నా ఇప్పటికీ వాస్తవాలు బయటకు రాలేదు. విద్యార్థి సంఘాల నాయకుల అడ్డగింపు ఈ ఘటనపై ఆందోళన చేసేందుకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనుమానం వచి్చన ప్రతి ఒక్కరిని విచారించి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులుగా ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ గంగాధరరావు కళాశాలలో విచారణ చేస్తున్నా కనీసం మీడియాను అనుమతించడం లేదు. కాగా.. హాస్టల్ విద్యార్థినులను బలవంతంగా హాస్టల్ నుంచి ఇళ్లకు పంపేసిన కళాశాల యాజమాన్యం తొలుత నాలుగు రోజులు సెలవులు అని చెప్పింది. తాజాగా మరో మూడు రోజులు సెలవులు పొడిగించడం అనుమానాలకు తావిస్తోంది. ఆందోళనకు దిగిన విద్యార్థినుల తల్లిదండ్రులను ప్రతిరోజు కళాశాలకు పిల్లలను అదుపు చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నట్టు తెలిసింది. తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాతి్వక, విజయ్‌కుమార్‌ను ఏ1, ఏ2 నిందితులుగా చేర్చిన పోలీసులు తూతూమంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులకు సంబంధించిన అన్ని వివరాలు ఎఫ్ఐఆర్లో నమోదు చేయాల్సి ఉండగా.. కేవలం పేర్లు మాత్రమే నమోదు చేసి మిగిలిన వివరాలు గాలికి వదిలేసినట్టు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ కాఫీలను సేకరించిన వివిధ పార్టీల నాయకులు పోలీసుల నిర్వాకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కనీసం తండ్రి, ఇంటి పేర్లు కూడా నమోదు చేయలేదని చెబుతున్నారు. నిందితురాలు ఓ ప్రముఖ టీడీపీ నాయకుడు కుమార్తె కావడం, కళాశాల యాజమాన్యం సామాజిక వర్గానికి చెందటంతో కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు నిందితులకు రాచమర్యాదలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై మూడు రకాల మాటలు ఈ ఘటనపై ఎస్పీ ఆర్.గంగాధరరావు ఇప్పటికే మూడు రకాల మాటలు మాట్లాడారు. సెపె్టంబర్ 30న అక్కడ ఎలాంటి కెమెరాలు లేవని ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఆందోళన పెరగడంతో స్థానిక పోలీస్, కమ్యూనికేషన్ అధికారులతో విచారణకు ఆదేశించారు. 31న గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది పెద్ద కేసు కాదు. చిన్నదే’ అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యార్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో మరింత లోతుగా విచారణ నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. లోతైన విచారణ చేస్తున్నాం : ఎస్పీసాక్షి, మచిలీపట్నం: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై లోతైన విచారణ చేస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు న్యూఢీల్లీ, పుణే నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయని, ముగ్గురు ఐజీ స్థాయి అధికారులు జీవీజీ అశోక్‌కుమార్, ఎం.రవిప్రకాశ్, పీహెచ్డీ రామకృష్ణ, ఒక ఎస్పీస్థాయి అధికారుల పర్యవేక్షణలో విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.ప్రత్యేక బృందాలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ నెట్వర్క్ సిస్టం, కంప్యూటర్స్‌కు సంబంధించిన అన్ని టెక్నికల్ ఆధారాలు, క్లౌడ్ వెరిఫికేషన్, డేటాను సమీకరిస్తోందని తెలిపారు. కాలేజీ, హాస్టల్లో ఏ రకమైన స్పై కెమెరాలు లేదా ఇంకా ఇతర ఎల్రక్టానిక్ పరికరాలు వాడారా? లేదా? అనే విషయాన్ని పరీక్షిస్తారని పేర్కొన్నారు. ఈ బృందాలతోపాటు పోలీసు అధికారులు కళాశాల, హాస్టల్స్‌ను పరిశీలించారని, కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారని వివరించారు.మహిళా కమిషన్ నోటీసు సాక్షి, అమరావతి: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో హిడెన్ కెమెరాల ఘటనపై విచారణ కోసం కళాశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్టు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మహిళా కమిషన్ ప్రధాన కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు పేర్కొన్నారు. గుడ్లవల్లేరు ఘటనను సుమోటోగా స్వీకరించినట్టు పేర్కొన్నారు -
గుడ్లవల్లేరు ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఘటనలో వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలను అమర్చి వీడియోలను చిత్రీకరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎన్నో రోజులుగా వ్యవహారం జరుగుతున్నా బయటకెందుకు రాలేదని ప్రశి్నంచింది. అర్థరాత్రి వరకూ విద్యార్థినులు ధర్నా చేయడం.. ఘటనపై వివిధ పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచి్చనట్లు ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.పత్రికా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీచేసింది. విద్యార్థినుల వీడియోలను రహస్య కెమెరాలతో రికార్డ్ చేసి, వాటిని అమ్మడం వంటి వ్యవహారాలు జరగడం అత్యంత దుర్మార్గమంటూ మండిపడింది. ఈ విషయంలో కళాశాల యాజమాన్యం ఎందుకింత నిర్లక్ష్యంగా ఉందని తీవ్రస్థాయిలో ప్రశి్నంచింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సైతం తమకు వివరించాలని అందులో పేర్కొంది. -
పక్కా స్కెచ్‌తో పక్క దారి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/అమరావతి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్‌రూమ్స్‌లో వెలుగు చూసిన హిడెన్ కెమెరాల వ్యవహారాన్ని ప్రభుత్వం పక్కా స్కెచ్‌తో పక్కదారి పట్టిస్తోంది. ఏదోరకంగా నేరాన్ని కప్పిపుచ్చేందుకు అక్కడ ఏమీ జరగలేదంటూ మసిపూస్తోంది. బాధితులెవరూ నోరు విప్పకుండా ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. కళాశాలకు ఉన్నట్టుండి సెలవులు ప్రకటించడమే కాకుండా.. ఎవరూ, ఎక్కడా నోరెత్తకూడదని విద్యార్థినులకు హెచ్చరికలు జారీ చేసింది. ఏదైనా మాట్లాడితే మున్ముందు చర్యలు తప్పవని యాజమాన్యం ద్వారా హెచ్చరికలు జారీ చేయించింది.యాజమాన్యం ముసుగులో టీడీపీ నేతల దౌర్జన్యం ఈ వ్యవవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇతర రాష్ట్రాల ప్రముఖులు సైతం ఈ ఘటనపై స్పందించడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరకుండా చూసే బాధ్యతను టీడీపీ నేతలకు బాధ్యత అప్పగించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఆందోళనకారులు, మీడియా ప్రతినిధులను తరిమికొట్టారు. కళాశాల లోపలికి ఎవరూ వెళ్లకుండా గేట్లు మూసివేశారు. వారికి తోడుగా పోలీసులు సైతం వంత పాడుతున్నారు. నిజంగా అక్కడేమీ జరగకపోతే ఇంత హంగామా ఎందుకని ప్రజా, విద్యా, మహిళ సంఘాలు నిలదీస్తున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగి ఈ కేసును తానే పర్యవేక్షిస్తానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందంటున్న సీఎం చంద్రబాబు.. ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముతున్నారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్ సైతం అక్కడ హిడెన్ కెమెరాలు పెట్టారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని బుకాయిస్తుండటం విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభుత్వ పెద్దలే అలా చెబితే.. పోలీసులు చేతులేత్తేయక ఏం చేయగలరని నిలదీస్తున్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే స్వేచ్ఛగా దర్యాప్తు చేయడానికి పోలీసులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే ఆధారాలు వాటంతట అవే వస్తాయని విద్యార్థులు బల్లగుద్ది చెబుతున్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ ఇప్పటివరకు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తులో ఇప్పటివరకు వెల్లడైన అంశాలను ఎందుకు దాస్తున్నారని, ఎవరి కోసం ఇలా చేస్తున్నారని నిలదీస్తున్నారు. ఏమీ లేకపోతే షవర్, సీసీ కెమెరాలు ఎందుకు తీసుకుపోయారని ప్రశ్నిస్తున్నారు.నాలుగు రోజులు గడుస్తున్నా..విద్యార్థినుల ఆందోళనను అణగతొక్కేందుకు ఇప్పటివరకు పోలీసుల సహకారంతో శతవిధాలా ప్రయత్నించిన యాజమాన్యం విద్యార్థులు బెదరకపోవడంతో టీడీపీ నేతల సాయంతో ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించింది. బలవంతంగా విద్యార్థినులను బస్సుల్లో వారి ఇళ్లకు పంపేస్తున్నారు. విద్యార్థినుల తరలింపును అడ్డుకున్న వారిపై దాడులు చేయిస్తున్నారు. కాలేజీ ప్రధాన గేటు వద్ద పోలీసులతో పాటు టీడీపీ రౌడీలు రాత్రి, పగలు పహారా కాస్తున్నారు. పిల్లల విషయంలో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాల లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా అడ్డుకుంటున్నారు. టీడీపీ చోటామోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు కాలేజీలోకి స్వేచ్ఛగా అనమతిస్తూ.. విద్యార్థుల్ని, విద్యార్థి సంఘాల నాయకుల్ని, ఇతర రాజకీయ పార్టీల నాయకులను లోనికి వెళ్లనివ్వడం లేదు. విద్యార్థినులు ఆందోళన చేస్తునప్పుడు ఒక టీడీపీ నాయకుడు హాస్టల్లోకే వెళ్లి విద్యార్థినులు మాట వినకపోతే కళాశాల నుంచి సర్టిఫికెట్లు రానివ్వకుండా చేస్తామని బెదిరించాడంటే నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు టీడీపీ నాయకులు ఎటువంటి కుయుక్తులు పన్నుతున్నారో అర్థమవుతోంది.నేరం ఒప్పుకున్నా.. వీళ్లెందుకు సమ్మతించడం లేదు?‘కళాశాలలో హిడెన్ కెమెరాలతో బూత్రూమ్ల్లో 300కు పైగా వీడియోలు ఉన్నాయి. నేనే తీశాను. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు దుర్భాషలాడుతూ అన్న మాటలు విద్యార్థినులంతా విన్నారు. కానీ.. కళాశాల యాజమాన్యం తప్పు జరగలేదని బుకాయించేందుకు ఎంతకైనా తెగిస్తోంది. పచ్చమూకల సాయంతో సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాన్ని మొదలుపెట్టింది. కెమెరాలు పెట్టిన విద్యార్థిని స్వయంగా నేరం ఒప్పుకున్నా యాజమాన్యం, ప్రభుత్వం అందుకు సమ్మతించడం లేదు. ఒక్క వీడియో అయినా బయట పడిందా అంటూ నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది. స్వయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విలేకరుల సమావేశంలో ‘మూడు వేల వీడియోలు ఉన్నాయంటున్నారు. ఆ వీడియోలు ఏవి? బయట పెట్టలేదేంటి?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నిజానిజాలను నిగ్గు తేల్చాల్సింది ప్రభుత్వం. విద్యార్థినుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థినులకు న్యాయం చేయాల్సింది పోయి వారిపైనే ఎదురు దాడికి దిగడం ఎంతవరకు సమంజసమని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు.ఎవరూ లేకుండా విచారణఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరినీ కళాశాలలోనే విడివిడిగా మూడు రోజులుగా విచారిస్తున్నా ఇంతవరకు ఒక్క విషయాన్ని కూడా పోలీసులు బయటపెట్టలేదు. కళాశాల యాజమాన్యంతో కలిసి విచారణ చేస్తే నిజాలు ఎలా బయట పడతాయని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. కళాశాల టీడీపీ నాయకుల బంధువులది కావడం.. విద్యార్థినుల మాన, ప్రాణాల కన్నా కాలేజీ పరువు ప్రతిష్టలకే యాజమాన్యం ప్రాధాన్యత ఇవ్వడం.. అందుకు అధికార టీడీపీ సహకరించడమే ఇప్పటివరకు నిజాలు నిగ్గు తేలకపోవడానికి కారణాలుగా పేర్కొంటున్నారు. ఇలా విచారణ చేస్తే కాలయాపన తప్ప తమకు న్యాయం జరిగేది ఏమి లేదనేది విద్యార్థులు పేర్కొంటున్నారు.యథా చంద్రబాబు.. తథా అధికారులుయథా చంద్రబాబు.. తథా అధికారులు అన్న తీరుతోనే కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు సైతం వ్యవహరిస్తున్నారు. ఒకవైపు హిడెన్ కెమెరాలు ఉన్నాయంటున్న షవర్లను స్వాధీనం చేసుకోవడం, అనుమానితుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సైబర్ నిపుణులతో తనిఖీలు చేయిస్తున్నట్టు చెబుతున్న ఎస్పీ.. ఇదేం పెద్ద కేసు కాదని మభ్యపెట్టే ప్రయత్నం చేయడంపై విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి హిడెన్ కెమెరాల వ్యవహారాన్ని దర్యాప్తు పేరుతో కొన్ని రోజులు నాన్చి.. అంతా సద్దుమణిగిన తర్వాత అక్కడేమీ జరగలేదని తీరుబడిగా చెప్పి యాజమాన్యానికి మేలు చేసేలా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారని విద్యార్థి నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
భయమేస్తోంది.. చచ్చిపోవాలనిపిస్తోంది
సాక్షి, మచిలీపట్నం: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాల ఏర్పాటు ఘటనలో ఒక్కొక్క విద్యార్థినిదీ ఒక్కొక్క ఆవేదన. బంధువుల ఎదుట కొందరు తమ బాధను వెళ్లగక్కుతుండగా.. మరికొందరు స్నేహితులకు చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. తాజాగా శనివారం ఓ విద్యార్థిని తన స్నేహితురాలికి ఫోన్ చేసి బాధతో ఏడ్చిన వాయిస్ బయటకు వచ్చింది. అందులో విద్యార్థిని చెప్పిన మాటలను పరిశీలిస్తే.. ‘ఆ అక్క ఎవరో తెలిసిందే. ఫోర్త్ ఇయర్ ఈసీఈ. ఆ అక్క ఫొటో కూడా చూశాం. ఆ అక్క అంటోంది రండి చూసుకుందాం అని. విత్ ప్రూఫ్‌లు ఉన్నాయని తెగేసి చెబుతోంది.గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్లో ఏదేదో అంటున్నారే. భయం వేస్తోందే. రెండు నెలల నుంచి పెడుతున్నారట. 300 వీడియోలు బయటకు వచ్చాయంటా. అందరూ అడుగుతున్నారే భయం వేస్తోంది. మా ఫ్లోర్లోనూ పెట్టారట ఏడుపొస్తోంది. చచ్చిపోవాలనిపిస్తోందే బాబు. మేడంకు చెబితే బయటకు వస్తే డ్రగ్ కేసులో ఇరికిస్తామని అంటున్నారే. అలా.. ఇలా మాట్లాడుతున్నారే. రవీంద్రబాబేమో చూసి చెబుతాడంటే.. వీడియోస్ చూసినాక చెబుతాడంట. ఇప్పటికి 300 వీడియోలు బయటకు వచ్చాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు. సీనియర్స్ ఏమో గొడవ పెడుతున్నారు.మేడమ్, వార్డెన్స్ కర్రలు పట్టుకుని వెంటపడుతున్నారు. కానీ సీనియర్స్ చాలామంది ఏడుస్తున్నారే. రెండు నెలలనుంచి జరుగుతోదంట. అవతలేమో పొలిటీషియన్స్ అంట. మరి తెలియట్లా. అందుకనే భయపడుతున్నారు అడగటానికి. ప్లీజే ఎవరి దగ్గరైనా వీడియో ఉంటే ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మమ్మల్ని పట్టించుకుంటారంట. లేకపోతే పట్టించుకోరంట. అసలు ఏడుపొచ్చేస్తోంది మా ఫ్లోర్‌లోనే కెమెరా దొరికిందంటే. ఓసే వీడియో పెడితే ఏదైనా చేస్తారంటే. లేకపోతే ఏమీ చేయరంటే. అడుగుతుంటే కర్రలు పెట్టి కొడుతున్నారు. అంత ఉందే మా హాస్టల్లో సిట్యువేషన్. అందరూ ఏడుస్తున్నారు’ అంటూ ఆమె కూడా ఏడుస్తూ తన బాధను చెప్పుకుంది. -
