హరియాణా:రెజ్లర్ల అంశంపై చర్చించేందుకు హరియాణాలో సమావేశమైన 'ఖాప్ పంచాయతీ' సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వేదికపై సభ్యులు అరుస్తూ.. ఒకరికొకరు వేళ్లు చూపించుకున్నారు. గొడవకు గల కారణాలు తెలియనప్పటికీ ఈ వీడియో వైరల్‌గా మారింది. రెజ్లర్ల ఆందోళనపై తదుపరి చర్యలు తీసుకోవడానికి రైతులతో పాటు 31 మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశమైంది. ఇందులో 9 మందితో కూడిన ప్రత్యేక కమిటి ఆ అంశాలలో దిశానిర్ధేశం చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది.
#WATCH | Scuffle breaks out between the members of Khap panchayat during their meeting in support of wrestlers' protest in Kurukshetra, Haryana pic.twitter.com/Nj15aQgxZ9
— ANI (@ANI) June 2, 2023
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆరోపించారు. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్,బజరంగ్ పునియాతో సహా పలువురు అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్న ఆటగాళ్లు బాధిత రెజ్లర్ల తరపున నిరసనలను చేపట్టారు.
తమ పతకాలను గంగలో నిమజ్జనం చేస్తామని రెజ్లర్లు ప్రకటించి గత మంగళవారం హరిద్వార్‌కు వెళ్లారు.రైతు నాయకులు చివరి నిమిషంలో ఒప్పించి మద్దతు తెలపడంతో రెజ్లర్లు తమ ప్రణాళికలను మార్చుకున్నారు.
రెజ్లర్లకు పలువురు రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలిపారు. 1983 ప్రపంచ కప్ గెలిచిన క్రికెట్ జట్టు సభ్యులు కూడా రెజ్లర్లకు అండగా నిలబడ్డారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ప్రభుత్వం ఆటగాళ్ల సమస్యలను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ఖండించారు. ఆరోపణలు రుజువైతే ఉరివేసుకుంటానని అన్నారు.
చదవండి:ఏడుగురిని ఒకే తరహాలో!.. బ్రిజ్ భూషణ్‌పై సంచలన నిందారోపణలు
Comments
Please login to add a commentAdd a comment