వృద్ధ దంపతులపై అమానుష దాడి | A man is caught on camera repeatedly slapping a woman and her husband, in their 60s, | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతులపై అమానుష దాడి

Published Fri, Dec 11 2015 7:27 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

వృద్ధ దంపతులపై అమానుష దాడి - Sakshi

వృద్ధ దంపతులపై అమానుష దాడి

చండీగఢ్: పంజాబ్ లోని చండీఘఢ్ లో మొబైల్ షాపు యజమానులపై ఓ యువకుడు దారుణంగా దాడిచేశాడు. సుమారు 60 ఏళ్లకుపై బడ్డ భార్యాభర్తలపై వృద్ధులన్న కనికరం లేకుండా విరుచుకుపడి పిడి గుద్దులు కురిపించాడు. ఈ అమానుష దాడి కెమెరా కంటికి చిక్కింది.

తను కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ విషయంలో ఆవేశానికి లోనయ్యాడా యువకుడు. దంపతులతో వాగ్వాదానికి దిగి, దాడికి పాల్పడ్డాడు. సమయానికి వీరి కుమారుడు షాపులో లేకపోవడంతో మరింత రెచ్చి పోయి దాడి చేశాడు. ఇరువురిపైనా విచక్షణా రహితంగా పదే పదే దాడి చేస్తోంటే చుట్టుపక్కల ఉన్నవారెవరూ పట్టించుకోలేదు. భర్తపై అమానుషగా దాడి చేస్తోంటే...  రోదిస్తూ రక్షణగా ఆ పెద్దావిడ నిలబడ్డం స్పష్టంగా రికార్డయింది.

నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు చెప్పారు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో వృద్ధ దంపతుల్లో భర్తకి చేయి విరగ్గా, భార్యకు గాయాలయ్యాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement