thrashing
-
మద్యం మత్తులో విచక్షణ మరచి..
మెదక్ రూరల్: ముక్కుపచ్చలారని చిన్నారి పట్ల ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కన్న కూతురిని చితకబాదుతూ ఆ తల్లి పైశాచిక ఆనందాన్ని పొందిన సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. హవేలిఘణాపూర్ మండలం పోచమ్మరాల్ గ్రామానికి చెందిన కవితకు వైష్ణవి, నిత్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మద్యం, ఇతర వ్యసనాలకు అలవాటు పడిన కవిత మెదక్‌లో డబ్బులు యాచిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద కవిత మద్యం తాగడంతో పాటు తన మూడేళ్ల కూతురు నిత్యకు కూడా మద్యం తాగించి విచక్షణా రహితంగా చితకబాదింది. దీంతో తీవ్రగాయాలపాలైన చిన్నారిని చూసి చలించిన స్థానికులు మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు చిన్నారి ముఖం, తల భాగాల్లో తీవ్రగాయాలయ్యాయని సీటీ స్కాన్ చేయాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సమీఉద్దీన్ వెంటనే ఆస్పత్రికి వెళ్లి చిన్నారికి సీటీ స్కాన్ చేయించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆయన పాపను హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. మూడేళ్ల పసిపాపను మద్యం మత్తులో కొట్టి ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చిన తల్లిపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ధమ్కికి రూ. 1000.. లేపేస్తే రూ.55,000
లక్నో: హోటల్‌కి వెళ్లినప్పుడు మనం మెను కార్డులు చూస్తూ ఉంటాం. ఒక్కో ఆహారానికి ఒకే రేటు. అలానే ప్రయాణాల సమయంలో, హోటల్స్, సినిమా థియేటర్లు ఇలా పలు చోట్ల మనం వేర్వేరు సర్వీసులకు ఎంత డబ్బు తీసుకుంటారో తెలిపే డిస్ప్లే బోర్డులను చూస్తూ ఉంటాం. కానీ వేర్వేరు నేరాలకు వివిధ రేట్లను నిర్ణయిస్తూ ప్రకటన ఇవ్వడం ఎప్పుడైనా చూశారా. లేదంటే ఓ సారి ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ వెళ్లండి. అక్కడ మీకు ఓ గ్యాంగ్ కనిపిస్తుంది. కిడ్నాప్, బెదిరించడం, హత్య చేయడం, కొట్టడం వంటి పనులు చేసి పెడతారు. కాకపోతే వారు డిసైడ్ చేసినంత మనీ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక ఏ క్రైమ్‌కి ఎంత చార్జ్ చేస్తారో వివరిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.(చదవండి: 'ఆంటీ' అన్నందుకు జుట్టు పట్టుకుని కొట్టింది) దాని మీద ధమ్కి(బెదిరించడానికి)కి 1000 రూపాయలు, కొట్టడానికి 5,000 రూపాయలు, ఎవరినైనా గాయపర్చడానికి 10,000 రూపాయలు.. హత్యకు 55,000 రూపాయలు మాత్రమే అంటూ ఈ గ్రూపు పోస్టర్ విడుదల చేసింది. దాని మీద ఓ యువకుడు చేతిలో తుపాకీ పట్టుకుని ఉండగా.. పక్కనే మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. ఇక ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ప్రకటన ఇచ్చిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీరంతా చరతవాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చౌకడ గ్రామానికి చెందిన వారని తెలిసింది. వీరిలో ఓ యువకుడు పీఆర్డీ జవాన్ కుమారుడిగా తెలిసింది. ఈ క్రమంలో ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘కేసు నమోదు చేశాం. సదరు యువకులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
చెప్పు దెబ్బలు తిన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
లక్నో : లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న కారణంతో ఇద్దరు యువతులు కలిసి అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని చెప్పులతో దేహశుద్ది చేసిన ఘటన ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జలాన్‌కు చెందిన అనూజ్ మిశ్రా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం అనూజ్ మిశ్రా జలాన్ సమీపంలోని ఒరై రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఇంతలో స్టేషన్‌వైపు వస్తున్న ఇద్దరు యువతులపై అనూజ్‌మిశ్రా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడడమే గాకుండా లైంగిక వేధింపులకు గురిచేశాడు. (చదవండి : బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..) దీంతో ఆగ్రహించిన సదరు యువతులు అనూజ్ మిశ్రాను పట్టుకొని తమ చెప్పులతో దేహశుద్ది చేశారు. చివరికి అనూజ్‌మిశ్రా క్షమించమని మహిళ కాళ్లు మీద పడ్డా అప్పటికే కనికరించలేదు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న వారు అతని బట్టలు చించేసి మరోసారి చితకబాదారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని అనూజ్ మిశ్రాను విడిపించి అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడికి ఈ శాస్తి జరగాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
ఖాకీ కావరం
ముంబై: కండివలి పోలీసు స్టేషన్ లో ఒక మహిళను విచక్షణా రహితంగా కర్రతో కొడుతూ , హింసిస్తున్న వీడియోపై విచారణకు ఆదేశించినట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మే 11న రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పని చేస్తున్నరాకేష్ శెట్టి తమకు అండర్ వరల్డ్ నేరస్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కంప్లైంట్ చేయడానికి తన భార్యతో కలిసి కండవల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ డ్యూటీలోఉన్నసబ్ ఇన్ స్పెక్టర్ రియాజ్ ములాని కి ఫిర్యాదు చేయగా అతను పట్టించుకోలేదు సరికదా తన భార్యను అసభ్యపదజాలంతో దూషించాడని రాకేష్ పై అధికారి దగ్గరకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని వివరించారు. అక్కడున్న పోలీసు అధికారులు వారిని అసభ్యంగా దూషిస్తూ, విచక్షణా రహితంగా తన భార్యను కర్రతో పోలీసు స్టేషన్ లో కొడుతుండటాన్ని రాకేష్ శెట్టి తన సెల్ ఫోన్లో రికార్డు చేశాడు. గత కొన్ని రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై స్థానిక మీడియా డీసీసీ సంగ్రామ్ సింగ్ నిషింధర్ ను ప్రశ్నించగా ఇన్ స్పెక్టర్ రియాజ్ ములాని పై కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.