సృజనాత్మక పరిశోధనలే ప్రగతికి మూలం
గుడ్లవల్లేరు: సృజనాత్మకతే పరిశోధనలకు మూలమని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ రీసెర్చ్ బోర్డ్ సలహాదారుడు డాక్టర్ పి.సంజీవరావు అన్నారు. గుడ్లవల్లేరు ఇంజజినీరింగ్ కాలేజీలో ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధనల ఆవశ్యతకపపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధ్యాపక వృత్తిలోని మేధావులు పరిశోధనాసక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ రీసెర్చ్ బోర్డ్ అన్ని రంగాల్లోని పరిశోధనలను 13 విభాగాలుగా గుర్తించినట్లు చెప్పారు. పరిశోధనలు చేయడానికి అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తోందన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ బోర్డ్ విద్యార్థి దశ నుంచి పరిశోధనా పటిమ కలిగిన వారిని గుర్తించి ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. సృజనాత్మక దృక్పథంతో ముందుకు వస్తే భారత ప్రభుత్వం అందించే వివిధ పథకాలతో వాటిలో నియమ నిబంధనలకు అనుగుణంగా పాటిస్తే జరిగే మేలును వివరించారు. అనంతరం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీంద్రబాబు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విభాగాధిపతులు డాక్టర్ ఎం.కామరాజు, కరుణకుమార్, ఎస్‌ఆర్‌కే రెడ్డి పాల్గొన్నారు.