ఖాకీ కావరం
Published Mon, May 23 2016 1:52 PM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM
ముంబై: కండివలి పోలీసు స్టేషన్ లో ఒక మహిళను విచక్షణా రహితంగా కర్రతో కొడుతూ , హింసిస్తున్న వీడియోపై విచారణకు ఆదేశించినట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మే 11న రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పని చేస్తున్నరాకేష్ శెట్టి తమకు అండర్ వరల్డ్ నేరస్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కంప్లైంట్ చేయడానికి తన భార్యతో కలిసి కండవల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లాడు.
అక్కడ డ్యూటీలోఉన్నసబ్ ఇన్ స్పెక్టర్ రియాజ్ ములాని కి ఫిర్యాదు చేయగా అతను పట్టించుకోలేదు సరికదా తన భార్యను అసభ్యపదజాలంతో దూషించాడని రాకేష్ పై అధికారి దగ్గరకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని వివరించారు. అక్కడున్న పోలీసు అధికారులు వారిని అసభ్యంగా దూషిస్తూ, విచక్షణా రహితంగా తన భార్యను కర్రతో పోలీసు స్టేషన్ లో కొడుతుండటాన్ని రాకేష్ శెట్టి తన సెల్ ఫోన్లో రికార్డు చేశాడు. గత కొన్ని రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై స్థానిక మీడియా డీసీసీ సంగ్రామ్ సింగ్ నిషింధర్
ను ప్రశ్నించగా ఇన్ స్పెక్టర్ రియాజ్ ములాని పై కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.
Advertisement
Advertisement