సాక్షి, హైదరాబాద్: పాము దొరికిందంటే అతనికి పసందైన విందే.. దాన్ని చంపి తోలు ఒలిచి పచ్చిదే ఆరగిస్తుంటాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామానికి చెందిన పుల్లన్నకు పాములు తినే అలవాటుంది. గతంలో చిన్నచిన్న పాములను పట్టుకుని తినే పుల్లన్న సోమవారం చనిపోయిన ఆరడుగుల పామును మెడలో వేసుకుని కొరుక్కుని తింటూ గ్రామ వీధుల్లో తిరిగాడు. ఈ ఘటన చూసిన గ్రామస్తులు విస్తుపోయారు. దీనిపై పుల్లన్నను ప్రశ్నించగా పామును తినడం తనకు అలవాటేనని, కోడికూర తిన్నట్లే ఉంటుందని చెప్పాడు. అయితే ఈ పాము బాగా ముదిరిపోయి ఉన్నందున మూరెడు ముక్క మాత్రమే తినగలిగానని చెప్పాడు. – పుట్లూరు
Comments
Please login to add a commentAdd a comment