ష్.. గప్‌చుప్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గుడివాడ రూరల్: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినుల వాష్‌రూమ్‌ల్లో రహస్య కెమెరాల వ్యవహారం శనివారం కూడా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కళాశాలలోకి వెళ్లడానికి ప్రయతి్నంచిన విద్యార్థి సంఘం నాయకులను, విద్యార్థులను యాజమాన్యానికి చెందిన రౌడీలు, పచ్చ గూండాలు చితకబాదారు. చెప్పులు, గొడుగులతో తీవ్రంగా కొట్టి ఈడ్చిపారేశారు. రహస్య కెమెరాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఎవరూ ఈ అంశంపై నోరెత్తవద్దని ఆంక్షలు విధించింది. తమ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా మీడియాతో మాట్లాడితే వారిని కళాశాల నుంచి బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది.విచారణ ముగియకుండానే హాస్టల్లో ఉన్న విద్యార్థినులకు నాలుగు రోజులు బలవంతపు సెలవులు ఇచ్చేసింది. నిజాలు తేలే వరకు హాస్టల్ నుంచి వెళ్లబోమని భీషి్మంచిన విద్యార్థినులను బలవంతంగా కళాశాల బస్సుల ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేసింది. వీడియోల వ్యవహారంపై విచారణ అధికారిణిగా గుడివాడ సిసి సీఐ రమణమ్మను నియమించామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు తెలిపారు. అయితే శనివారం హాస్టల్లో విచారణకు రమణమ్మకు బదులుగా కోడూరు ఎస్ఐ శిరీష రావడం గమనార్హం. ఈ క్రమంలో శాంతియుతంగా హాస్టల్లో ఆందోళన చేస్తున్న విద్యార్థినులను ఎస్ఐ తీవ్రంగా బెదిరించారు. ఆందోళన ఆపకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. హాస్టల్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ విద్యార్థినులకు హుకుం జారీ చేశారు. విద్యార్థినులు వెళ్లడానికి నిరాకరించడంతో బలవంతంగా పోలీసులు వారిని బస్సులు ఎక్కించి ఇంటికి పంపించేశారు. తరిమి తరిమి కొట్టిన రౌడీలు.. విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు, విద్యార్థులు గుడ్లవల్లేరు మంచినీటి చెరువు వద్ద విద్యార్థినులను తరలిస్తున్న బస్సును అడ్డుకునేందుకు యతి్నంచారు. అయితే అప్పటికే కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన రౌడీలు, పచ్చ గూండాలు విద్యార్థి సంఘాలు, విద్యార్థులపై దాడులకు తెగబడ్డారు. చెప్పులు, గొడుగులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. రోడ్డుపై ఈడ్చుతూ, దుర్భాషలాడుతూ తరిమితరిమి కొట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా రౌడీలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ప్రాణభయంతో విద్యార్థులు ఇళ్లల్లోకి వెళ్లి తలుపులేసుకున్నారు. అదే సమయంలో దాడిని చిత్రీకరిస్తున్న మీడియాపైనా రౌడీలు దాడులకు తెగబడి కెమెరాలు లాక్కున్నారు.మరోవైపు ప్రభుత్వం ఈ ఘటనను పూర్తిగా కప్పిపెట్టే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థినులకు సంబంధించి 300 వీడియోలు బయటకు వచ్చాయని తెలుస్తున్నా అదేమీ లేదంటూ బుకాయిస్తోంది. గుడ్లవల్లేరు కళాశాల యాజమాన్యం తమ సామాజికవర్గానికే చెందినది కావడంతో టీడీపీ ప్రభుత్వం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హాస్టల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని కళాశాలలోనే శుక్రవారం అర్థరాత్రి 3 గంటల వరకు పోలీసులు విచారించినా ఏ విషయం వెల్లడి కాలేదు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినిని కూడా పోలీసులు కళాశాలలో విచారించినా ఏ ఆధారాలు సేకరించలేదు. ప్రభుత్వానికి పట్టదా? అసలు కళాశాలలో విచారణ జరగకుండానే, దర్యాప్తు పూర్తికాకుండానే అక్కడ ఏమీ జరగలేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు ఎలా చెబుతారని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బయటికి చెబుతున్నట్లు 300 కాకుండా ఇంకా పెద్ద సంఖ్యలోనే వీడియోలు ఉన్నాయని విద్యార్థినులే చెబుతున్నారు. వాష్‌రూమ్‌లో పదుల సంఖ్యలో రహస్య కెమెరాలు పెట్టారని.. వాటన్నింటిని తొలగించి, ఇప్పుడు ఏమీలేదని కళాశాల యజమాన్యం బుకాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనతో తమకు, తమ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకపోయినా ప్రభుత్వానికి పట్టదా అని ధ్వజమెత్తుతున్నారు. పక్కా ప్రణాళికలో భాగంగానే.. జిల్లా ఎస్పీ కళాశాలకు రాకుండానే ఎలాంటి సీసీ కెమెరాలు లేవని ప్రకటించారని మండిపడుతున్నారు. విచారణ పూర్తి కాకుండానే ముందే క్లీన్చిట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రికి రహస్య కెమెరాలను తొలగించి అక్కడ ఏమీలేదని తమను మభ్యపెడుతున్నారని దుయ్యబడుతున్నారు. కెమెరాలున్నాయని ఒప్పుకున్న విద్యార్థిని.. రహస్య కెమెరాలు అమర్చిన విషయాన్ని బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఒప్పుకుందని బాధిత విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. పైగా ‘మీరేం చేయగలరు నన్ను’ అంటూ ఎదురుతిరగడమే కాకుండా బెదిరిస్తోందని వాపోతున్నారు. యాజమాన్యం ఆ యువతిని హాస్టల్లో భద్రంగా ఉంచి సకల మర్యాదలు చేస్తోందని మండిపడుతున్నారు. ఆమెకు రక్షణగా నలుగురు మహిళా కానిస్టేబుళ్లను కూడా నియమించారని చెబుతున్నారు. ఆ యువతి తల్లిదండ్రులు, సోదరుడు సైతం హాస్టల్‌కు వచ్చి ఉంటున్నారని అంటున్నారు. మరోవైపు బాలుర హాస్టల్లో ఉన్న నిందితుడిని తోటి విద్యార్థులు ప్రశి్నస్తే రహస్య కెమెరాలు, వీడియోలు ఉన్నాయని ఒప్పుకున్నాడని.. తీరా ఇప్పుడు పోలీసుల విచారణలో మాట మారుస్తున్నాడని చెబుతున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.బాలికలకు, బాలురకు ఒక్కరే వార్డెన్.. కాగా బాలికలు, బాలురకు వేర్వేరు వసతి గృహాలున్నాయి. ఈ రెండు వసతి గృహాలకు ఒక్కరే వార్డెన్ (పురుషుడు)గా ఉండటం గమనార్హం. బాలికల హాస్టల్లో రహస్య కెమెరాలున్నాయనే విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయతి్నంచారు. దీంతో విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు రంగప్రవేశం చేసి షవర్లను తీసుకుపోయారని.. పూర్తిగా యాజమాన్యానికి అనుకూలంగా నడుచుకున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా చూపిస్తున్నారు.షవర్లను తమ ముందు ఊడదీస్తే అందులో కెమెరాలున్నాయో, లేదో తెలిసేదని విద్యార్థినులు అంటున్నారు. ఇలా చేయకుండా పోలీసులు తమతోపాటు షవర్లను తీసుకుపోవడంతో వాటిలో రహస్య కెమెరాలున్నాయనే తమ వాదనకు బలం చేకూరుతోందని స్పష్టం చేస్తున్నారు. గుడ్లవల్లేరు కళాశాల టీడీపీ నేతల బంధువులది. రహస్య కెమెరాలతో తీసిన విద్యార్థినుల వీడియోలను కొందరు టీడీపీ నేతలకు కూడా పంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కళాశాల యాజమాన్యం పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని విద్యార్థులు అంటున్నారు. దోషులను వెనకేసుకురావడమే ఇందుకు నిదర్శనమని ఆరోపిస్తున్నారు. -
జరిగింది దారుణం.. ఐక్యంగా పోరాడితే నిజం బయటకు..
