రూబిన్ అబ్జర్వేటరీలో ఏర్పాటు
ఏకంగా 3,200 మెగాపిక్సెల్స్. సామర్థ్యం. 5.5 అడుగుల ఎత్తు, ఏకంగా 12.25 అడుగల పొడవుతో పెద్ద సైజు కారును తలపించే పరిమాణం. దాదాపు 2,800 కిలోల బరువు! 320–1,050 ఎన్‌ఎం వేవ్‌లెంగ్త్ రేంజ్. ఒక్కో ఇమేజ్ కవరేజీ పరిధిలోకి కనీసం 40 పూర్ణ చంద్రులు పట్టేంత ఏరియా! ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా తాలూకు విశేషాల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే.
ఇంతకీ ఇది ఎక్కడుందంటారా? చిలీలో రూపుదిద్దుకుంటున్న వెరా రూబిన్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేస్తున్న సరికొత్త టెలిస్కోప్‌లో. రాజధాని శాంటియాగోకు 500 కి.మీ. దూరంలోని సెరో పాచ్న్ పర్వత శిఖరంపై 2015 నుంచీ నిర్మాణంలో ఉన్న ఈ అబ్జర్వేటరీ త్వరలో ప్రారంభం కానుంది. అందులోని ఈ అతి పెద్ద కెమెరా ప్రతి మూడు రోజులకోసారి రాత్రివేళ దాని కంటికి కని్పంచినంత మేరకూ ఆకాశాన్ని ఫొటోల్లో బంధించనుంది.
అలా అంతరిక్ష శాస్త్రవేత్తలకు పదేళ్లపాటు రోజుకు కనీసం వెయ్యి చొప్పున ఫొటోలను అందుబాటులోకి తెస్తుంది! అంటే రోజుకు 20 టెరాబైట్ల డేటాను అందజేస్తుంది. ఇది ఒక యూజర్ నెట్‌ఫ్లిక్స్‌లో సగటున మూడేళ్లపాటు చూసే ప్రోగ్సామ్స్, లేదా స్పాటిఫైలో ఏకంగా 50 ఏళ్ల పాటు వినే పాటల డేటాకు సమానం! ఈ క్రమంలో మనకిప్పటిదాకా తెలియని ఏకంగా 1,700 కోట్ల కొత్త నక్షత్రాలను, 2,000 కోట్ల నక్షత్ర మండలాలను ఈ కెమెరా వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నారు.
దీన్ని లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ (ఎల్‌ఎస్‌ఎస్‌టీ) కెమెరాగా పిలుస్తున్నారు. అంతేగాక అంతరిక్షంలో సంభవించే చిన్నా పెద్దా మార్పులకు సంబంధించి ప్రతి రాత్రీ ఏకంగా కోటి అలెర్టులను కూడా ఈ టెలిస్కోప్ పంపనుందట కూడా! ‘‘ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే.
వెరా రూబిన్ అబ్జర్వేటరీ మున్ముందు మరెన్నో ఘనకార్యాలు చేయనుంది’’ అని ఆ సంస్థ ఆస్ట్రానమిస్టు క్లేర్ హిగ్స్ చెబుతున్నారు. కృష్ణపదార్థం (డార్క్ మ్యా టర్), కృష్ణ శక్తి (డార్క్ ఎనర్జీ) వంటి పలు మిస్టరీలను ఛేదించడంలో కూడా కీలకపాత్ర పోషించే చాన్సుందన్నారు. ఈ టెలిస్కోప్‌కు 2016లో మరణించిన అమెరికా అంతరిక్ష శాస్త్రజు్ఞడు వెరా రూబిన్ పేరు పెట్టారు. ఇది ఏడాది లోపులో అందుబాటులోకి వస్తుందని అంచనా.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment