ఆంధ్రప్రదేశ్‌లోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన భయాందోళకు గురిచేస్తోంది. బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న ఓ అమ్మాయి-అబ్బాయి కలిసి.. లేడీస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేశారని, ఏకంగా 300 మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు చిత్రీకరించారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం దీనిపై సత్వర చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదలా ఉండగా హీరోయిన్ పూనమ్ కౌర్.. ఈ సంఘటనపై ట్వీట్ చేసింది. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు)
'ప్రియమైన అమ్మాయిలకు మీలో ఓ అమ్మాయిగా ఈ లెటర్ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు, నమ్మకంతో మిమ్మల్ని బయటకు పంపిస్తున్నారు. కానీ బయట జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. బయట ఎదుర్కొన్న పరిస్థితులు దారుణం. నేరస్థులని రక్షించడం, బాధితులకు అన్యాయం జరగడం లాంటి చాలా అనుభవాలతో నేను అలసిపోయాను. వ్యక్తులు ఎంత శక్తివంతులైనా, వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే వారు ఏ పార్టీకి చెందిన వారైనా మీరు బహిర్గతం చేస్తారని నిర్ధారించుకోండి'
'ఓ అమ్మాయి చాలామంది అమ్మాయిలని ఇలా ప్రమాదంలో నెట్టడం నాకు అసహ్యం కలిగిస్తోంది. నేరస్తులు ఎంతటి శక్తిమంతులైనా వారికి సహకరిస్తున్నా ఎవరినీ విడిచిపెట్టకూడదు. వారికి గుణపాఠం చెప‍్పండి. ఈ మాటలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు చేసే పోరాటం చుట్టుపక్కల ఉన్న వాళ్లకు కూడా బలాన్ని ఇస్తుంది. ప్రేమ, అభినందనలతో' అని పూనమ్ కౌర్ నోట్ రిలీజ్ చేసింది.
(ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్)
#AndhraPradesh pic.twitter.com/DgpWBaw1dO
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) August 31, 2024
Comments
Please login to add a commentAdd a comment