మెట్రో ట్రెయిన్‌లో ఎలాంటి కార్డ్, క్యాష్ లేకుండా ప్రయాణించే సరికొత్త టెక్నాలజీను రష్యా ఆవిష్కరించింది. కార్డ్, క్యాష్‌కు బదులుగా ఫేస్ రీడింగ్ ద్వారా చెల్లింపు జరిగే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ తరహ చెల్లింపుల వ్యవస్థను రష్యా ప్రవేశపెట్టింది. మాస్కోలో సుమారు 240 మెట్రో స్టేషన్లలో ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. వరల్డ్ లార్జెస్ట్ వీడియో సర్వెలెన్స్ సిస్టమ్‌ను మాస్కోను కల్గి ఉంది. కోవిడ్-19 సమయంలో, రాజకీయ ర్యాలీలు, క్వారెంటెన్‌కు తరలించే సమయంలో ఈ నిఘా వ్యవస్థ అక్కడి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడింది.
ఫేస్‌పే ఎలా పనిచేస్తుదంటే...!
ఫేస్ పే సిస్టమ్‌ని ఉపయోగించే ముందు ప్రయాణికులు తమ చిత్రాన్ని ముందుగా ