ఆపిల్ ఐఫోన్ 12 లాంచ్ అయ్యి కొద్దీ నెలలు అయిందో లేదో అపుడే ఆపిల్ ఐఫోన్13పై పలు పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ ఫోన్ విడుదలకు ఏడాది సమయం ఉన్న తాజాగా ఐఫోన్13లో రాబోయే కెమెరా గురుంచి అనేక రూమర్లు వస్తున్నాయి. దీనిలో పెద్ద కెమెరా సెన్సార్ రాబోతున్నట్లు సమాచారం. టెక్ నిపుణుడు రాస్ యంగ్ ప్రకారం, ఐఫోన్ 13 ప్రో మరియు 13 ప్రో మాక్స్ లో పెద్ద సెన్సార్లను కలిగి ఉండనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా రాత్రి వేళలో ఐఫోన్ 12 కంటే మంచి నాణ్యమైన ఫోటోలను తీసుకోవచ్చు. ఐఫోన్ 13 మరియు 13 మినీలకు ఐఫోన్ 12 ప్రో మాక్స్ కెమెరా సెన్సార్ లభిస్తుందని విశ్లేషకుడు చెప్పారు. వీటిలో కొత్త 'సెన్సార్ షిఫ్ట్' టెక్ లేదా డుయో కంప్యూటేషనల్ టెక్ ఉపయోగిస్తారా అనే దానిపై స్పష్టత లేదు.(చదవండి: మార్కెట్ లోకి మరో బడ్జెట్ గేమింగ్ ఫోన్)
రాబోయే ఐఫోన్లలో మెరుగైన అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను చేర్చడం విశేషం. వైడ్ యాంగిల్ సెన్సార్ల కోసం ఆపిల్ 13 ప్రో మరియు 13 ప్రో మాక్స్లలో ఎపర్చర్‌ను పెంచనున్నారు. దీని అర్థం వేగవంతమైన షాట్లు మరియు వైడ్ యాంగిల్ డెప్త్ చిత్రాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం లెన్స్ f/2.4 ఎపర్చర్‌తో వస్తుంది, అయితే ఐఫోన్ 13ప్రోలో మోడల్స్ 5-ఎలిమెంట్ లెన్స్‌కు బదులుగా 6-ఎలిమెంట్ లెన్స్‌తో f/1.8 ఎపర్చర్ తో రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐఫోన్ 12 ప్రో మాక్స్‌కు పరిమితం అయిన 'సెన్సార్ షిఫ్ట్' ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీ వచ్చే ఏడాది ఐఫోన్ 13 ప్రో మరియు 13 ప్రో మాక్స్ రెండింటిలోనూ వస్తుందని నిపుణుల అంచనా. చిత్రాలను క్లిక్ చేసేటప్పుడు లేదా వీడియోలను షూట్ చేసేటప్పుడు లెన్స్ స్థిరంగా ఉండటానికి దాని సెన్సార్ షిఫ్ట్ సెకనుకు 5000 సర్దుబాట్లు చేయగలదని ఆపిల్ పేర్కొంది.
ఐఫోన్13 కెమెరా ఫీచర్లు వైరల్
Published Sun, Dec 6 2020 2:50 PM | Last Updated on Sun, Dec 6 2020 3:24 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment