సాక్షి,కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీలోపలికి వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ నేతలను శుక్రవారం(ఆగస్టు30) సాయంత్రం పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి,వైఎస్సార్‌సీపీ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
కాలేజీ వద్ద ఆంక్షలు విధించిన పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఫైర్ అయ్యారు. బాధిత విద్యార్థులతో మాట్లాడటంతో పాటు వారి ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వైఎస్సార్‌సీపీ నేతల బృందం కాలేజీవద్దకు వెళ్లింది. కాలేజీ హాస్టల్‌లో రహస్య కెమెరాలతో అమ్మాయిల వీడియోలు చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలపై విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment