డిజిటల్ పేమెంట్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. నోట్ల రద్దు తర్వాత ఊహించినదాని కంటే వేగంగా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్‌లో స్కాన్ చేసి పాస్‌కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ చెల్లింపులయితే ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా పకడ్బంధీగా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. అయినా సరే రోజుకు ఏదో మూల ఎవరో ఒకరు డిజిటల్ చెల్లింపుల్లో మోసగాళ్ల బారిన పడుతున్నారు.
డిజిటల్ చెల్లింపులు ఇచ్చిన ఊపుతో త్వరలోనే ఫేస్ రికగ్నేషన్ చెల్లింపులు కూడా అమల్లోకి తేవాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఫేస్ రికగ్నేషన్ విధానం అమల్లోకి వస్తే మోసాలు ఎలా జరుగుతాయో చెబుతూ రూపొందించిన మీమ్ వీడియో నవ్వులు పూయిస్తోంది. కొంత మంది ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉందని చెబుతుండగా మరికొందరు టెక్నాలజీ ఎంత సమర్థంగా పని చేస్తుందో వివరిస్తూ వీడియోలతో సహా పోస్ట్ చేస్తున్నారు.
On a lighter note, new challenges with payment with face recognition! #contactlesspayments #DigitalPayments #facial_recognition pic.twitter.com/DrNmuuquLU
— Sanjay Katkar (@sanjaykatkar) March 22, 2022
Comments
Please login to add a commentAdd a comment