Face recognition System
-
వ్యక్తులను గుర్తించే ‘దివ్యదృష్టి’!
పుర్రె భాగాన్ని స్కాన్‌చేసి వ్యక్తులను గుర్తించే ఏఐ సాంకేతికత ‘దివ్యదృష్టి’ను తయారు చేసినట్లు రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) తెలిపింది. డీఆర్డీఓ ఏర్పాటు చేసిన ‘డేర్ టు డ్రీమ్ ఇన్నోవేషన్ కంటెస్ట్ 2.0’లో ఈ టెక్నాలజీను ఆవిష్కరించిన ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ కంపెనీ విజేతగా నిలిచిందని చెప్పింది.డీఆర్డీఓ తెలిపిన వివరాల ప్రకారం..‘దేశవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు డేర్ టు డ్రీమ్ ఇన్నోవేషన్ కంటెస్ట్ 2.0ను ఏర్పాటు చేశాం. అందులో భాగంగా కొత్త ఏఐ టూల్‌ను పరిచయం చేసిన ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ కంపెనీ గెలుపొందింది. శివాని వర్మ అనే మహిళా వ్యాపారవేత్త ఈ కంపెనీను స్థాపించారు. సంస్థ తయారు చేసిన ‘దివ్యదృష్టి’ అనే ఏఐ టూల్ ద్వారా విభిన్న వ్యక్తులను కచ్చితత్వంతో గుర్తించవచ్చు. ఇందులో భాగంగా మానవుల పుర్రె భాగాన్ని వివిధ శారీరక పరామితులను ఉపయోగించి స్కాన్ చేస్తారు. పుర్రె పరిమాణం, అందులోని ఇతర పరామితులు వ్యక్తులనుబట్టి మారుతాయి. దాంతో విభిన్న వ్యక్తుల ముఖాలను కచ్చితత్వంతో గుర్తించవచ్చు. అడ్వాన్స్డ్ బయోమెట్రిక్ సాంకేతికతను కూడా ఈ ‘దివ్యదృష్టి’లో ఉపయోగించారు.కొత్తగా కనుగొన్న ఏఐ టూల్‌ను రక్షణ, లా ఎన్ఫోర్స్మెంట్, కార్పొరేట్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా విభిన్న రంగాల్లో వినియోగించవచ్చని డీఆర్డీఓ తెలిపింది. బెంగళూరులోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్(సీఏఐఆర్) మార్గదర్శకత్వంతో ఈ టూల్‌ను కనుగొన్నట్లు ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ తెలిపింది.ఇదీ చదవండి: మార్కెట్ ట్రెండ్ గమనిస్తున్నారా? ఇప్పుడేం చేయాలంటే..డిఫెన్స్ ఆర్ అండ్ డీ సెక్రటరీ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ..కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేలా డీఆర్డీఓ అనుసరిస్తున్న మార్గాలు అభినందనీయమన్నారు. ‘దివ్యదృష్టి’ అభివృద్ధికి టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ (టీడీఎఫ్) సహాయం చేయడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఫేస్ రికాగ్నిషన్ టెక్నాలజీలో కేవలం ముఖ కవలికలు, ముక్కు, కళ్లు, కనుబొమ్మలు.. వంటి భాగాలను స్కాన్ చేసి వ్యక్తులను గుర్తిస్తున్నారు. అయితే దాదాపు ఒకేలా ఉన్న వ్యక్తులను ఈ టెక్నాలజీతో కనిపెట్టడం కొంత కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చిన ‘దివ్యదృష్టి’ ఏకంగా పుర్రె భాగాలను స్కాన్ చేస్తుంది కాబట్టి మరింత కచ్చితత్వంతో కనిపెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
రైల్వే స్టేషన్లలో సరికొత్త సెక్యూరిటీ సిస్టమ్.. ఇక దొంగల ఆటకట్టు!
దేశంలోని రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రయాణికుల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు వార్తలు తరచూ వింటుంటాం. ఇలాంటి రైల్వే స్టేషన్లలో దొంగల ఆట కట్టించడానికి భారతీయ రైల్వే (Indian Railways) సరికొత్త భద్రతా వ్యవస్థను తీసుకొస్తోంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా వివిధ ప్రాంతాల్లో భద్రతను పెంచేందుకు సెంట్రల్ రైల్వే సర్వం సిద్ధం చేసింది. సెంట్రల్ రైల్వేస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. త్వరలో 364 రైల్వే స్టేషన్లలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌తో కూడిన 3,652 కెమెరాలతో సహా మొత్తం 6,122 క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ (CCTV) కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రైల్‌టెల్‌తో రైల్వే బోర్డు అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. (iPhone 15: షాకింగ్.. బ్రేకింగ్! ఇదేం ఐఫోన్ భయ్యా.. వైరల్ వీడియో) "ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, వీడియో అనలిటిక్స్, వీడియో మేనేజ్మెంట్ సిస్టమ్‌తో కూడిన కెమెరాలు ప్రయాణికుల భద్రతను పెంపొందిస్తాయి. నేరాలను నియంత్రిస్తాయి. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారిని అరికట్టగలవు. రైల్వే నిబంధనలకు అనుగుణంగా పర్యవేక్షిస్తాయి" అని ప్రకటనలో వివరించారు. కెమెరాలు ఇలా పనిచేస్తాయి.. రైల్వే స్టేషన్లోకి దొంగ ప్రవేశించగానే ఈ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు గుర్తించి వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తాయి. ఇందుకోసం ఇదివరకే డేటాబేస్‌లో స్టోర్ అయిన దొంగల ఫేస్ సమాచారాన్ని ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు వినియోగించుకుంటాయి. ఈ కెమెరాలు కంటి రెటీనా లేదా నురురు వంటి ముఖ భాగాలను గుర్తించగలవు. ప్రతి హెచ్డీ కెమెరా సుమారు 750 జీబీ డేటాను వినియోగిస్తుంది. ఇక 4K కెమెరాలు నెలకు 3 టీబీ డేటాను వినియోగించుకుంటాయి. వీడియో ఫుటేజ్‌ను పోస్ట్ ఈవెంట్ అనాలిసిస్, ప్లేబ్యాక్, ఇన్వెస్టిగేషన్ ప్రయోజనాల కోసం 30 రోజుల పాటు నిల్వ చేయనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. -
అమెరికాలో వరుస ఘటనలు, సరికొత్త స్మార్ట్ గన్.. ఎవరుపడితే వారు కాల్చలేరు
వాషింగ్టన్: యజమాని మినహా మరెవరూ పేల్చడం సాధ్యంగాని 9ఎంఎం తుపాకీని తయారు చేసింది అమెరికాకుచెందిన బయోఫైర్ కంపెనీ. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, కాల్చే వ్యక్తిని పోల్చుకునే ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీ దీని సొంతం. ఇలాంటి తుపాకీ ప్రపంచంలో ఇదే మొదటిది. గన్ను పక్కన పెట్టేయగానే లాక్ అవుతుంది. అమెరికా వంటి దేశాల్లో చిన్నారులు పొరపాటున తుపాకీ కాల్చడం, గన్ చోరీ తదితరాలకు ఇక తెర పడుతుందని బయోఫైర్ సంస్థ చెబుతోంది. ఈ సంస్థకు ఇంటెల్, గూగుల్, నాసాలు తోడ్పాటునందిస్తున్నాయి. అమెరికాలో తరచూ తుపాకీల కాల్పులు ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ హింసను నియంత్రించి తుపాకీని ఎవరు పడితే వారు వాడకుండా చేయాలనే సదుద్దేశంతో ఈ స్మార్ట్గన్ను అభివృద్ధి చేసినట్లు బయోఫైర్ పేర్కొంది. వచ్చే ఏడాది ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇప్పుడే ప్రీ ఆర్డర్లు కూడా తీసుకుంటోంది. ఈ స్మార్ట్ గన్ను బయోఫైర్ వ్యవస్థపకుడు క్లోయేఫర్(26) అభివృద్ధి చేస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచే దీన్ని రూపొందిస్తున్నారు. సాంకేతికతతో ప్రతి సమస్యను పరిష్కరించేలేమని, కానీ అమెరికాలో క్లిష్టమైన సమస్యలను సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించుకోగలమని క్లోయేఫర్ పేర్కొన్నారు. ఈ గన్‌తో పొరపాటున పిల్లల చేతుల్లో తుపాకులు పేలే ఘటనలు తగ్గుతాయని చెప్పారు. యజమానులు తప్ప మరెవరికీ తుపాకీని ఉపయోగించడం సాధ్యం కాకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉండవన్నారు. చదవండి: కృత్రిమ మేధపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆందోళన.. తేడావస్తే అంతే! -
తిరుమల భక్తుల దర్శనం కోసం కొత్త టెక్నాలజీ
-
వైద్య సిబ్బందికి ముఖ ఆధారిత హాజరు
భీమవరం(ప్రకాశం చౌక్): పేద, మధ్యతరగతి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత పారదర్శక సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా ఫేస్ రికగ్నేషన్ (ముఖ ఆధారిత) యాప్ ద్వారా హాజరు వేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. గురువారం (డిసెంబర్ 1) నుంచి జిల్లావ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానుంది. ఆయా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది అందరూ ఈ విధానంలోనే హాజరు వేయాల్సి ఉంటుంది. దీనిద్వారా వారు పనిచేస్తున్న ప్రాంతంలోనే నిర్దేశించిన సమయంలోనే హాజరు వేయాల్సి ఉండటంతో విధులకు డుమ్మా కొట్టే అవకాశం ఉండదు. డ్యూటీ సమయంలో వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆస్పత్రిలోనే ఉండి సేవలు అందించేలా ఈ కొత్త యాప్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. రోజుకు మూడు సార్లు చొప్పున.. వైద్యులు, సిబ్బంది రోజుకు మూడుసార్లు ఆస్పత్రిలో ముఖ ఆధారిత యాప్ ద్వారా హాజరు వేయాలి. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 4 గంటలకు హజరు వేయాల్సి ఉంటుంది. రోజుకు మూడుసార్లు కచ్చితంగా హాజరు వేయాల్సిందే. జిల్లాలో 1,212 మంది.. జిల్లాలో ఏరియా ఆస్పత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్యులు, అన్నిరకాల సిబ్బంది కలిపి మొత్తం 1,212 మంది ఉన్నారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 500 మంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 712 మంది ఉన్నారు. 99 శాతం మేర ఫేస్ రికగ్నేషన్ యాప్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. నేటి నుంచి అమలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది అంతా ప్రభుత్వ నూతనంగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా బయోమెట్రిక్ వేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలోని అన్ని ఆస్పత్రుల నుంచి సుమారు 1,212 వైద్య సిబ్బందికి సంబంధించి ప్రక్రియ చేపట్టగా 98 శాతం మేర నమోదు కార్యక్రమం పూర్తి చేశారు. రోజుకు మూడుసార్లు వైద్య సిబ్బంది యాప్ ద్వారా బయోమెట్రిక్ వేస్తారు. –మహేశ్వరరావు, డీఎంహెచ్ఓ, పశ్చిమగోదావరి జిల్లా -
‘ఫేషియల్ అథంటికేషన్’కు అనుమతి .. తొలి రాష్ట్రం ఏపీనే
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, ఉద్యోగుల హాజరు వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆధార్ అనుసంధానంతో కూడిన ‘ఫేషియల్ అథెంటికేషన్’ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. దేశంలో ఇలా ఆమోదం పొందిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మాత్రమే ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్) ద్వారా నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆధార్ ఫేషియల్ అథంటికేషన్ వినియోగిస్తున్నారు. నిజానికి.. మన రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో, ప్రభుత్వోద్యోగుల హాజరులో ఆధార్ బయోమెట్రిక్ విధానాన్ని మాత్రమే అమలుచేస్తున్నారు. అయితే.. ఈ విధానంలో లబ్దిదారుల వేలిముద్రలు సేకరించడానికి, ఉద్యోగుల హాజరు నమోదుకు మొబైల్ ఫోన్లు, యాప్‌లకు తోడు ప్రత్యేక వేలిముద్రల నమోదు యంత్రాలను ఉపయోగిస్తారు. సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల బయోమెట్రిక్ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది. ఇవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30–40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటోంది. ఇందుకు ఏటా రూ.10–12 కోట్లు వెచి్చంచాల్సి వస్తోంది. మరోవైపు.. వేలిముద్ర సరిపోక లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫేíషియల్ అథంటికేషన్ విధానంలో అయితే అదనంగా ఎలాంటి పరికరాలు అక్కర్లేదని అధికారులు వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్ చేయగానే అది ఆధార్‌కు అనుసంధానమై లబి్ధదారుణ్ణి గుర్తిస్తుందని అధికారులు తెలిపారు. 80 వేల మందికి పింఛన్ల పంపిణీకి రూ.కోటి ఖర్చు.. ఇక ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్ విధానంలో ప్రతినెలా పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక అనేకచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసుకునే వాళ్ల వేలిముద్రలు అరిగిపోవడంతో బయోమెట్రిక్ సమయంలో ఇచ్చే వేలిముద్రలకు ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్రలతో సరిపోక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బయోమెట్రిక్ స్థానంలో ఐరిస్ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్ చేసుకున్న వారితోనూ సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతినెలా 80 వేల మందికి ఆధార్‌తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతోంది. ఇలాంటి వారి ఫొటోలను స్థానిక సిబ్బందే ముందుగా యాప్‌లో నమోదుచేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబి్ధదారుని ఫొటో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. నిజానికి.. ఒక లబి్ధదారునికి ఒక విడత పంపిణీ చేస్తే రూ.10 చొప్పున సాఫ్ట్వేర్ ప్రొవైడర్‌కు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పుడు పింఛన్ల పంపిణీలో ఆధార్ ఫేషియల్ విధానాన్ని ప్రవేశపెడితే మధ్యలో స్టాఫ్ట్వేర్ ప్రొవైడర్‌కు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆధార్ బేస్డ్ ‘ఫేషియల్ అథంటికేషన్’లో కొద్దిపాటి అవినీతికీ ఆస్కారముండదని అధికార వర్గాలు వివరించాయి. ప్రయోగాత్మకంగా అమలుచేశాకే పూర్తిస్థాయిలో.. ఈ రెండు విధానాలు అధార్ డేటాతో అనుసంధానం అవుతున్నప్పటికీ బయోమెట్రిక్ విధానంలో తలెత్తే ఇబ్బందులన్నింటినీ ఫేషియల్ అథంటికేషన్ విధానంతో అధిగమించడంతోపాటు పూర్తి పారదర్శకంగానూ అమలుచెయ్యొచ్చని అధికారులు అంటున్నారు. అలాగే, బయోమెట్రిక్ స్థానంలో ఫేషియల్ అథంటికేషన్ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు యూఐడీఏఐ విభాగం అనుమతి తప్పనిసరి. దీంతో రాష్ట్రంలో ఫేషియల్ అథంటికేషన్ విధానం అమలుకు కేంద్ర ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఐడీఏఐ అనుమతిని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కోరింది. ఆయా సంస్థల సూచనల మేరకు పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో అమలుచేశారు. ఆ తర్వాతే ఆధార్ ఫేషియల్ అథంటికేషన్ వినియోగానికి ఆమోదం లభించింది. సచివాలయ ఉద్యోగులకు ‘ఫేషియల్’ ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా శుక్రవారం నుంచి ఆధార్ అనుసంధానంతో కూడిన ఫేషియల్ (ముఖం గుర్తింపు) ద్వారా కూడా హాజరు నమోదుచేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొబైల్ యాప్‌లో శుక్రవారం కొత్తగా ఈ సౌకర్యాన్ని కలి్పంచారు. ఇక నుంచి సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బయోమెట్రిక్ (వేలిముద్రలు) విధానంతోపాటు ఐరిస్ (కళ్లు గుర్తింపు) విధానం, కొత్తగా ఫేషియల్ విధానంలోనూ హాజరు నమోదుకు వీలు కల్పించారు. ఈ మూడింట్లో దేని ద్వారానైనా హాజరు నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. -
ఫేస్ రికగ్నెజేషన్ యాప్‌కు టీచర్లు అంగీకారం తెలిపారు: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: విద్యావ్యవస్థలో మార్పులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పలు విషయాలు వెల్లడించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉపాధ్యాయ సంఘాలతో రెండు అంశాలపై చర్చించాము. విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఫేస్ రికగ్నెజేషన్ యాప్‌లో లోపాలు సరిదిద్దాము. ఈ యాప్ అమలు కోసం 15రోజుల గడువు కోరాము. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాము. ఫేస్ రికగ్నెజేషన్ యాప్ అమలుకు టీచర్లు అంగీకారం తెలిపారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలనే ఈ నిర్ణయం తీసుకున్నాము. నాడు-నేడు ద్వారా స్కూళ్లలో మార్పులు తెచ్చాము. మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమిస్తున్నాము. 248 పోస్టులను సీనియారిటీపరంగా భర్తీ చేశాము. 38 డిప్యూటీ డీఈవో పోస్టులను కొత్తగా ఇస్తున్నాము. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఏమనాలో తెలియక.. వారి ఖాతాలో వేసుకునే యత్నం! -
ప్రభుత్వాఫీసుల్లోనూ ఫేస్ రికగ్నిషన్ యాప్
సాక్షి, అమరావతి: త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ వ్యవస్థను తీసుకురానున్నామని.. అందులో భాగంగా తొలుత విద్యాశాఖలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడలో గురువారం ఉపాధ్యా య సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల అటెండెన్స్ నమోదు కోసం రూపొందించిన యాప్ వినియోగంలో ఉన్న అపోహలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. సమావేశం అనంతరం బొత్స మీడియాతో మాట్లాడు తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు అందరూ ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్‌నే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా తొలుత విద్యాశాఖ లో దీనిని ప్రవేశపెట్టామన్నారు. అటెండెన్స్ యాప్ విషయంలో ఉపాధ్యాయులు ఎంతమాత్రం ఆందోళ న చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశా రు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని మంత్రి అన్నారు. విద్యార్థుల బాగోగులు, మంచి ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా, పూర్తి సానుకూల దృక్పథంతోనే విధానపరమైన నిర్ణయా లు తీసుకుంటున్నామని, వాటిని అమలుచేయడంలో ఏమైనా సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించ డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని బొత్స తెలిపా రు. విద్యాశాఖలో ఉపాధ్యాయుల అటెండెన్స్‌కు సం బంధించిన యాప్ విషయంలో కొంత సమాచార లోపం వచ్చిందని.. దానిని సరిదిద్దే క్రమంలో ఆయా సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సందేహా లను నివృత్తిచేసే చర్యలు చేపట్టామన్నారు. వారి అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలకు ఆలస్యంగా వస్తే ఆ రోజును సెలవుగా పరిగణిస్తారన్న ప్రచారం పై మంత్రి స్పష్టతనిస్తూ.. ఉద్యోగుల హాజరు విషయంలో ఏళ్ల తరబడి ఉన్న నిబంధనలనే అమలుచేస్తున్నామని, కొత్తగా ఏమీ చేర్చలేదన్నారు. మూడు సార్లకు మించి నాలుగోసారి ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్ కింద పరిగణించడం తప్ప కొత్త నిబంధనలేమీ పెట్టలేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రంలో 1.83 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే, ఇంతవరకు దాదాపుగా లక్ష మంది యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని, మిగిలిన వారందరూ కూడా యా ప్ను డౌన్లోడ్ చేసుకుని దాని వినియోగాన్ని అల వాటు చేసుకునేందుకు 15 రోజులను ట్రైనింగ్ పీరి యడ్గా పరిగణించాలని నిర్ణయించామన్నారు. 5 జూనియర్ కాలేజీలు క్లస్టర్ కళాశాలలుగా మార్పు మరోవైపు.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురంలోని ఐదు జూనియర్ కాలేజీలను గుర్తించి వాటిని క్లస్టర్ జూనియర్ కాలేజీలుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వీటిల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్, లాంగ్వేజ్ల్యాబ్స్, డిజిటల్ బోర్డ్స్ ఇతర ఆధునిక మౌలిక సదుపాయాల ఏర్పాటుపై చర్చిం చారు. ఇంటర్ విద్యాశాఖ సర్వీస్ అంశాలపై ఇంట ర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ప్రిన్సిపాళ్ల పదోన్నతుల సమస్యలపై చర్చించి పరిష్కారం దిశగా పలు ఆదేశాలు జారీచేశారు. కొత్తగా విశాఖపట్నంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి ఆమోదం తెలిపారు. నాడు–నేడు కింద ఉన్న అన్ని జూనియర్ కళాశాలల్లోని అన్ని తరగతులకు డిజిటిల్ బోర్డుల ఏర్పాటుకు మంత్రి అంగీకరించారు. సమావేశంలో మండలి కార్యదర్శి శేషగిరిబాబు కూడా పాల్గొన్నారు. ఇదీ చదవండి: ‘టీడీపీ కుట్ర బట్టబయలు.. ఫేక్ సర్టిఫికెట్తో దొరికిపోయిన బాబు అండ్ గ్యాంగ్’ -
ఉపాధ్యాయ సంఘాలతో భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే?
సాక్షి, విజయవాడ: ఫేస్ రికగ్నేషన్ యాప్‌పై ప్రభుత్వం ఒక విధానం తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం.. మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాలు భేటీ అయ్యాయి. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాలసీ, స్కూళ్లలో నూతన విధానాలపై వివరణ ఇచ్చారు. చదవండి: మీరు తింటున్న చికెన్ బిర్యానీలో ఏముందో తెలుసా?.. భయంకర వాస్తవాలు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇది త్వరలో అమలవుతుందన్నారు. తొలుత ఉపాధ్యాయులకు అమలు చేయాలని చెప్పామని, సమన్వయ లోపం వల్ల దీని పై కొంత గందరగోళం ఏర్పడిందన్నారు. ఉపాధ్యాయుల సందేహాలకు సమాధానం ఇచ్చామని, నెలాఖరు నాటికి అందరూ అవగాహన పెంచుకోవాలని చెప్పామన్నారు. ఇప్పటికే లక్షా 90 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిమిషం ఆలస్యమైన ఎవరికీ మేము మెమో ఇవ్వలేదు. ఫేస్ రికగ్నేషన్ ప్రభుత్వ నిబంధనల్లో ఎప్పటి నుంచో ఉంది. 3 సార్లు దాటి నాలుగోసారి ఆలస్యంగా వస్తే హాఫ్ డే లీవ్. ఉద్యోగ రీత్యా ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటాం. ఏమైనా లోటుపాట్లు ఉంటే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
Funny Meme: ఫేస్ రికగ్నేషన్‌తో పేమెంట్స్ వస్తే.. ఇలాంటి దారుణాలు జరుగుతాయా?
డిజిటల్ పేమెంట్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. నోట్ల రద్దు తర్వాత ఊహించినదాని కంటే వేగంగా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్‌లో స్కాన్ చేసి పాస్‌కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ చెల్లింపులయితే ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా పకడ్బంధీగా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. అయినా సరే రోజుకు ఏదో మూల ఎవరో ఒకరు డిజిటల్ చెల్లింపుల్లో మోసగాళ్ల బారిన పడుతున్నారు. డిజిటల్ చెల్లింపులు ఇచ్చిన ఊపుతో త్వరలోనే ఫేస్ రికగ్నేషన్ చెల్లింపులు కూడా అమల్లోకి తేవాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఫేస్ రికగ్నేషన్ విధానం అమల్లోకి వస్తే మోసాలు ఎలా జరుగుతాయో చెబుతూ రూపొందించిన మీమ్ వీడియో నవ్వులు పూయిస్తోంది. కొంత మంది ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉందని చెబుతుండగా మరికొందరు టెక్నాలజీ ఎంత సమర్థంగా పని చేస్తుందో వివరిస్తూ వీడియోలతో సహా పోస్ట్ చేస్తున్నారు. On a lighter note, new challenges with payment with face recognition! #contactlesspayments #DigitalPayments #facial_recognition pic.twitter.com/DrNmuuquLU — Sanjay Katkar (@sanjaykatkar) March 22, 2022 -
100 కోట్ల యూజర్లకు షాకిచ్చిన ఫేస్బుక్..ఇకపై..
