చిన పామును....పెద పాము
చిన చేపను పెద చేప... చిన మాయను పెనుమాయ..... కమ్మేస్తాయన్నది పురాణ వాక్యం. ఆధిపత్యం లేదా ఆకలి పోరాటం. అప్పుడూ...ఇప్పుడూ...ఎప్పుడైనా సరే... సకల జీవరాశికి ఇది వర్తిస్తూనే ఉంటుంది. చిన్న జీవులను చంపి ఆకలి తీర్చుకోవడం జంతు ప్రపంచలో సర్వసాధారం. ఒకే జాతిలో చిన్నవాటిని పెద్దవి చంపి తినడం అరుదుగా అగుపడే దృశ్యం.
అటువంటి వాటిలో ఒక అరుదైనది 'సాక్షి' కెమెరాకు చిక్కింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గురివిందలపేటలో సోమవారం "గవిబట్ట" అని స్థానికంగా పిలిచే ఒక పెద్దపాము కొండచిలువ పిల్లను నోటకరచుకుని.... క్రమంగా గుటకాయస్వాహా చేసింది.