ప్రపంచంలోనే తొలిసారిగా సజీవ కంప్యూటర్‌ను రూపొందించారు స్వీడిష్ శాస్త్రవేత్తలు. మనిషి మెదడు కణజాలాన్ని సేకరించి, లాబ్‌లో ఆ కణజాలాన్ని పదహారు చిన్న చిన్న ముద్దలుగా పెంపొందేలా చేశారు. వీటిని ‘ఆర్గనాయిడ్స్’ అంటున్నారు. మెదడు కణజాలం ముద్దలు వాటి నాడుల ద్వారా కంప్యూటర్ చిప్ మాదిరిగానే ఒక దాని నుంచి మరొకటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగలుగుతున్నాయి.
మనిషి మెదడు కణజాలం కంప్యూటర్ కంటే వెయ్యిరెట్ల మెమరీకి 10 నుంచి 20 వాట్ల విద్యుత్తును వినియోగించుకుంటే, కంప్యూటర్లు 21 మెగావాట్ల విద్యుత్తును వినియోగించుకుంటాయని ఈ ప్రయోగం చేపట్టిన స్వీడిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు ప్రాసెసర్ చిప్ బదులుగా మనిషి మెదడు కణజాలంతో రూపొందిన చిప్‌ను అమర్చి తొలి సజీవ కంప్యూటర్‌ను తయారు చేయడంలో విజయం సాధించారు.
‘ఫైనల్ స్పార్క్’ అనే స్టార్టప్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు సైన్స్ ఫిక్షన్‌ను తలపించే ఈ ప్రయోగం చేశారు. జీవనాడీ వ్యవస్థలను యంత్రాల్లో ఉపయోగించడం ద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతోనే తమ సంస్థను ప్రారంభించినట్లు ‘ఫైనల్ స్పార్క్’ కో–సీఈవో డాక్టర్ ఫ్రెడ్ జోర్డాన్ ప్రకటించారు.
ఫైనల్ స్పార్క్ దాదాపు పదివేల సజీవ నాడీకణాలతో 0.5 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కంప్యూటర్ చిప్స్‌ను రూపొందిస్తోంది. వీటిని ‘మినీ బ్రెయిన్స్’గా అభివర్ణిస్తున్నారు. ఆర్గనాయిడ్స్‌తో తయారైన ఈ మినీబ్రెయిన్స్ ఎలక్ట్రోడ్‌ల ద్వారా వచ్చే సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి చదవండి: త్రీ ఇన్ వన్ తందూర్..
Comments
Please login to add a commentAdd a comment