గత కొంత కాలంగా ఏదో ఓ రూపంలో ఫేస్బుక్ సంస్థ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మంగళవారం ఎఫ్బీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంటి తన బ్లాగులో పోస్ట్ చేశారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్ వాడుతున్న సుమారు వంద కోట్ల మంది యూజర్ల ఫేషియల్ డేటాను కూడా డిలీట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆప్షన్‌పై ప్రభుత్వం కూడా స్పష్టమైన నిబంధనలను రూపొందించలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. ఇటువంటి టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు కంటే ప్రమాదాలే ఎక్కువని సోషల్‌మీడియాలో పెరుగుతున్న ఆందోళనలు, రెగ్యులేటరీ కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్బీ వెల్లడించింది. కాగా ఫేస్బుక్ వాడుతున్న యూజర్లలో మూడవ వంతు మంది ఈ టెక్నాలజీని వాడుతుండగా, ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు డిసెంబర్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. ఓ వైపు సరైన అనుమతి లేకుండా వినియోగదారుల బయోమెట్రిక్ డేటాను సేకరించి, నిల్వ చేసిందనే ఆరోపణలు, మరో వైపు వినియోగదారుల భద్రత, దాని ప్లాట్‌ఫారమ్‌లలో అనేక రకాల దుర్వినియోగాలపై చట్టసభలలో దీనిపై తీవ్రమైన ఆరోపణలు పరిశీలనలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చదవండి: ఇకపై జీ మెయిల్ ఓపెన్ చేయాలంటే ఇవి తప్పనిసరి.. అమల్లోకి కొత్త రూల్స్ -
ఇక్కడి మెట్రోలో కార్డ్, క్యాష్ లేకున్నా ప్రయాణించవచ్చు..!
మెట్రో ట్రెయిన్లో ఎలాంటి కార్డ్, క్యాష్ లేకుండా ప్రయాణించే సరికొత్త టెక్నాలజీను రష్యా ఆవిష్కరించింది. కార్డ్, క్యాష్కు బదులుగా ఫేస్ రీడింగ్ ద్వారా చెల్లింపు జరిగే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ తరహ చెల్లింపుల వ్యవస్థను రష్యా ప్రవేశపెట్టింది. మాస్కోలో సుమారు 240 మెట్రో స్టేషన్లలో ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. వరల్డ్ లార్జెస్ట్ వీడియో సర్వెలెన్స్ సిస్టమ్‌ను మాస్కోను కల్గి ఉంది. కోవిడ్-19 సమయంలో, రాజకీయ ర్యాలీలు, క్వారెంటెన్కు తరలించే సమయంలో ఈ నిఘా వ్యవస్థ అక్కడి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడింది. ఫేస్‌పే ఎలా పనిచేస్తుదంటే...! ఫేస్ పే సిస్టమ్‌ని ఉపయోగించే ముందు ప్రయాణికులు తమ చిత్రాన్ని ముందుగా ఆయా యాప్‌లో సమర్పించాలి. మాస్కో మెట్రో అప్లికేషన్ ద్వారా వారి డెస్టినేషన్ లొకేషన్స్, బ్యాంక్ కార్డులకు లింక్ చేయాలి. మెట్రోని ఉపయోగించడానికి, "ఫేస్ పే" తో నమోదు చేసుకున్న ప్రయాణికులు కేవలం ఒక నిర్దేశిత టర్న్స్టైల్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాను చూసిన వెంటనే పేమెంట్ జరిగిపోయినట్లు వస్తోంది . ఫేస్ పే ద్వారా ప్రయాణికుల డేటా సురక్షితంగా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి: వన్‌ప్లస్ కోఫౌండర్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్...! లాంచ్ ఎప్పుడంటే...! -
పశ్చిమలో ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు
దాదర్: రైల్వేస్టేషన్లలో నేరాలను అరికట్టేందుకు ముఖాన్ని గుర్తించే ఆధునిక (ఫేస్ రికగ్నిషన్ సిస్టం) సీసీటీవీ కెమెరాలు పశ్చిమ రైల్వే ఏర్పాటుచేస్తోంది. ప్రస్తుతం రద్దీగా ఉండే, నేరాలు ఎక్కువగా జరిగే స్టేషన్లలో ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఆ తరువాత దశల వారిగా మిగతా లోకల్ రైల్వే స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయనుంది. ఇప్పటి వరకు మొత్తం 207 ఆధునిక కెమెరాలలో 242 కెమెరాలు రద్దీగా ఉండే వివిధ స్టేషన్లలో ఏర్పాటు చేసినట్లు పశ్చిమ రైల్వే భద్రత దళాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం రైల్వే పోలీసులు వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ప్రయోగం సఫలీకృతమైతే ముంబైతోపాటు ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో ఉన్న మిగతా రైల్వేస్టేషన్లలో కూడా ఏర్పాటు చేయనున్నారు. నేరాలు అరికట్టడానికి.. ముంబై లోకల్ రైల్వే పరిధి 120–135 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. లోకల్ రైళ్లతోపాటు ప్లాట్‌ఫారాలపై, పాదచారుల వంతెనలపై, సబ్ వేలో, ఎస్కలేటర్లపై విపరీతంగా రద్దీ ఉంటుంది. తోపులాటలు లేకుండా ప్లాట్‌ఫారంపై నుంచి బయట పడలేని పరిస్థితి ఉంటుంది. దీన్ని అదనుగా చేసుకుని చిల్లర దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తారు. జేబులోని డబ్బులు, పర్సులు కొట్టేయడం, మహిళ ప్రయాణికుల బ్యాగులు, మెడలోని బంగారు ఆభరణాలు చోరీకి గురైతుంటాయి. కొందరు దొంగలు ప్రయాణికులపై దాడిచేసి దోచుకుంటారు. స్థానిక స్టేషన్లో ఫిర్యాదు నమోదైన తరువాత పోలీసులు దర్యాప్తుచేస్తారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ముంబైలో అదృశ్యమైన సంఘటనలు అనేక ఉన్నాయి. ఇందులో పిల్లలు, వృద్దులు, మహిళలు ఉన్నారు. వీటితోపాటు టికెటు బుకింగ్ కౌంటర్ల వద్ద దళారులను, ఈవ్‌టీజింగ్ చేసే ఆకతాయిల సంఖ్య అధికమైంది టెక్నాలజీ సహకారం.. కేసులు చేధించాలంటే పోలీసులు సీసీటీవీ పుటేజ్‌ల సాయం తప్పనిసరి తీసుకోవల్సి ఉంటుంది. కానీ, ప్లాట్‌ఫారాలపై, స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలపై దుమ్ము, ధూళి పేరుకుపోవడంతో స్పష్టంగా దృశ్యాలు కనిపించవు. అనేక చోట్ల కెమెరాల డైరెక్షన్ తప్పుడు దిశలో ఉంటాయి. దీంతో నేరాలు జరిగినప్పుడు దొంగలను, నేరస్తులను పట్టుకోవాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఫుటేజ్‌ల దృశ్యాలు స్పష్టంగా కనిపించడం లేదు. కేసు పరిష్కరించడంలో రైల్వే పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆ«ధునిక పరిజ్ఞానంతో తయారైన ఫేస్ రికగ్నేషన్ సిస్టం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పశ్చిమ రైల్వే నిర్ణయం తీసుకుంది. వీటివల్ల రాకపోకలు సాగించే సామాన్య ప్రయాణికులతోపాటు నేరస్తుల ముఖాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. దాదర్‌లో అడుగడుగునా కెమెరాలు.. నగరంలో నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా కనిపించే వివిధ వివిధ రైల్వే స్టేషన్లలో దాదర్ ఒకటి. దాదర్ స్టేషన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పశ్చిమ, సెంట్రల్ ఇలా రెండు రైల్వే మార్గాలు కలుస్తాయి. అంతేగాకుండా స్లో లోకల్ రైళ్లతోపాటు ఫాస్ట్ రైళ్లు కూడా నిలుస్తాయి. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే, పోయే ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లు కూడా ఇక్కడ ఆగుతాయి. దీంతో నగరంలోని వివిధ రైల్వేస్టేషన్లతో పోలిస్తే దాదర్ స్టేషన్‌పై ప్రయాణికుల భారం ఎక్కువగా ఉంటుంది. ప్లాట్ఫారం నంబరు ఒకటి ఆనుకుని హోల్‌సేల్ పూల మార్కెట్, కూత వేటు దూరంలో కూరగాయల మార్కెట్ ఉంది. దీంతో దాదర్ స్టేషన్ నుంచి నిత్యం ఐదు లక్షల మంది ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్య ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. దీన్ని బట్టి ఈ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థమవుతోంది. ప్రయాణికుల సంఖ్యతోపాటు నేరాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. దీంతో ఈ స్టేషన్ ఆవరణలో, ప్లాట్‌పారాలపై, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై, ఎస్కలేటర్ల వద్ద ఫేస్ రికగ్నిషన్ సిస్టం సీసీటీవీ కెమెరాలు అడుగడుగున ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. -
ఐఫోన్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్‌లో బయటపడ్డ లోపం!
సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అప్పుడప్పుడు భద్రత విషయంలో విషయంలో కొన్ని చిక్కులు ఎదురైన వాటిని వెంటనే గుర్తించి పరిష్కరిస్తుంది. కాగా ప్రస్తుతం ఐఫోన్ ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్‌కు సంబంధించి ఒక లోపం బయటపడింది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్ తన ఐఫోన్ 12 మినీ ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్‌లో కనుగొన్న ప్రధాన లోపాన్నిగుర్తించి వీడియోను పోస్ట్ చేశాడు. వినమ్రే సూద్ అనే నెటిజన్ తన సోదరుడితో కలిసి ఉన్న వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో ఐఫోన్‌ను సూద్ తన ఫేస్ ఐడిని ఉపయోగించి అన్‌లాక్ చేసి తన సోదరుడు ఉపన్షుకు ఇచ్చాడు. ఉపన్షు ఫేస్ ఐడితో వినమ్రే ఫోన్‌ను అన్‌లాక్ చేయగలిగాడు. ఇరువురు సోదరులు కవలలు కాకపోయినప్పటికీ ఐఫోన్ వీరి ఇరువురి ఫేస్ ఐడీలను ఒకే విధంగా గుర్తించి మొబైల్ ఫోన్‌ను అన్‌లాక్ చేసింది. కాగా ఐఫోన్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ వారి విషయంలో పూర్తిగా విఫలమైంది. విన్రమే సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ.. ఆపిల్ ఫేస్ఐడి గుర్తించడంలో పూర్తిగా విఫలమైంది. మొబైల్ పరిశ్రమలో పేరున్న ఒక సంస్థ తమ మార్కెటింగ్ ప్రచారంలో వినియోగదారుల భద్రతకు రాజీ లేకుండా ఉంటుందని చెప్పకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నాడు. మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చే భద్రతను కూడా ఆపిల్ ఐఫోన్ ఇవ్వలేకపోతుందని తెలిపాడు. కాగా 2017లో సీఎన్ఎన్ చేసిన ఒక పరీక్షలో ఐఫోన్ ఫేస్ అన్‌లాక్ సిస్టమ్ పూర్తిగా విఫలమైంది. వాస్తవానికి ఐఫోన్ ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ ఇతర స్మార్ట్ఫోన్లలో ఉపయోగించే ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ కంటే చాలా మెరగైంది. ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడంలో పదిలక్షల మందిలో ఒకరిని గుర్తించే సంభావ్యతను కలిగి ఉంటుందని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: నగ్న ఫొటోలు, వీడియో: ఆపిల్ కంపెనీకి కోట్ల జరిమానా -
150 పోలింగ్ స్టేషన్లలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి వార్డ్‌లోని ఒక పోలింగ్ స్టేషన్లో పైలట్ ప్రతిపాదికన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని సుమారు 150 పోలింగ్ స్టేషన్లలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషనర్ సి.పార్థసారథి వెల్లడించారు. పోలింగ్ బూత్‌లకు వెళ్లలేని వయోవృద్ధులు, దివ్యాంగులు, పోలింగ్ సిబ్బంది తదితరుల కోసం ఈ –ఓటింగ్ విధానాన్ని కూడా పైలట్ ప్రాతిపదికన ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కమిషన్ కార్యాలయంలో మంగళవారం సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు టీ–పోల్ సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధునాతన సాంకేతిక వినియోగంతో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఆధునిక సాంకేతికతతో ఓటరు స్లిప్‌లను ,పోలింగ్ స్టేషన్లను, నియోజకవర్గం వారీగా పోలింగ్ స్టేషన్ వివరాలను ఆన్లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చన్నారు. టీ–పోల్ సాఫ్ట్వేర్ ద్వారా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్టీ అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చునని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ, పోలింగ్ పర్సనల్ ర్యాండమైజేషన్, ఎన్నికల వ్యయం వివరాల మాడ్యూల్ తదితర అంశాలపై అధికారులకు శిక్షణనిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకు జోన్లవారీగా టీ– పోల్,ఎస్ఈసీ మాడ్యూల్స్, సంబంధిత యాప్స్‌పై జరిగిన శిక్షణలో జీహెచ్ఎంసీ అధికారులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. -
ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఆర్జీఐఏ)లో డొమెస్టిక్ ప్రయాణికుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేషియల్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్) ట్రయల్ రన్ విజయవంతమైంది. ఒకసారి ముఖకవళికలు నమోదు చేసుకున్న ప్రయాణికులు.. ఆ తర్వాత ఎలాంటి తనిఖీలు లేకుండా తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించేందుకు వీలుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. జూలైలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ట్రయల్ రన్లో భాగంగా 3,000 మంది ముఖకవళికలను నమోదు చేయాలని అధికారులు భావించారు. కానీ ఈ సంఖ్య 4,198కి చేరుకుంది. అనుకున్న దానికన్నా 40శాతం మంది ప్రయాణికులు అధికంగా తమ ముఖకవళికలను నమోదు చేసుకున్నట్లు జీఎమ్మార్ అధికారులు తెలిపారు. సినీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రాంచరణ్, అఖిల్, సమంత తదితరులు ఎఫ్ఆర్లో తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సైతం తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఇలా నమోదు చేకున్న వారంతా ఈ నెల 17 నాటికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు 6వేల సార్లు ప్రయాణం చేశారు. వీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ–గేట్ల ద్వారా ఎలాంటి తనిఖీలు లేకుండా వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ‘డిజియాత్ర’కు మార్గం సుగమం... సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందజేసేందుకు కేంద్రం ‘డిజియాత్ర’ చేపట్టిన విషయం విదితమే. ఒకసారి తమ పూర్తి వివరాలను, ముఖకవళికలను విమానాశ్రయ భద్రతా సిబ్బంది వద్ద నమోదు చేసుకున్నవారు పదే పదే ఆ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఆర్జీఐఏలో జూలైలో ప్రారంభించి, ప్రయాణికులు వివరాలు నమోదు చేయిచుకునేందుకు ఎయిర్‌పోర్టులోని 1, 3 డొమెస్టిక్ డిపార్చర్ గేట్ల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎఫ్ఆర్లో భాగంగా ప్రయాణికుల గుర్తింపుకార్డు, కాంటాక్ట్ వివరాలను నమోదు చేశారు. ఆ తర్వాత ప్రయాణికుల ముఖాలను ఫొటో తీశారు. సీఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు ప్రయాణికుల నుంచి సేకరించిన వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఒక యూనిక్ డిజియాత్ర ఐడీని కేటాయించారు. ఈ ఐడీలపై ఇప్పటి వరకు ప్రయాణికులు 6వేల సార్లు ప్రయాణం చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్రం అనుమతిస్తే అందరికీ... ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు వివరాలను కేంద్ర విమానయాన శాఖ పరిశీలనకు పంపించారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో కేంద్రం అనుమతిస్తే ప్రయాణికులందరికీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధంగా ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతిరోజు సుమారు 55వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల మధ్య రెగ్యులర్‌గా రాకపోకలు సాగించేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఒక్కసారి ఫేషియల్ రికగ్నీషన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుంటే... ఆ తర్వాత ప్రయాణంలో ఎలాంటి తనిఖీలు లేకుండా హాయిగా సాగిపోవచ్చు. కేవలం హ్యాండ్‌బ్యాగ్ ద్వారా వెళ్లేవాళ్లకు ఇదిఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈసదుపాయం ప్రయాణికులందరికీఅందుబాటులోకి రావాలంటే కేంద్రంగ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. -
మెగాస్టారైనా.. ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫేస్ రికగ్నిషన్ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజియాత్రలో భాగంగా విమానాశ్రయంలో డొమెస్టిక్ ప్రయాణికుల కోసం ఫేస్ రికగ్నిషన్ ట్రయల్స్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల ఒకటిన ప్రారంభమైన ట్రయల్స్ 31 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు 1,300 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే రాజకీయ నేతలు, సినీ నటులు, వివిధ రంగాల ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు ముఖ కవళికల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. సినీ నటులు అక్కినేని నాగార్జున, చిరంజీవి, రాంచరణ్, అఖిల్ తదితరులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అలాగే ఈ జాబితాలో పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫేస్ రికగ్నిషన్ ఇలా.. ప్రయాణికులు ప్రభుత్వం ధ్రువీకరించిన డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ వంటి గుర్తింపు కార్డు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీతోపాటు పూర్తి వివరాలను ఫేస్ రికగ్నిషన్ కౌంటర్ల వద్ద సమర్పించాలి. వివరాలను పరిశీలించిన అనంతరం వారి ముఖాన్ని ఫొటో తీస్తారు. ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రభుత్వ ఐడీ కార్డును తనిఖీ చేస్తారు. అనంతరం ఫేస్ రికగ్నిషన్ కోసం నమోదు చేసుకున్న ప్రయాణికుల పేరిట ఒక యూనిక్ డిజియాత్ర ఐడీ జనరేట్ అవుతుంది. ఫేస్ రికగ్నిషన్ అనేది ఒకేసారి జరిగే ప్రక్రియ. ఒకసారి ఈ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యాక ట్రయల్ పీరియడ్‌లో ప్రయాణికులు తమ డిజియాత్ర ఐడీని వినియోగించుకొని నేరుగా రాకపోకలు సాగించవచ్చు. ఫేస్ రికగ్నిషన్‌కు చెందిన గేట్ వద్దకు వెళ్లడానికి ముందు ప్రయాణికులు మొదట ఎయిర్ పోర్టులోని చెకిన్ కియోస్క్‌ల ద్వారా సెల్ఫ్ సర్వీస్ చెకిన్ లేదా వెబ్ చెకిన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సాఫీ ప్రయాణం.. ఫేస్ రికగ్నిషన్ వివరాలు నమోదు చేయించుకున్న ప్రయాణికుల కోసం డిపార్చర్ గేట్ నం.3 వద్ద ప్రత్యేకమైన ఈ–గేట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రయాణికుల బోర్డింగ్ కార్డును స్కాన్ చేసిన అనంతరం వారు కెమెరాకు ఎదురుగా నిలబడతారు. గతంలో రిజిస్టర్ చేసుకున్న దానితో సరిపోల్చుకున్న అనంతరం ఈ–గేట్ తెరుచుకుంటుంది. దీంతో ప్రయాణికులు నేరుగా టెర్మినల్‌లోకి ప్రవేశించవచ్చు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉన్నందున సీఐఎస్ఎఫ్ సిబ్బంది డిపార్చర్ గేటు వద్ద ప్రయాణ పత్రాలను, ఐడీని పరిశీలిస్తారు. అనంతరం సెక్యూరిటీ చెక్ నిమిత్తం ఒక డెడికేటెడ్ ఫేస్ రికగ్నిషన్ చానల్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీనిని గేట్ నం.3 వద్ద ఉన్న ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడి కెమెరా ప్రయాణికుల వివరాలను పరిశీలించిన అనంతరం సీఐఎస్ఎఫ్ సిబ్బంది మరోసారి తనిఖీలు నిర్వహిస్తారు. వారి అనుమతి అనంతరం ప్రయాణికులు బోర్డింగ్‌కు వెళ్లవచ్చు. ప్రత్యేక కౌంటర్లు.. ఫేస్ రికగ్నిషన్ వివరాలు నమోదు చేసుకునేందుకు 1, 3 డొమెస్టిక్ డిపార్చర్ గేట్ల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పద్ధతిలో ఒక్కసారి నమోదు చేసుకున్న ప్రయాణికులు ఆ తర్వాత పెద్దగా తనిఖీలు లేకుండానే తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించవచ్చు. దీంతో ఈ ప్రక్రియకు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, ఎంతోమంది తమంతట తాముగా వచ్చి వివరాలు, ముఖకవళికలను నమోదు చేసుకుంటున్నారని అధికారులు చెప్పారు. దశల వారీగా విస్తరణ.. ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సదుపాయాన్ని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడలకే పరిమితం చేశారు. దశలవారీగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించనున్నారు. ప్రస్తుతం హ్యాండ్ బ్యాగుతో వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. -
ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. సత్వరమే భద్రతా తనిఖీలను పూర్తిచేసే ముఖకవళికల(ఫేస్ రికగ్నైజేషన్) నమోదు ప్రక్రియను గతేడాది ఎయిర్‌పోర్టు అధికారులు ప్రారంభించారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బంది, రెండోదశలో భాగస్వామ్య సంస్థలను ఈ తనిఖీల పరిధిలోకి తెచ్చారు. మొత్తం ఎయిర్‌పోర్టు కమ్యూనిటీ ఫేస్ రికగ్నైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. డిజి యాత్ర ప్రాజెక్టులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేస్ రికగ్నైజేషన్ను దశలవారీగా జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. రోజూ సుమారు 55,000 మంది ప్రయాణికులు, 400 జాతీయ, అంతర్జాతీయ విమానాలు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల భద్రతలో భాగంగా ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన అధికారులు తాజాగా ముఖకవళికల నమోదుకు శ్రీకారంచుట్టారు. బ్యాగేజ్ తనిఖీల్లోనూ మరింత పటిష్టమైన ఆటోమేటిక్ ట్రేరిట్రైవల్ సిస్టమ్(ఏటీఆర్ఎస్) చేపట్టింది. ప్రస్తుతం డొమెస్టిక్ ప్రయాణికుల బ్యాగేజ్‌కి మాత్రమే ఈ ఏటీఆర్‌ఎస్‌ను పరిమితం చేశారు. ముఖ కవళికల నమోదు ఇలా.... ఎయిర్‌పోర్టు టర్మినల్ ప్రవేశమార్గంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కియోస్క్‌ల ద్వారా ప్రయాణికులకు వన్‌టైమ్ ఫేస్ రికగ్నైజేషన్ సదుపాయాన్ని కల్పిస్తారు. ఇందుకోసం ప్రయాణికులు ఫేస్ ఐడీతోపాటు, గుర్తింపు ధ్రువీకరణ, ఫొటోలను కియోస్క్‌ల వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం ఈ–బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేస్తారు. దీంతో ఎయిర్‌లైన్ డిపార్చర్ కంట్రోల్ సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా తనిఖీ పూర్తవుతుంది. తర్వాత ప్రయాణికుల ఫేస్ రికగ్నైజేషన్‌తో టికెట్ అందజేస్తారు. ఒకసారి ఫేస్ రికగ్నైజేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు ఆ తరువాత పదే పదే నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా భద్రతా తనిఖీలను పూర్తిచేసుకొని వెళ్లిపోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో ఈ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో మరి కొద్దిరోజుల్లో డొమెస్టిక్ ప్రయాణికులకు దీనిని విస్తరించనున్నారు. తరువాత అంతర్జాతీయ ప్రయాణికులను ఈ ప్రక్రియలోకి తెచ్చే అవకాశం ఉంది. ఒక సారి ఫేస్ నమోదు పూర్తయిన తరువాత ఇతర ప్రవేశమార్గాల్లో, భద్రతా అధికారుల తనిఖీల్లో మరోసారి నమోదు చేసుకోవలసిన అవసరం ఉండదు. ఏటీఆర్ఎస్ బ్యాగేజ్.. ఎక్స్‌రే–బ్యాగేజ్ తనిఖీల్లో అత్యాధునిక ఆటోమేటిక్ ట్రే రిట్రైవల్ సిస్టమ్(ఏటీఆర్ఎస్)ను ప్రవేశపెట్టారు. ఇది సమగ్రమైన భద్రతా ప్రక్రియ. అన్ని డొమెస్టిక్ సెక్యూరిటీ మార్గాల్లో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో ప్రత్యేకంగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా బ్యాగుల తనిఖీ పూర్తవుతుంది. చెక్–పాయింట్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. వేగంగా, పటిష్టంగా బ్యాగ్ స్క్రీనింగ్ పూర్తవుతుంది. ఆటోమేటిక్ ట్రేలలో బ్యాగులు వేసిన తరువాత ఆటోమేటిక్ రోల్లో ఎక్స్‌రే–మెషీన్ల వైపు బ్యాగులు వెళ్తాయి. ఈ ట్రేలను కేబిన్ సైజ్ బ్యాగులు తనిఖీ చేసేలా ఏర్పాటు చేశారు. ప్రతి ట్రేకు ప్రారంభం నుంచి చివరి వరకు ఆర్ఎఫ్ఐడీ ట్రాకింగ్ ఉంటుంది. అనుమానాస్పద వస్తువులు ఉన్న బ్యాగులను తొలగించేందుకు ప్రత్యేక లైన్లు ఉంటాయి. అనంతరం అలాంటి బ్యాగులను అధికారులు స్వయంగా తనిఖీ చేసి నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఇంటీరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్(ఐఐడీటీ)లో సమీకృత ఏటీఆర్ఎస్ వ్యవస్థతో పాటు 2 ఎక్స్–రే మెషీన్లు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. -
తెలంగాణ పోలీస్ యాప్‌తో ఇంటికి చేరిన అస్సాం బాలిక
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నర కిందట తప్పిపోయిన అస్సాం బాలికను తెలంగాణ పోలీస్ రూపొందించిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఇంటికి చేర్చింది. అస్సాంలోని లక్మీపూర్ బోగినోడి గ్రామానికి చెందిన అంజలి టిగ్గా(16) 2017, ఆగస్టులో ఇంటి నుంచి తప్పిపోయి ఢిల్లీకి చేరి అక్కడ నెల రోజుల పాటు కార్మికురాలిగా పనిచేసింది. పనిచేస్తున్న చోట ఇతర కార్మికులందరూ కలిసి మళ్లీ తనను అస్సోం పంపించారు. అస్సాం రైల్వే స్టేషన్‌కు చేరిన అంజలి ఇంటికి వెళ్లేందుకు భయపడి సోనిత్‌పూర్‌లో ఏదైనా పనిచేసుకుని జీవించాలని నిర్ణయించుకుంది. అయితే, రైల్వే స్టేషన్లో అంజలిని గుర్తించిన రైల్వే పోలీసులు ఆమెను చైల్డ్, ఉమెన్ కేర్ (సీడబ్ల్యూసీ) సంస్థ ప్రతినిధులకు అప్పగించారు. తెలంగాణ పోలీసులు తయారుచేసిన ఫేస్ రికగ్నైజ్ యాప్‌లోని డేటా బేస్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రా ల్లో అదృశ్యమైన వారి ఫొటోలు, వివరాలు అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రుల వివరాలు చెప్పేందుకు అంజలి నిరాకరించగా అక్కడి సంస్థ ప్రతినిధులు ఆమె ఫొటోలను తెలంగాణ పోలీస్ రూపొందించిన ఫేస్ రికగ్నైజేషన్ డేటా బేస్‌లో సరిపోల్చి చూశారు. దీంతో అంజలి అడ్రస్ అందుబాటులో ఉండగా ఆమెను ఆదివారం అస్సాంలోని బోగినోడిలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించినట్లు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా ఒక ప్రకటనలో వెల్లడించారు. -
హాజరు పడాలంటే చెట్టెక్కాల్సిందే!
రాంచీ: క్లాస్‌లో కూర్చొని.. రోల్ నంబర్ వన్.. రోల్ నంబర్ టూ.. అంటూ విద్యార్థుల అటెండెన్స్ తీసుకునే టీచర్లు తమ హాజరు నమోదు కోసం మాత్రం చెట్లెక్కుతున్నారు. హాజరు కోసం చెట్లెక్కడమేంటి.. అనే కదా? టీచర్లు సరిగ్గా పాఠశాలకు వస్తున్నారో? లేక రిజిస్టర్లో దొంగ సంతకాలు పెట్టి సొంతపనులు చక్కబెట్టుకుంటున్నారో? గుర్తించేందుకు జార్ఖండ్ ప్రభుత్వం ఇటీవలే కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ప్రతి స్కూల్లో ఓ ట్యాబ్లెట్ ఫోన్ ఉంటుంది. స్కూల్‌కు రాగానే దానిలో ఫేస్ రికగ్నేషన్ ఫీచర్‌తో హాజరును నమోదు చేయాలి. ఆ వెంటనే సదరు టీచర్ ఆ రోజు స్కూల్‌కు వచ్చినట్లు అది విద్యాశాఖ కార్యాలయానికి హాజరు నమోదును పంపుతుంది. టెక్నాలజీ బాగానే ఉన్నా.. అసలు సమస్య సిగ్నల్స్‌తో వచ్చింది. ఆ రాష్ట్రంలోని పాలము జిల్లా, సోహ్రీఖాస్ గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్ అందాలంటే చెట్లెక్కాల్సిందే. దీంతో తమ హాజరు నమోదు చేయడానికి టీచర్లకు చెట్లెక్కక తప్పడంలేదు. టీచర్లు యువకులైతే సరే.. మరి వయసు పైబడినవారి సంగతేంటి? స్కూల్‌కు వచ్చినా.. గైర్హాజరైనట్లేనా? ఈ ప్రశ్నకు విద్యాశాఖ అధికారుల నుంచి మాత్రం సమాధానం రావడంలేదట. -
ముఖమే బోర్డింగ్ పాస్!
త్వరలోనే బెంగళూరు విమానాశ్రయాల్లో మీ ముఖమే బోర్డింగ్ పాస్‌గా మారనుంది. దేశ చరిత్రలో తొలిసారిగా 2019 ప్రథమార్ధంలో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఈ ‘ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ’ని ప్రారంభించనున్నారు. ముందుగా జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఆసియా, స్పైస్‌జెట్ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వాడుకోనున్నారు. కాగితరహిత విమానప్రయాణ విధానాన్ని ( ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫర్ పేపర్‌లెస్ ఎయిర్ ట్రావెల్లో భాగంగా) అమలుచేస్తున్న మొదటి ఎయిర్‌పోర్ట్‌గా బెంగళూరు నిలవనుంది. ఈ సాంకేతికత అమలు ఒప్పందంపై పోర్చుగల్‌లోని లిస్బన్లో బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్)–విజన్‌బాక్స్ సంస్థలు సంతకాలు చేశాయి. ‘ఎయిర్‌పోర్ట్‌లో క్యూలైన్లో వేచి ఉండే అవసరం లేకుండా, బోర్డింగ్ కోసం రిజర్వేషన్, ఇతర ఇబ్బందులు లేకుండా ఇది సాయపడుతుంది’ అని బీఐఏఎల్ ఎండీ, సీఈఓ హరి మరార్ వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్టుల్లో రిజిస్ట్రేషన్ మొదలుకుని బోర్డింగ్ వరకు పేపర్‌రహిత విధానం అమలే లక్ష్యంగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నట్టు విజన్‌బాక్స్ సంస్థ వెల్లడించింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ముఖాలను బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా గుర్తించి వారు విమానం ఎక్కేందుకు అనుమతించనున్నట్టు తెలియజేసింది. ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే ఇకపై ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్‌పాస్, పాస్‌పోర్టు, వ్యక్తిగత గుర్తింపు కార్డులను పదేపదే చూపాల్సిన అవసరం ఉండదు. -
‘సేఫ్’ టెక్నాలజీ
ఆధునిక జీవనంలో కీలకంగా మారిన సాంకేతికత.. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తోంది.. క్షణాల్లో నేరగాళ్లను గుర్తించి వారి ఆటకట్టించడానికి దోహదపడుతుంది.. సూరత్‌లో దూసుకుపోతున్న ‘ఈ’ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ పలు నగరాలను ఆకర్షిస్తోంది. * రోల్ మోడల్‌గా సూరత్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ * దేశంలోనే తొలి సేఫ్ సిటీ ప్రాజెక్టుగా ప్రారంభం * పీపుల్స్-పబ్లిక్-ప్రైవేట్- పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మాణం సూరత్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దాలని ఆరు నెలల క్రితం సేఫ్ సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గుజరాత్ ఆర్థిక రాజధాని సూరత్‌లో ఈ ఆలోచన నాలుగేళ్ల క్రితమే, దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాలకంటే ముందుగానే వచ్చింది. అక్కడి పోలీసు కమిషనర్ రాకేష్ ఆస్తానా చొరవతో ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకుసాగుతోంది. దేశంలోనే తొలి, ప్రతిష్టాత్మకమైన ‘సురక్షా సేథు’గా పిలిచే ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఆలోచన ఇలా.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2011 జూలై 13న మూడు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో ఒకటి వజ్రాల వ్యాపార కేంద్రమైన జువేరీ బజార్‌ను టార్గెట్‌గా చేసుకుని జరిగింది. ఈ ఘటన జరిగిన కొన్ని నెలలకే గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాకేష్ ఆస్తానా సూరత్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వజ్రాల వ్యాపార కేంద్రమైన సూరత్ సైతం మరోసారి ఉగ్రవాదుల టార్గెట్‌గా మారే ప్రమాదం ఉందని ఆయన భావించారు. అలాగే ట్రాఫిక్ సిబ్బంది కొరతతో ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించారు. అలా మొదలైందే ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’. ట్రస్ట్ ఏర్పాటుతో.. ప్రాజెక్టులో భాగంగా నగర వ్యాప్తంగా కెమెరాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) రూపకల్పనకు నిర్ణయించారు. నిధుల కోసం 2012 సెప్టెంబర్‌లో సూరత్‌లోని వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి పథకాన్ని వివరించారు. దీంతో అక్కడికక్కడే రూ.ఐదు కోట్ల విరాళాలు అందాయి. ప్రాజెక్టు పనుల కోసం రాకేష్ ఆస్తానా సాంకేతిక నిపుణులు, వ్యాపారులతో ‘ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ ఏర్పాటు చేశారు. మూడు నెలల్లో మొదటి దశ.. ఈ ట్రస్ట్ ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ ప్రాజెక్టు సాంకేతిక అంశాలను ఖరారు చేసింది. సూరత్‌కు చెందిన ‘ఇన్నోవేటివ్ టెలికం అండ్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ వాస్తవ ధరలకే ప్రాజెక్టు చేపట్టడానికి ముందుకు వచ్చింది. ఫలితంగా కేవలం రూ.16.5 కోట్లతో తొలిదశ ప్రాజెక్టు మూడు నెలల్లోనే పూర్తయింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ గత ఏడాది జనవరి 18న దీన్ని ఆవిష్కరించారు. ఇప్పటి వరకు పూర్తి చేసుకున్న రెండు దశల్లో సూరత్‌లోని 97 ప్రాంతాల్లో 604 కెమెరాలు ఏర్పాటయ్యాయి. వీటిలో 24 పీటీజెడ్ పరిజ్ఞానంతో కూడినవి. ఈ కెమెరాల ద్వారా కనిపించే దృశ్యాలను చూడటానికి సీసీసీలో 280 చదరపు అడుగుల డిజిటల్ వీడియో వాల్ ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు కేవలం రూ.35 కోట్లు. మరో మూడేళ్లలో సూరత్ వ్యాప్తంగా 5 వేల కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా ‘సూరత్ సేఫ్ సిటీ ప్రాజెక్టు’ ముందుకు వెళ్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్స్-పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీపీ) మోడల్‌గా అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. స్ఫూర్తిదాయకంగా ట్రాఫిక్ బ్రిగేడ్ వ్యవస్థ... దాదాపు 50 లక్షల జనాభా, 30 లక్షల వాహనాలు ఉన్న సూరత్‌లో ట్రాఫిక్ పోలీసుల సంఖ్య కేవలం 300 మాత్రమే. ఈ సమస్యను అధిగమించడానికి అక్కడ ట్రాఫిక్ బ్రిగేడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది కనీస విద్యార్హత కలిగిన వారిని ఎంపిక చేసుకుని ప్రాథమిక శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ నియంత్రణకు వినియోగిస్తున్నారు. వీరికి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు వచ్చిన విరాళాల నుంచే జీతభత్యాలు చెల్లిస్తున్నారు. సీసీసీ అందుబాటులోకి వచ్చిన తరవాత 80 శాతం హిట్ అండ్ రన్ కేసుల్లో నిందితులు పోలీసులకు చిక్కుతున్నారు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి డేటాబేస్ రూపొందిస్తున్న సీసీసీ త్వరలో వారి లెసైన్సులు రద్దు చేసే దిశగా చర్యలకు సిద్ధమవుతోంది. నైట్ విజన్, జూమ్ కెమెరాలు.. సూరత్ రహదారులపై ప్రతి కిలోమీటరుకు ఓ కెమెరా నిఘా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కెమెరా గరిష్టంగా 760 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి ముఖాన్ని పగలు, రాత్రి సైతం స్పష్టంగా చూపిస్తుంది. 500 మీటర్ల దూరంలో ఉన్న వాహనం నెంబర్ ప్లేట్‌ను జూమ్ చేసి చూపిస్తుంది. వీటి ద్వారా సూరత్ పోలీసులు గత ఏడాది నేరాలను 23 శాతం తగ్గించగలిగారు. దీనికి అనుసంధానంగా ‘డయల్-100’, మహిళా హెల్ప్‌లైన్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ తదితరాలను సీసీసీలో ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని ఇక్కడ నుంచే గుర్తించి, వారి చిరునామాకు ఈ-చలాన్‌ను పంపుతారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూలై వరకు 2,67,446 చలాన్లు జారీ చేసి రూ.2,54,86,600 వసూలు చేశారు. మరో ఆరు నెలల్లో.. సూరత్ సీసీసీని ఆధునీకరిస్తున్న అక్కడి అధికారులు మరో ఆరు నెలల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి వివరాలు.. ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం.. సీసీసీలోని సర్వర్‌లో పాత నేరగాళ్లు, వాంటెడ్, మిస్సింగ్ వ్యక్తుల ఫొటోలను నిక్షిప్తం చేయనున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమైన నగరంలోని ఏ కెమెరా ముందుకైనా వారు వస్తే, వెంటనే కంప్యూటర్ గుర్తించి ఆ వివరాలను సీసీసీలోని సిబ్బందికి తెలియజేస్తుంది. సస్పీషియస్ అలార్మింగ్.. సీసీసీలోని ప్రత్యేక ప్రోగ్రాంతో ఎవరైనా అనుమానిత వ్యక్తి, వస్తువు, వాహనం ఓ ప్రదేశంలో నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు కదలకుండా ఉంటే దాన్ని కెమెరా ద్వారా కంప్యూటర్ గుర్తించి సమాచారాన్ని ప్రత్యేక అలారమ్ ద్వారా సిబ్బందికి చేరవేస్తుంది. ఏఎన్పీఆర్ వ్యవస్థ.. ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ సిస్టం (ఏఎన్పీఆర్) ఇది. చోరీ వాహనాలు, హిట్ అండ్ రన్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న వాటితో పాటు భారీగా ఈ-చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలను సర్వర్‌లో నిక్షిప్తం చేసి కంప్యూటర్ ద్వారా కెమెరాలను అనుసంధానిస్తున్నారు. దీంతో ఆయా వాహనాలు నగరంలో ఎక్కడ తిరిగినా కెమెరాలు గుర్తించి సీసీసీలో ఉన్న వారిని అప్రమత్తం చేస్తాయి. సిట్యుయేషన్ మేనేజ్మెంట్ సూరత్ నగర వ్యాప్తంగా ఎక్కడైనా బాంబు పేలినా, తుపాకీ కాల్పులు జరిగినా, అగ్నిప్రమాదం సంభవించినా ఈ సిస్టంతో అనుసంధానమైన కెమెరాలు గుర్తించి సీసీసీలో ఉన్న కంప్యూటర్లో ప్రత్యేక పాప్అప్ ద్వారా సిబ్బందికి సమాచారం ఇస్తాయి. ఘటన జరిగిన ప్రదేశంతో పాటు దానికి సమీపంలో ఉన్న పోలీసు గస్తీ వాహనాల వివరాలనూ తెలియజేస్తాయి.