సాక్షి, మచిలీపట్నం/అమరావతి: విద్యార్థినుల వాష్ రూమ్‌లలో రహస్య కెమెరాల ఘటనపై సినీ నటి పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ‘ఎక్స్’ వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. ‘ప్రియమైన అమ్మాయిలారా. మీలో ఒకరిగా మీ అందరికీ ఈ లేఖ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో, నమ్మకంతో బయటకు పంపుతున్నారు. కానీ.. బయట మీకు జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. మీకు ఇటీవల జరిగిన ఈ పరిస్థితులు చాలా దారుణం. విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను.‘నేరస్థులు ఎలా రక్షించబడతారు, బాధితులు ఎలా అవమానింపబడతారు’ అనేది నాకు బాగా అనుభవం. అటువంటి చర్యలతో నేను మానసికంగా అలసిపోయాను. వ్యక్తులు ఎంతశక్తిమంతమైన వారైనా.. వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఏ పార్టీకి చెందిన వారైనా మీరు వదలకండి. అమ్మాయిలు తమ కోసమే కాకుండా మనందరికీ తెలియని చాలామంది ఇతర విద్యార్థుల కోసం పోరాడుతున్నారు. ఒక అమ్మాయి చాలామంది అమ్మాయిలను ప్రమాదంలోకి నెట్టడం అనేది నాకు అసహ్యం కలిగించింది. నేరస్థులకు ఎంతటి శక్తిమంతులైనా.. ఎవరు సహకరిస్తున్నా.. ఎవరినీ విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప్పండి. మీరు చేసే పోరాటం చుట్టుపక్కల ఉన్న ఇతరులకు కూడా బలాన్ని ఇస్తుంది’ అని పూనమ్ కౌర్ ఆ లేఖలో పేర్కొన్నారు.నిందితులను శిక్షించాలి బాత్రూమ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు చిత్రీకరించారని తెలిసి భయపడిపోయాం. వీటిని ఎందుకు ఏర్పాటు చేశావని అడిగితే.. ఆ విద్యార్థిని నీ దిక్కు ఉన్నచోట చెప్పుకోమని బెదిరించింది. హాస్టల్, కళాశాల యాజమాన్యానికి తెలిపినా పట్టించుకోలేదు. నిందితురాలికి వత్తాసు పలుకున్నారు. ఇదెక్కడి న్యాయం. నిజాలు నిగ్గు తేల్చి నిందితులపై చర్యలు తీసుకోవాలి. – సుజన, హాస్టల్ విద్యార్థిని వణికిపోతున్నాంవాష్రూమ్లో కెమెరాలు పెట్టారని తెలిసినప్పటి నుంచి నాతో పాటు సహచర విద్యార్థినులు ఆందోళనలో ఉన్నారు. ఏ సమయంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని వణికిపోతున్నాం. రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. న్యాయం చేస్తారనుకున్న పోలీసులు పట్టించుకోవాల్సింది పోయి మమ్మల్నే బెదిరిస్తున్నారు. అనుమానితురాలిగా ఉన్న విద్యార్థినికి సకల మర్యాదలు చేసి గదిలో ఉంచుతున్నారు. మమ్మల్ని పట్టించుకునే వారే కరువయ్యారు. మాకు న్యాయం చేయాలి. – స్వప్న, హాస్టల్ విద్యార్థిని బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయమంటున్నారు న్యాయం చేయాలని విద్యార్థినులందరూ ఆందోళన చేస్తున్నా ఎవరికి తమ గోడు పట్టడం లేదు. నిజాలు నిగ్గు తేల్చి తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని భరోసా కలి్పంచాల్సింది పోయి హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ తమను బెదిరిస్తున్నారు. పోలీసులే న్యాయం చేయాల్సింది పోయి వారే తమను బెదిరిస్తే తమకు న్యాయం చేసే వారు ఎవరూ. నిందితులను కఠినంగా శిక్షించి తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. – సత్యరాణి, విద్యార్థిని బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఆడపిల్లల హాస్టల్ వాష్‌రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వారి చిత్రాలను చిత్రీకరించిన ఘటనలో ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలి. ఇటువంటి ఘటనలు చాలా దారుణం. పిల్లల భవిష్యత్‌తో ఆటలాడే వ్యక్తుల్ని వదలకూడదు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. – మైల రత్నకుమారి, చినగొల్లపాలెం, కృత్తివెన్ను మండలం నమ్మి పంపిస్తే ఇలాంటి మోసాలు చేయొచ్చా కాలేజీల యాజమాన్యాల మీద నమ్మకంతో పిల్లల్ని మీ దగ్గర వదిలిపెడుతున్నాం. కంటికి రెప్పలా కాపాడాల్సిన చోటే ఇటువంటి దుర్మార్గపు చర్యలు జరగడం అత్యంత హేయం. ముందుగా కాలేజీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి. ఈ ఘటనలో ఎటువంటి రాజకీయాలు లేకుండా ఎవరికి వారే మన ఇంటి పిల్లలు అనుకుని నిందితుల్ని పట్టుకుని శిక్షించాలి. – ఎ.సత్యవతి, కృత్తివెన్ను రాజకీయాలు కాదు వాస్తవాలు కావాలి గుడ్లవల్లేరు ఘటన చాలా దురదృష్టకరం. దీనికి భాద్యులు ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక్కడ అధికార యంత్రాంగంతో పాటు అధికార పార్టీ పెద్దలు సైతం రాజకీయాలు పక్కనపెట్టి వాస్తవాలను గుర్తించి న్యాయం జరిగేలా చూడాలి. ఇది ఆడపిల్లల భవిష్యత్, వారి జీవితాలకు సంబంధించిన విషయం. – జె.ఝాన్సీ, యండపల్లి, కృత్తివెన్ను మండలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థినులకు ఈ దుస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు ఈ దుస్థితి దాపురించింది. వాష్ రూమ్స్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నా అలాంటిదేమీ లేదని ప్రభుత్వం కితాబివ్వడం అత్యంత హేయం. విద్యార్థినులను కట్టడి చేస్తూ.. కాలేజీ యాజమాన్యం నిందితుల్ని రక్షించే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థినుల సమక్షంలో విచారణ జరగాల్సి ఉండగా.. వారిని బలవంతంగా ఇళ్లకు పంపించడం దుర్మార్గం. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఏపీలో రక్షణ కరువైంది ఏపీలో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. బాత్ రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ఇంత ధైర్యం రావడానికి కారణం ప్రభుత్వమే. గుడ్లవల్లేరు ఘటనకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి ఘటనలు చూడలేదు. 9 ఏళ్ల అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలు చేసిన ఘటన జరిగి 60 రోజులు అవుతున్నా అమ్మాయి శవాన్ని తీసుకు రాలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా హోం మంత్రి ఏం చేస్తున్నట్టు. – ఆర్కే రోజా, మాజీ మంత్రి -
ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వాష్ రూమ్‌ల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యం, ప్రభుత్వం దొంగాటపై ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు. జరిగిన ఘటనను దాచిపెట్టడానికి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యాన్ని రక్షించడానికి ప్రభుత్వం తాపత్రయపడుతుండటంపై విమర్శల జడివాన కురుస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కళాశాలకు వచ్చిన విద్యార్థినుల జీవితాలను రక్షించాలన్న, వారికి భరోసా ఇవ్వాలన్న కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని ప్రజలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో యాజమాన్యం వైఫల్యం.. ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తదుపరి చర్యలు తీసుకోవడంలో సాగుతూ... ఉన్న జాగుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న గుడ్లవల్లేరు రహస్య కెమెరాల ఘటనపై ప్రజలు, మేధావులు, వివిధ ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు కళాశాల యాజమాన్యం, ప్రభుత్వం బదులివ్వాల్సి ఉంది. ఎందుకీ ఉదాసీనత?: కళాశాలలో సీనియర్ల పేరుతో ఆకతాయిల వేధింపులు శృతిమించినా యాజమాన్యం ఎందుకు అడ్డుకట్టు వేయలేకపోయింది? ఇప్పుడీ ఘటనతో కళాశాల గుర్తింపు పోతోందని గగ్గోలు పెడుతున్న యాజమాన్యం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించింది? చివరకు విద్యార్థినుల వాష్‌రూమ్‌ల్లో రహస్య కెమెరాలు పెట్టే దుస్సాహసానికి కొందరు ఒడిగట్టినా ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు? ఈ విషయమై వారం క్రితమే విద్యార్థులు యాజమాన్యానికి చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు? ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారా? చెప్పి ఉంటే ఎందుకు పోలీసులు స్పందించలేదు? వారం రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంటే వాళ్ల ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కళాశాల యాజమాన్యం టీడీపీ నేతల బంధువులది కాబట్టి.. చూసీచూడనట్టు వదిలేశారా? ఆదిలోనే ఆకతాయిలకు చెక్ పెట్టి ఉంటే.. అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారేదా? ఇంత దారుణ ఘటన జరిగాక కూడా బాధిత బాలికల్లో నైతిక స్థైర్యం నింపాల్సిన ప్రభుత్వం ఎందుకు యాజమాన్యం పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తోంది? రహస్య కెమెరాలతో ఏకంగా 300 వీడియోలు తీసిన భాగోతం భగ్గుమంటుంటే ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడంలేదు? ఎవరెవరి వీడియోలు ఉన్నాయో అనే తీవ్ర మనోవేదనతో ఆడబిడ్డలు ఆందోళన చెందుతుంటే యాజమాన్యం, ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించడం ఎంతవరకు సమంజసం? అని ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఎందుకు యత్నించారు?విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుని, మనోధైర్యం నింపాల్సిన యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు నిర్బంధంగా వ్యవహరిస్తున్నాయి? కళాశాల పాలకవర్గ సలహాదారు రవీంద్రబాబు రంగంలోకి దిగి విద్యార్థులకు ఎందుకు బెదిరించారు? అమ్మాయిలు ఆందోళన చేయడంతో రంగంలోకి దిగిన మంత్రి కొల్లు రవ్రీంద, ఎస్పీ, కలెక్టర్ వాస్తవాలను తెలుసుకోకుండా వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు విచారణే చేయకుండా.. ఏం జరిగిందో పరిశీలనే చేయకుండా.. ఉదయం 10 గంటలకే ఈ వ్యవహారంలో ఏమీ లేదని ఎస్పీ ఎలా చెప్పగలుగుతారు? కవరింగ్ కోసం మళ్లీ విచారణ చేస్తామని ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? బాత్ రూమ్‌ల్లో కెమెరాలే లేవని తొలి రోజునే ప్రకటించిన పోలీసులు మరి షవర్లతోపాటు కొన్ని పరికరాలను ఎందుకు స్వాధీనం చేసుకున్నట్టు? వాటిని పరిశీలనకు పంపడం వెనుక మర్మం ఏమిటి? షవర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు షవర్లలో కెమెరాలు ఉన్నా లేవని చెప్పేందుకా? ఉన్న కెమెరాలను తీసివేసేందుకా? విద్యార్థినుల వీడియోలు వైరల్ చేసినట్టు ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో రికవరీలో ఏం గుర్తించనున్నారు? ఇది కూడా యాజమాన్యానికి అనుకూలంగా చేసేందుకు ఆ ఫోన్లలో ఏమీలేవని చెప్పేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాలుగు రోజుల సెలవుల వెనుక అసలు కారణమిదేనా?ఈ ఘటనలో బాధిత బాలికలకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థి సంఘ నేతలు, తల్లిదండ్రులను, మహిళా కమిషన్‌ను హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్లకుండా యాజమాన్యం, పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? యాజమాన్యం ఇప్పుడు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడం కెమెరాలను మాయం చేసేందుకేనా? విద్యార్థులను ఇంటికి పంపితే.. హాస్టల్ బాత్రూమ్లలో సాక్ష్యాలు తారుమారు చేయడానికేనా? ఆడపిల్లలు.. ఆధారాలు ఉంటే తనకు పంపాలని సీఎం స్థాయి వ్యక్తి చెప్పడం దారుణం కాదా? విద్యార్థుల గ్రూప్‌ల్లో వైరల్ అయినట్టు చెబుతున్న అటువంటి వీడియోలను ఏ మహిళ అయినా పంపిస్తారా? చట్ట ప్రకారం బాధిత యువతుల ఆధారాలు బయటపెట్టకుండా ఘటనపై దర్యాప్తు చేయాలనే కనీస జ్ఞానం కూడా లేదా కోల్పోయారా? కళాశాలను సందర్శించి అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన కనీస బాధ్యత సీఎంకు లేదా? మదనపల్లెలో కాగితాలు తగలబెడితే నానా రాద్ధాంతం చేసి డీజీపీ, సీఐడీ చీఫ్‌లను హెలికాప్టర్లో çపంపిన సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి గంట ప్రయాణం కూడా లేని గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లడంలేదు? ఆడపిల్లల భవిష్యత్తుకు సంబందించిన ఇంతటి సీరియస్ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు తేలిగ్గా తీసుకుంటోంది? ప్రత్యర్థి పార్టీలో ఉన్నవారిపైన కక్షలు తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్న చంద్రబాబు ఆడబిడ్డల రక్షణ విషయంలో ఎందుకు అలక్ష్యం వహిస్తున్నారు? అని విద్యార్థి, ప్రజా, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.హోం మంత్రి ఎక్కడ?ప్రతిపక్ష నేతను పట్టుకుని వాడు, వీడు అంటూ వెకిలిగా మాట్లాడే హోంమంత్రి అనిత గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లలేకపోయారు? చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఈ వ్యవహారాన్ని వైఎస్సీర్సీపీ మీదకు నెట్టేయడానికి ఎందుకు ప్రయత్నించాయి? ఇది ఎవరి ప్రయోజనం కోసం? అని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఎల్లో బ్యాచ్‌కు లేకపోవడం శోచనీయం కాదా? రాష్ట్రంలో ఐపీఎస్‌లపై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందనేది వాస్తవం కాదా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
వీడియోల లీక్ ఘటనలో నిందితుడు పవన్ కళ్యాణ్ అభిమాని
-
సాక్షి రిపోర్టర్ పై..గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దాడి
-
గుణపాఠం చెప్పండి. ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై పూనమ్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన భయాందోళకు గురిచేస్తోంది. బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న ఓ అమ్మాయి-అబ్బాయి కలిసి.. లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేశారని, ఏకంగా 300 మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు చిత్రీకరించారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం దీనిపై సత్వర చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదలా ఉండగా హీరోయిన్ పూనమ్ కౌర్.. ఈ సంఘటనపై ట్వీట్ చేసింది. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు)'ప్రియమైన అమ్మాయిలకు మీలో ఓ అమ్మాయిగా ఈ లెటర్ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు, నమ్మకంతో మిమ్మల్ని బయటకు పంపిస్తున్నారు. కానీ బయట జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. బయట ఎదుర్కొన్న పరిస్థితులు దారుణం. నేరస్థులని రక్షించడం, బాధితులకు అన్యాయం జరగడం లాంటి చాలా అనుభవాలతో నేను అలసిపోయాను. వ్యక్తులు ఎంత శక్తివంతులైనా, వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే వారు ఏ పార్టీకి చెందిన వారైనా మీరు బహిర్గతం చేస్తారని నిర్ధారించుకోండి''ఓ అమ్మాయి చాలామంది అమ్మాయిలని ఇలా ప్రమాదంలో నెట్టడం నాకు అసహ్యం కలిగిస్తోంది. నేరస్తులు ఎంతటి శక్తిమంతులైనా వారికి సహకరిస్తున్నా ఎవరినీ విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప్పండి. ఈ మాటలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు చేసే పోరాటం చుట్టుపక్కల ఉన్న వాళ్లకు కూడా బలాన్ని ఇస్తుంది. ప్రేమ, అభినందనలతో' అని పూనమ్ కౌర్ నోట్ రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్)#AndhraPradesh pic.twitter.com/DgpWBaw1dO— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) August 31, 2024 -
పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..
-
తెగించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థులను కొట్టి ఇంటికి పంపుతూ...
-
గుడ్లవల్లేరు కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
-
రాక్షస రాజ్యంలో 'గుడ్ల' గూబలు!
న్యూడ్ వీడియోలు ఇతరకాలేజీల విద్యార్థుల ఫోన్లలో ప్రత్యక్షమైనట్లు మాకు ఫోన్లు చేసి చెబుతున్నారు..!! డబ్బులు తీసుకొని వీడియోలు షేర్ చేస్తున్నారు.ఆందోళన, కేసులు అంటే మీ భవిష్యత్తు దెబ్బతింటుంది.. మీరు, మీ తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది.. సర్టిఫికెట్లు ఇవ్వరు అని బెదిరిస్తున్నారు. సీఎం చంద్రబాబు తక్షణమే వచ్చి దీనికి సమాధానం చెప్పాలి – గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల ఆక్రోశంసాక్షి ప్రతినిధి, విజయవాడ: వేలాది మంది విద్యార్థినులు చదువుతున్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వాష్ రూమ్‌లలో రహస్య కెమెరాలు అమర్చిన ఘటన తీవ్ర కలకలం రేపగా.. అధికార యంత్రాంగం ద్వారా దీన్ని కప్పిపుచ్చేందుకు సర్కారు విఫలయత్నం చేసింది. కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖులకు సన్నిహితులు కావడంతో దీన్ని పక్కదారి పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. వాష్ రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి వీడియోలను చిత్రీకరించారంటూ విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి నిద్రాహారాలు లేకుండా తల్లడిల్లుతుండగా.. అర్ధరాత్రి హాస్టల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి పోలీసులు గుట్టుగా తనిఖీలు నిర్వహించడం.. స్నానాల గదిలో షవర్లు ఊడదీసి తరలించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. సీక్రెట్ కెమెరాలపై ఓ విద్యార్థిని వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం... ఎదురు కేసులు పెడతామని బెదిరించడం.. సాహసించి మీరు ఫిర్యాదు చేసినా ఉదయానికల్లా ఆ వార్త ఫేక్ న్యూస్ అవుతుందని విద్యార్థులను వార్డెన్ హెచ్చరించడం.. మర్నాడు ఉదయం అధికారులు కూడా అది ఫేక్ న్యూస్ అని తొలుత బుకాయించడం గమనార్హం. ఇంత దారుణంజరిగితే సమస్యను చిన్నదిగా చూపేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నించడం నివ్వెరపరుస్తోంది. దాదాపు 1,500 మంది విద్యార్థినులు ఉంటున్న చోట జరిగిన ఈ దారుణం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్యులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.వందల వీడియోలు...!రహస్య కెమెరాలతో ఇప్పటివరకు 300 మంది విద్యార్థినుల వీడియోలు చిత్రీకరించినట్లు తెలియడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నిద్రాహారాలు లేకుండా వర్షంలోనూ హాస్టల్ వద్ద బైఠాయించి న్యాయం కావాలంటూ నినదించారు. తరగతులను బహిష్కరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాయ్స్ హాస్టల్ వద్దకు చేరుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని అదుపులోకి తీసుకుని ఫోన్, ల్యాప్‌టాప్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఒంగోలు విద్యార్థిని తండ్రికి టీడీపీ అండదండలు ఉండటంతో యాజమాన్యం వారితో కుమ్మక్కై విచారించకుండా హాస్టల్లో ఉంచి సకల సౌకర్యాలు కల్పిస్తోందని ఇతర విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న తమను సర్టిఫికెట్లు ఇవ్వబోమని, మార్కులు వేయమని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల వద్ద ఉద్రిక్తత.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వద్ద విద్యార్థులు సైతం విద్యార్థినులతో కలసి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. న్యాయం చేయాలంటూ రోడ్డు మీద బైఠాయించారు. విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు వారి ఆందోళనకు మద్దతు పలకడంతో కళాశాల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. విద్యార్థులతో కళాశాల యాజమాన్యం, పోలీసులు చర్చలు జరపగా నిందితులను కఠినంగా శిక్షిస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ ఆర్.గంగా«దరరావు, ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, యార్లగడ్డ వెంకట్రావ్, కాగిత కృష్ణప్రసాద్ కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థినులతో పలు దఫాలు చర్చలు జరిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యం, వార్డెన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వగా యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని, రెండు రోజులుగా విషయం తెలిసినా కాలయాపన చేసిందని విద్యార్థినులు పేర్కొన్నారు. గురువారం రాత్రి నుంచి భోజనం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేయకుండా, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వారంతా మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ విద్యార్థిని తండ్రి పలుకుబడి ఉన్న టీడీపీ నేతగా చెబుతున్నారు. అధికార పార్టీ నేత కావడంతో ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. వారం క్రితమే తెలిసినా..వాష్ రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారాన్ని ఓ విద్యార్థిని వారం రోజుల క్రితమే కాలేజీ యాజమాన్యం దృష్టికి తెచ్చినా నిర్లిప్తంగా వ్యవహరించింది. ‘నిన్న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఫిర్యాదు చేస్తే విచారణకు నెల సమయం కావాలన్నారు. ఫేక్ న్యూస్ అంటూ మళ్లీ రాత్రి ప్రచారం చేశారు. యాజమాన్యం దృష్టికి తెచ్చిన విద్యార్థినిని, తండ్రిని పిలిపించండంటూ రివర్స్ కేసులు పెడతామని బెదిరించారు. మేమేం తప్పు చేశాం? ’ అని ఆ విద్యార్థిని ప్రశ్నిస్తోంది. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినిని శుక్రవారం రాత్రి 10.15 గంటలకు కళాశాల యాజమాన్యం రహస్యంగా బయటకు పంపించేసింది. ఆ కాలేజీ టీడీపీ నేత బంధువుదేగుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ టీడీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే భార్య గద్దె అనూరాధకు చెందిన బంధువుది కావడంతో పచ్చ గద్దలు రంగంలోకి దిగాయి. వాష్ రూమ్‌లలో రహస్య కెమెరాలు లేవని అధికారులతో చెప్పించే యత్నం చేశారు. విద్యార్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో కథ అడ్డం తిరిగింది. గురువారం రాత్రి నుంచి ఈ ఘటనపై విద్యార్థులు అందోళన చేస్తున్నప్పటికీ విషయం బయటకు పొక్కకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి తండ్రి కీలక పాత్ర పోషించారు. అమ్మాయి తండ్రికి సైతం టీడీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఆయన కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, సీసీ కెమెరాల విషయాన్ని పక్క దారి పట్టించే యత్నం చేశారు. ఓ దశలో తన కూతురి జోలికి వస్తే కాలేజీ పరువు తీస్తానని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో కాలేజీ యాజమాన్యం.. విద్యార్థిని తండ్రితో కుమ్మక్కు అయ్యింది. టీడీపీ నేతలు, అధికారులు కాలేజి వద్దకు వచ్చి కేసు తీవ్రతను తగ్గించే యత్నం చేశారు. ఆధారాలు నేరుగా నాకు పంపండి: సీఎం చంద్రబాబుగుడ్లవల్లేరు కళాశాల విద్యార్థినుల వద్ద ఆధారాలుంటే నేరుగా తనకే పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎవరూ అధైర్య పడవద్దని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. శుక్రవారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రహస్య కెమెరాలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇంట్లో ఆడబిడ్డకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామోఅంతే సీరియస్‌గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ జరపాలన్నారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి ఘటనపై తనకు రిపోర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అర్ధరాత్రి కరెంట్ ఆపేసి..గురువారం అర్ధరాత్రి హాస్టల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి కనీసం జనరేటర్ ఆన్ చేయకుండా బాత్ రూమ్‌లలో పోలీసులు తనిఖీ చేశారని విద్యార్థినులు పేర్కొంటున్నారు. బాత్ రూమ్‌లో షవర్స్ మాత్రమే ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నిస్తున్నారు. షవర్లలో రహస్య కెమెరాలున్నట్లు పేర్కొంటున్నారు.జేఎన్టీయూకే బృందం విచారణబాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే అనుబంధ కళాశాల కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాల ఘటనపై విచారణ కమిటీని నియమించినట్లు వర్సిటీ వీసీ మురళీకృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంపవర్మెంట్ డైరెక్టర్ యు.వి.రత్నకుమారి, ఐటీ ఇన్ఫ్రాస్టక్చర్ డైరెక్టర్ ఎ.ఎస్.ఎన్.చక్రవర్తి, ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్‌తో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిటీ సభ్యులు కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించి నివేదిక తయారు చేస్తారని వీసీ మురళీకృష్ణ తెలిపారు.ప్రజా సంఘాల మద్దతు..సాక్షి ప్రతినిధి, విజయవాడ: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళన చేస్తున్న విద్యార్థినులకు ఏబీవీపీ, వివిధ ప్రజా సంఘాల నేతలు మద్దతు పలికారు. ఏబీవీపీ జిల్లా జాయింట్ సెక్రటరీ మాగంటి వెంకట గోపి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సీహెచ్ లీలాకుమారి, యువమోర్చా మహిళా జిల్లా సెక్రటరీ వి.అభినందన ఆందోళనలో పాల్గొన్నారు. వేల మంది విద్యార్థినులు ఉంటున్న హాస్టల్లో రహస్య కెమెరాల అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తెచ్చి కారకులకు కఠిన శిక్షలు పడేవరకు పోరాడతామన్నారు. విచారణకు నెల పడుతుందన్నారు.. తెల్లవారగానే ఫేక్ అంటున్నారు రహస్య కెమెరాల గురించి కళాశాల యాజమాన్యానికి చెబుతున్నా పట్టించుకోలేదు. గురువారం రాత్రి గొడవ చేస్తే కళాశాల వారితోపాటు పోలీసులు వచ్చారు. దీనిపై ఫిర్యాదు చేస్తే విచారణకు నెల రోజులు పడుతుందని పోలీసులు చెప్పారు. మా వసతి గృహాల్లోని రెండు షవర్లను ఊడపీక్కుని తీసుకుపోయారు. తెల్లవారగానే అదంతా ఫేక్ న్యూస్‌గా కొట్టేశారు. అసలు వాటిని ఎందుకు తీసుకువెళ్లారు. వాటిల్లో కెమెరాలు ఉండబట్టే కదా వారు తీసుకువెళ్లింది. అలా తీసుకువెళ్లింది కేసును తప్పుదోవ పట్టించడానికేనా?. నిఘా కెమెరాలు ఉన్నాయా.. లేదా.. అని క్లారిటీ ఇవ్వకుండా పోలీసులు సైతం అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరించడం దారుణం. విచారణ సమయంలో సైతం పోలీసులు మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బయట అందరిలో ఒక విధంగా మాట్లాడుతున్నారు. లోపల విచారణ సమయంలో బెదిరింపులకు దిగుతున్నారు. మాపై ఎదురు కేసులు పెడతామని భయపెడుతున్నారు. మేము ఏం పాపం చేశాం. రక్షణ కోరితే ఈ విధంగా బాధపెట్టడం ఏమిటి. వీరి బెదిరింపులు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. –కళాశాల విద్యార్థినులు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయండి విద్యాసంస్థల్లో జరుగుతున్న వరుస ఘటనలపై దృష్టిపెట్టాలి తల్లిదండ్రుల అసోసియేషన్ డిమాండ్ సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, విద్యా సంస్థల్లో ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయని, తమ బిడ్డల రక్షణకు జ్యుడిíÙయల్ కమిషన్‌ను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల అసోసియేషన్ (ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, అధ్యక్షుడు నరహరి శిఖరం, కార్యదర్శి జి.ఈశ్వరయ్య శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లైంగిక దాడులు, విషాహారం, ఆరోగ్య సమస్యలు, మానసిక, శారీరక ఒత్తిళ్లు, దాడులు, ఆత్మహత్యల నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా సంస్థలు, వసతి గృహాల్లో తమ బిడ్డలకు రక్షణ కల్పించి తమకు భరోసా ఇవ్వాలన్నారు. ఏ విద్యాసంస్థలోనైనా, హాస్టళ్లలో అయినా లైంగిక దాడులు, అనారోగ్యం, మానసిక, శారీరక ఒతిళ్లు, ఆత్మహత్యలు వంటి ఘటనలు జరిగితే సంబంధిత అధికారులు, యాజమాన్యాలను బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు.ఇంటి ముఖం పట్టిన విద్యార్థులు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్ విద్యార్థినులు భయం.. భయంగా గడుపుతున్నారు. అత్యవసరమైనప్పటికీ టాయిలెట్స్‌కు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థినులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. క్యాంపస్ నుంచి హాస్టల్‌కు 200 మీటర్ల దూరం ఉంది. పొలాల్లో ఉన్న తారు రోడ్డుపైనే విద్యార్థులు వెళ్లాల్సి ఉంది. పొలాల్లో నాలుగు అడుగుల ఎత్తు గడ్డి మొక్కలు పెరిగాయి. పాములు, విషకీటకాలు సంచరిస్తుంటాయని, రాత్రి సమయంలో వెళ్లాలంటే భయపడుతున్నామని విద్యార్థినులు చెబుతున్నారు. హాస్టల్ కాంపౌండ్ ప్రధాన గేటుకు సైతం లైటు ఏర్పాటు చేయలేదని వాపోతున్నారు.హోంమంత్రి రాజీనామా చేయాలి విద్యార్థినుల హాస్టల్ వీడియోల వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తన పదవికి రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, ఆడపిల్లలపై అకృత్యాలు మితిమీరాయి. గుడ్లవల్లేరు ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. – తోట సంగమేశ్వరరావు, జాతీయ కార్యదర్శి, కమ్యూనిస్టు ఇండియా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి ఈ ఘటనపై టీడీపీ కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజున వందల మంది ఆడపిల్లల గౌరవ మర్యాదలను కాపాడే ప్రయత్నం చేయకుండా, అక్కడ అసలు ఏం జరగలేదని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తుంది. ఇంత పెద్ద ఘటన జరిగినా, కనీసం మానవత్వంతో స్పందించలేని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ బాధ్యతారాహిత్యాన్ని రాష్ట్రంలో మహిళలందరూ ముక్తకంఠంతో ఖండించాలి. – పోతిన మహేష్, వైఎస్సార్సీపీ నేత సుమోటోగా విచారణగుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని లేడీస్ హాస్టల్ వాష్ రూమ్‌లో హిడెన్ కెమెరాలు పెట్టడం దారుణం. కళాశాలను సందర్శించి, విద్యార్థినిలతో మాట్లాడాను. ఈ ఘటనపై సుమోటోగా విచారణకు ఆదేశిస్తున్నాం. హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, కానీ బాత్రూమ్లో రహస్య కెమెరాలు మాత్రం పని చేస్తున్నాయని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలి. – గజ్జల వెంకటలక్ష్మి, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ దోషులను కఠినంగా శిక్షించాలి గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో గరల్స్ హాస్టల్ వాష్ రూమ్స్‌లో హిడెన్ కెమెరాల ఘటన అత్యంత బాధాకరం. ఇటువంటి ఘటనలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలు కల్పిస్తున్నాయి. ఈ ఘటనకు కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి నిందితులను శిక్షించాలి. – పురందేశ్వరి, ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు సమగ్ర దర్యాప్తు చేయాలి గుడ్లవల్లేరు ఘటనతోపాటు రాష్ట్రంలో హాస్టళ్లు, గురుకులాల్లో జరుగుతున్న ఘటనలకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు బాధ్యత వహించాలి. హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ తగు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. – రాజు నాయక్, అధ్యక్షుడు, గిరిజన ప్రజా సంఘం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి విద్యార్థినులు ఉండే హాస్టల్ బాత్రూమ్స్లో సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు తీయడంపై జ్యుడిíÙయల్ ఎంక్వైరీ చేయించాలి. ఈ ఘటనను నిరసిస్తూ రాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యానికి పట్టకపోవడం శోచనీయం. – ఆర్సీపీ రెడ్డి, సీపీఎం కృష్ణా జిల్లా నాయకుడు అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాంఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో స్వయంగా చూశా. ప్రస్తుతం పిల్లలు వాష్ రూమ్స్‌కు పోవాలంటే భయపడుతున్నారు. తక్షణమే న్యాయం జరగాలి. నా పిల్లలు ఇద్దరూ కూడా న్యాయవాదులే. ఈ విషయమై అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తా. – శలంకాయల లీలాకుమారి, కృష్ణా జిల్లా అధ్యక్షురాలు, బీజేవైఎం అసలేం జరిగిందో బయట పెట్టాలి కళాశాల ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలి. రాత్రి పోలీసులు వాష్‌రూంలోని షవర్లను తీసుకువెళ్లారని విద్యార్థినులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను సీజ్ చేశామని పోలీసులు చెబుతున్నారు. వాటిలో ఏం ఉందో మహిళా అధికారులు, మహిళా నేతల ఎదుట బహిర్గత పరచాలి. – వెంకట్ గోపి, జిల్లా కార్యదర్శి, ఏబీవీపీ దీని వెనుక ఎవరున్నా చర్యలు తీసుకోవాలి విద్యార్థినుల వసతి గృహం ఎక్కడో పొలాల్లో చివరన ఉంది. ఎవరికి ఏం జరిగినా తెలియనంత దూరంలో ఉంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే విద్యార్థినులకు న్యాయం జరుగుతుంది. – వీరమల్లు అభినందన, కృష్ణాజిల్లా కార్యదర్శి, బీజేవైఎం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేకృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ ఘటన ప్రభుత్వ వైఫల్యమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ సర్వనాశనమైంది. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలి. – పుత్తా శివశంకర్, వైఎస్సార్సీపీ అధికార ప్రతిని«ధిఆడపిల్లలకు రక్షణ క ల్పించాలి లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం దారుణం. కళాశాలలో నా మేనకోడలు కూడా విద్యనభ్యసిస్తోంది. బాత్రూమ్లో కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల కనీసం వాష్‌రూమ్‌కి కూడా వెళ్లనని ఫోన్ చేసి నా సోదరుడికి చెబుతోంది. మీరు వచ్చి తీసుకెళ్లిపోండంటూ ఏడుస్తోంది. లేదంటే చనిపోతానని చెబుతుంది. నా∙మేనకోడలికే కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకు న్యాయం చేయాలి. – రజనీ, అడ్వొకేట్ -
చంద్రబాబూ ఇకనైనా మేలుకోండి
సాక్షి, అమరావతి: గుడ్లవల్లేరు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటన ఇది అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి, వారి భవిష్యత్తును పణంగా పెట్టకండి అని హితవు పలికారు. ‘చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మూ నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గాలికొదిలేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందల మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు’ అంటూ శుక్రవారం వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. -
గుడ్లవల్లేరులో ఉద్రిక్తత..వైస్సార్సీపీ మహిళా నేతల అడ్డగింత
సాక్షి,కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీలోపలికి వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలను శుక్రవారం(ఆగస్టు30) సాయంత్రం పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి,వైఎస్సార్సీపీ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు.కాలేజీ వద్ద ఆంక్షలు విధించిన పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఫైర్ అయ్యారు. బాధిత విద్యార్థులతో మాట్లాడటంతో పాటు వారి ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వైఎస్సార్సీపీ నేతల బృందం కాలేజీవద్దకు వెళ్లింది. కాలేజీ హాస్టల్లో రహస్య కెమెరాలతో అమ్మాయిల వీడియోలు చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలపై విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. -
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు : వైఎస్ జగన్‘చంద్రబాబు ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి’ అంటూ కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి2.పక్కా స్కెచ్.. మాయలేడి కాదంబరి కేసులో హైడ్రామామాయలేడీ కాదంబరి కేసులో ఉదయం నుంచి హైడ్రామా కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలే టార్గెట్‌గా..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి3.ఉత్తమ్ కచ్చితంగా సీఎం అవుతారు: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిమునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి4.పారా ఒలింపిక్స్.. భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు పారా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. పారా షూటర్ మనీష్ నర్వాల్ అదరగొట్టాడు. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ ఫైనల్ లోమరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి5.5.స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ రెజ్యూమ్స్: ఫోటోలు చూశారా?యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ రెజ్యూమ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి 6.జగన్ వెంటే మేమంతా: వైఎస్సార్సీపీ ఎంపీలుమేం పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి7.'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీఅల్లు అర్జున్ 'పుష్ప 2' చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల నుంచి ఇది సెట్స్ మీద ఉంది. లెక్క ప్రకారం ఆగస్టు 15నే థియేటర్లలోకి రావాలి.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి8.‘వాళ్లకి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు’: ప్రధాని మోదీచత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. శిరస్సు వంచి క్షమాపణలు చెప్పారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి9.గుడ్లవల్లేరు ఘటన.. విద్యార్థుల ఆందోళన ఉధృతంగుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్ధులకు ఏబీవీపీ విద్యార్ధి సంఘం, మహిళా సంఘాలు మద్దతిచ్చాయి. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి10.ట్రంప్ అనే పేజీని తిప్పేందుకు అమెరికన్లు సిద్ధంఅమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్.. మాజీ అధ్యక్షుడుపై విరుచుకుపడ్డారు. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి -
విచారణ చెయ్యకుండానే కెమెరాలు లేవని పోలీసులు
-
300 మంది అమ్మాయిల జీవితాలు నాశనం..
-
గుడ్లవల్లేరు ఘటన.. విద్యార్థుల ఆందోళన ఉధృతం
సాక్షి,కృష్ణాజిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్ధులకు ఏబీవీపీ విద్యార్ధి సంఘం, మహిళా సంఘాలు మద్దతిచ్చాయి. మంత్రి కొల్లు రవీంద్ర,కలెక్టర్, జిల్లా ఎస్పీ హామీ ఇచ్చినా విద్యార్దులు వెనక్కి తగ్గలేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ దృష్టికి ఘటనను తీసుకెళతామని విద్యార్థులు తెలిపారు. ఎలాంటి విచారణ చేయకుండానే కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఫైర్ అయ్యారు. ఘటనపై సాయంత్రంలోగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. కాలేజి బాత్రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టిన విద్యార్ధి,అతనికి సహకరించిన విద్యార్ధినిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విచారణ సక్రమంగా జరగకపోతే రెండు రోజుల్లో రాష్ట్ర బంద్ చేపడతామని హెచ్చరించారు. వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకుంటాం: మంత్రి కొల్లు రవీంద్రగుడ్లవల్లేరు కాలేజీలో విద్యార్ధుల ఆందోళన ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం.హిడెన్ కెమెరాలు పెట్టారన్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్నాం.వీడియోలపై మూడు రోజుల క్రితమే యాజమాన్యానికి తెలిపామని విద్యార్ధినులు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.విచారణకు ఐదుగురు మహిళా సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం.వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకుంటాం విచారణలో ఆరోపణలు నిజమని తేలితే తీవ్రమైన చర్యలు ఉంటాయి.విద్యార్ధుల కెరీర్ కు ఎలాంటి సమస్య రాదు ఇందులో ఉన్నవారు ఎంతటి వారైనా వదిలేది లేదు.కళాశాల యాజమాన్యం విద్యార్ధులను వేధింపులకు గురిచేయకుండా సర్క్యులర్ జారీ చేయిస్తాం. విచారణ జరుగుతోంది.. కాలేజీ ప్రిన్సిపల్ కరుణాకర్గురువారం సాయంత్రం విద్యార్ధుల నుంచి నాకు కంప్లైంట్ వచ్చింది. విద్యార్ధులు చెబుతున్నట్లు వారంరోజుల క్రితం మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. నిన్నటి నుంచి మేం విద్యార్ధులకు అందుబాటులోనే ఉన్నాం. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు మా కాలేజీలో చోటచేసుకోలేదు.విద్యార్ధులు చేస్తున్న ఆరోపణల పై విచారణ జరుగుతోంది. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటాం. -
విచారణ చేయకుండానే.. ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం
-
సృజనాత్మక పరిశోధనలే ప్రగతికి మూలం
గుడ్లవల్లేరు: సృజనాత్మకతే పరిశోధనలకు మూలమని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ రీసెర్చ్ బోర్డ్ సలహాదారుడు డాక్టర్ పి.సంజీవరావు అన్నారు. గుడ్లవల్లేరు ఇంజజినీరింగ్ కాలేజీలో ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధనల ఆవశ్యతకపపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధ్యాపక వృత్తిలోని మేధావులు పరిశోధనాసక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ రీసెర్చ్ బోర్డ్ అన్ని రంగాల్లోని పరిశోధనలను 13 విభాగాలుగా గుర్తించినట్లు చెప్పారు. పరిశోధనలు చేయడానికి అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తోందన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ బోర్డ్ విద్యార్థి దశ నుంచి పరిశోధనా పటిమ కలిగిన వారిని గుర్తించి ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. సృజనాత్మక దృక్పథంతో ముందుకు వస్తే భారత ప్రభుత్వం అందించే వివిధ పథకాలతో వాటిలో నియమ నిబంధనలకు అనుగుణంగా పాటిస్తే జరిగే మేలును వివరించారు. అనంతరం ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీంద్రబాబు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విభాగాధిపతులు డాక్టర్ ఎం.కామరాజు, కరుణకుమార్, ఎస్ఆర్కే రెడ్డి పాల్గొన్నారు. -
హైస్పీడ్ రైళ్లతోనే ఏపీకి శోభ: మెట్రో శ్రీధరన్
గుడ్లవల్లేరు (కృష్ణాజిల్లా) : తెలంగాణాతో విడిపోవటంతో ఏపీ రాష్ట్రంలో రాజధాని ప్రాంతంతో పాటు ఇతర పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మెట్రో, హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుతోనే సుసాధ్యమవుతుంది. ఆ రైళ్లతోనే కొత్త రాష్ట్రానికి అభివృద్ధి శోభ రానుందని భారత దేశపు మెట్రోమెన్‌గా పిలువబడే రాష్ట్ర మెట్రో ప్రాజెక్టుల సలహాదారుడు పద్మ విభూషణ్ డాక్టర్ ఇ.శ్రీధరన్ అన్నారు. శనివారం గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఒక కార్యక్రమానికి వచ్చిన ఆయనకొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు. ప్రశ్న : కొత్త రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనుల్ని ఎక్కడ ప్రారంభించనున్నారు? శ్రీధరన్ : కృష్ణానది అవతల గట్టున ఉన్న గుంటూరు జిల్లాలో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనుల్ని ప్రారంభిద్దామని అనుకున్నాం. కాని విజయవాడలోనే ఆ పనుల్ని చేపడతాం. ప్రశ్న : ఆ పనులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందా? శ్రీధరన్ : గవర్నమెంట్ భవనాల ప్లాన్స్ ప్రభుత్వం నుంచి తమకు రాలేదు. ఆ ప్లాన్స్ వచ్చాకే మెట్రో ప్రాజెక్ట్‌ల ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రశ్న : విజయవాడ, గుంటూరు మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ఎవరు నిర్మిస్తారు? శ్రీధరన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తాయి. ప్రశ్న : నిధులు ఎలా కేటాయించనున్నారు? శ్రీధరన్ : రాష్ట్ర ప్రభుత్వం 50శాతం, కేంద్ర ప్రభుత్వం 20శాతంతో పాటు మిగిలిన వాటాను ప్రపంచ బ్యాంకు వంటి బ్యాంకర్లు భరిస్తారు. ప్రశ్న : విజయవాడలో మెట్రో ప్రాజెక్ట్ నిర్మించేందుకు మీకు ప్లాన్స్ ఎపుడు చేతికి అందవచ్చు? శ్రీధరన్ : కనీసం 4నుంచి 5నెలలు పట్టనున్నాయి. ప్రశ్న : ఎపుడు పనులు ఆరంభిస్తారు? శ్రీధరన్ : 2015సంవత్సరాంతానికి పనులు ప్రారంభించనున్నాం. ప్రశ్న : విజయవాడలో ఏ స్థాయిలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు? శ్రీధరన్ : భవిష్యత్‌లో విజయవాడ రెండు నుంచి మూడు రెట్ల భూ విస్తీర్ణం పెరుగనుంది. రాబోయే 40-50ఏళ్లలో వచ్చే అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్లుగానే మెట్రో ప్రాజెక్ట్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు చెప్పారు. ప్రశ్న : గుంటూరు, విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్ట్‌నే అమలు చేయనున్నారా? శ్రీధరన్ : విజయవాడ, గుంటూరుతో పాటు తెనాలికి ఈ రైలు రాకపోకల్ని పెంచే అవకాశం ఉంది. విజయవాడ పట్టణం వరకైతే మెట్రో రైలే సరిపోతుంది. తెనాలి, గుంటూరుకు కూడా అయితే హైస్పీడ్ రైలే బాగుంటుందని నా అభిప్రాయం. అదే జాయింట్ ప్రాజెక్ట్‌గా రూపొందించే అవకాశం ఉంది. ప్రశ్న : హైస్పీడ్‌కి ప్రభుత్వం నుంచి మద్ధతు ఉందా? శ్రీధరన్ : కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుకు సుముఖంగానే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైస్పీడ్‌కి అనుకూలమే. రెండు ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్ట్ పనులను తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రశ్న : రాష్ర్టంలో వేరే పట్టణంలో ఎక్కడైనా మెట్రో ప్రాజెక్ట్ అవకాశం ఉందా? శ్రీధరన్ : వైజాగ్‌లో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనుల్ని చేపట్టే అవకాశం ఉంది. ప్రశ్న : ఎన్ని కిలోమీటర్ల మేర పనుల్ని చేపట్టనున్నారు? శ్రీధరన్ : 39కిలోమీటర్ల మేరకు మూడు కారిడార్స్‌ను కలుపుతూ పనుల్ని చేపట్టవలసి ఉంది. ప్రశ్న : ప్రాధమికంగా పనులు ఏ స్థాయిలో ఉన్నాయి? శ్రీధరన్ : మెట్రో పనులకు సంబంధించి భూ సర్వే పూర్తయ్యింది. ప్రశ్న : మిగిలిన సర్వేలు ఎంతవరకూ వచ్చాయి? శ్రీధరన్ : నిర్మాణాలకు భూ పరీక్షలు, పర్యావరణ పరిరక్షణకై సర్వే వచ్చే ఏప్రిల్ నెల చివరలో పూర్తి కానున్నాయి. ప్రశ్న : దేశంలో ఎక్కడెక్కడ మెట్రో పనుల్ని తమరు చేపట్టారు? శ్రీధరన్ : కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో మెట్రో పనుల్ని నిర్వహించాను. ప్రశ్న : ఏపీలో మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణంపై మీ అభిప్రాయం? శ్రీధరన్ : ఈ ప్రాంతంలో ప్రజలు మెట్రో ప్రాజెక్ట్‌కు ప్రాధమిక దశలోనే ఎంతో సహకారం అందిస్తున్నారు. చాలా సునాయాసంగా పనుల్ని పూర్తి చేయవచ్చు.