చెల్లింపు సేవా సంస్థ పేటీఎం తన వినియోగదారులకు తీపి కబురు అందించింది. ముఖ్యంగా తన ప్లాట్‌ఫాంలో చిన్న వ్యాపారుల డిజిటల్ చెల్లింపుల కోసం సౌండ్ బాక్స్ ను లాంచ్ చేసింది. డిఫాల్ట్ గా వచ్చే'ట్యాప్ అండ్ పే' ఫీచర్‌తో ఐకానిక్ సౌండ్‌బాక్స్ ద్వారా అన్ని వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, రూపే నెట్‌వర్క్‌లలో మొబైల్, కార్డ్ చెల్లింపులను చేయవచ్చు. ఈ తరహా సౌకర్యాన్ని అందించే తొలి సంస్థ తామేనని పేటీఎం ప్రకటించింది.
999 రూపాయల (12.08డాలర్లు) 'కార్డ్ సౌండ్‌బాక్స్' ను లాంచ్ చేసింది. దీని ద్వారా వ్యాపారులు రూ.5,000 వరకు కార్డ్ చెల్లింపులను ఆమోదించగలరు. మేడ్ ఇన్ ఇండియా డివైస్ 4G నెట్‌వర్క్ కనెక్టివిటీతో వేగవంతమైన పేమెంట్స్ అలర్ట్స్ అందిస్తుంది. తమ సౌండ్‌బాక్స్ లేదా మొబైల్ చెల్లింపులతో కాంటాక్ట్‌లెస్ డెబిట్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కలపడం ద్వారా వ్యాపారులకు చెల్లింపుల సౌలభ్యాన్ని విస్తరించడం ద్వారా డిజిటల్ చెల్లింపులకు మరింత ఊతం లభిస్తుందని తెలిపింది.
పేటీఎం క్యూఆర్ కోడ్‌తో మొబైల్ చెల్లింపుల మాదిరిగానే వ్యాపారులు, వినియోగదారులకు కార్డ్ ఆమోదం అవసరమని, పేటీఎం సరికొత్త సౌండ్‌బాక్స్ ద్వారా కస్టమర్‌కు LCD డిస్‌ప్లే ద్వారా ఆడియో, దృశ్య చెల్లింపు నిర్ధారణ రెండింటినీ అందిస్తుంది. విభిన్న వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ డివైస్ 11 భాషల్లో హెచ్చరికలను అందిస్తుందని, వీటిని వ్యాపారి Paytm ఫర్ బిజినెస్ యాప్ ద్వారా మార్చుకోవచ్చని పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. చెల్లింపు సేవలు, ఆర్థిక సేవల సమస్యల్ని పరిష్కరించడంలో Paytm కార్డ్ సౌండ్‌బాక్స్ మరో ముందడుగు అని చెప్పారు. ట్యాప్ ఫీచర్‌ని ఉపయోగించి వారి ఫోన్‌ల ద్వారా కూడా చెల్లింపులు చేసుకో వచ్చన్నారు.
India’s first Soundbox with Card Payments is here! 🚀
— Paytm (@Paytm) September 4, 2023
With contactless payments and long lasting 5 day battery, we are proud to be back with yet another pioneering device to drive in-store payments!#Paytm #PaytmKaro #PaytmSeUPI pic.twitter.com/taP5JmXCd2
Paytm కార్డ్ సౌండ్‌బాక్స్ చిన్న వ్యాపారులు కాంటాక్ట్‌లెస్ కార్డ్ చెల్లింపులను సులభంగా ఆమోదించడం ద్వారా వారి కస్టమర్‌లకు అంతరాయం లేని డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని అందించడానికి వీలు కల్పించే మరో ఆవిష్కరణ అన్నారు మాస్టర్‌కార్డ్, దక్షిణాసియా డివిజన్ ప్రెసిడెంట్ గౌతమ్ అగర్వాల్. ప్రతి లావాదేవీని ప్రత్యేకంగా ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా చెల్లింపులు నష్టం లేదా నకిలీ , డబుల్ బిల్లింగ్ లాంటివి తగ్గుతాయన్నారు. Paytm కార్డ్ సౌండ్‌బాక్స్ తరహాలోనే ఇప్పటికే పైన్ ల్యాబ్స్ PhonePe వంటి కంపెనీలు సౌండ్‌బాక్స్ లాంటివాటిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment