వాట్ ఏ టెక్నాలజీ.. ఈజీగా ఈత కొట్టేయొచ్చు! | World's First Underwater Camera That Works With Artificial Intelligence - Sakshi
Sakshi News home page

Underwater Camera: ఈజీగా ఈత కొట్టేయొచ్చు!..మునిగిపోతామనే భయం కూడా ఉండదు!

Published Mon, Aug 28 2023 8:24 AM | Last Updated on Mon, Aug 28 2023 9:11 AM

Worlds First Underwater Camera That Works With Artificial Intelligence - Sakshi

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే తొలి అండర్‌వాటర్‌ కెమెరా ఇది. ఈత కొట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్లు ప్రమాదాలకు గురైతే, ఈ కెమెరా వెంటనే గుర్తిస్తుంది. ఇందులోని డ్రౌనింగ్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌ మునిగిపోతున్న వారిని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇళ్లలోను, హోటల్స్‌లోను ఉండే స్విమింగ్‌పూల్స్‌లో ఉపయోగించడానికి ఇది పూర్తిగా అనువుగా ఉంటుంది.

అమెరికన్‌ గృహోపకరణాలు, స్విమింగ్‌పూల్‌ రక్షణ పరికరాల తయారీ సంస్థ ‘కోరల్‌’ ఈ అండర్‌వాటర్‌ సెక్యూరిటీ కెమెరాను ‘మైలో’ పేరుతో ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘మైలో’ కెమెరా నిరంతరం స్విమింగ్‌పూల్‌ను కనిపెడుతూనే ఉంటుంది. ఈతకొడుతూ ఎవరైనా మునిగిపోతున్నట్లు గుర్తిస్తే, దీని యాప్‌ ద్వారా అనుసంధానమైన కుటుంబ సభ్యులు, సంబంధీకుల స్మార్ట్‌ఫోన్‌లకు తక్షణమే సమాచారం పంపుతుంది. దీని ధర 1499.15 డాలర్లు (సుమారు రూ.1.25 లక్షలు). 

(చదవండి: ఇలా కూడా నిద్రపోవచ్చా!..వర్క్‌ప్లేస్‌లో కూడా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement