మాగుంట పార్కులో ఉన్న ఆఫ్రికన్ నత్తలు
ఆఫ్రికన్ నత్తలు(జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్) మార్కాపురం–తర్లుపాడు రోడ్డులోని మాగుంట పార్కులో ప్రత్యక్షమయ్యాయి. గత మూడు రోజులుగా సుమారు 100 నత్తలు పార్కులో సంచరిస్తూ వాకర్లను ఆకర్షిస్తున్నాయి. మన ప్రాంతంలో కనిపించే సాధారణ నత్తల కంటే ఇవి భిన్నంగా ఉండటమే అందుకు కారణం. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఈ నత్తలు వచ్చి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.
ఇవి మామూలు నత్తలు కావు..
అచాటినిడే కుటుంబానికి చెందిన ఈ ఆఫ్రికన్ నత్తలు ప్రపంచ వ్యాప్తంగా చీడ సమస్యలకు ప్రధాన కారణం. వ్యవసాయ పంటలతోపాటు స్థానిక మొక్కలకూ నష్టం కలిగిస్తాయి. అత్యంత హానికరమైన ఇన్వాసివ్(ఆక్రమిత) జాతుల్లో ఒకటైన ఈ ఆఫ్రికన్ నత్తలు మానవుల్లో మెనింజైటిస్‌కు కారణమవుతున్నాయి. ప్రపంచంలో టాప్ 100 ఆక్రమిత జాతుల్లో ఈ నత్తలూ ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్పష్టం చేసింది.
ఇవి చదవండి: వర్షం పడని వింత గ్రామం ఎక్కడుందో మీకు తెలుసా? మేఘాలను దగ్గర్నుంచి..
Comments
Please login to add a commentAdd a comment