సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అప్పుడప్పుడు భద్రత విషయంలో విషయంలో కొన్ని చిక్కులు ఎదురైన వాటిని వెంటనే గుర్తించి పరిష్కరిస్తుంది. కాగా ప్రస్తుతం ఐఫోన్ ఫేస్ అన్‌లాకింగ్ సిస్టమ్‌కు సంబంధించి ఒక లోపం బయటపడింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్ తన ఐఫోన్ 12 మినీ ఫేస్ అన్‌లాకింగ్ సిస్టమ్‌లో కనుగొన్న ప్రధాన లోపాన్నిగుర్తించి వీడియోను పోస్ట్ చేశాడు.
వినమ్రే సూద్ అనే నెటిజన్ తన సోదరుడితో కలిసి ఉన్న వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో ఐఫోన్‌ను సూద్ తన ఫేస్ ఐడిని ఉపయోగించి అన్‌లాక్ చేసి తన సోదరుడు ఉపన్షుకు ఇచ్చాడు. ఉపన్షు ఫేస్ ఐడితో వినమ్రే ఫోన్‌ను అన్‌లాక్ చేయగలిగాడు. ఇరువురు సోదరులు కవలలు కాకపోయినప్పటికీ ఐఫోన్ వీరి ఇరువురి ఫేస్ ఐడీలను ఒకే విధంగా గుర్తించి మొబైల్ ఫోన్‌ను అన్‌లాక్ చేసింది. కాగా ఐఫోన్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ వారి విషయంలో పూర్తిగా విఫలమైంది.
విన్రమే సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ.. ఆపిల్ ఫేస్‌ఐడి గుర్తించడంలో పూర్తిగా విఫలమైంది. మొబైల్ పరిశ్రమలో పేరున్న ఒక సంస్థ తమ మార్కెటింగ్ ప్రచారంలో వినియోగదారుల భద్రతకు రాజీ లేకుండా ఉంటుందని చెప్పకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నాడు. మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చే భద్రతను కూడా ఆపిల్ ఐఫోన్ ఇవ్వలేకపోతుందని తెలిపాడు. కాగా 2017లో సీఎన్‌ఎన్ చేసిన ఒక పరీక్షలో ఐఫోన్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ పూర్తిగా విఫలమైంది.
వాస్తవానికి ఐఫోన్ ఫేస్ అన్‌లాకింగ్ సిస్టమ్ ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే ఫేస్ అన్‌లాకింగ్ సిస్టమ్ కంటే చాలా మెరగైంది. ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడంలో పదిలక్షల మందిలో ఒకరిని గుర్తించే సంభావ్యతను కలిగి ఉంటుందని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment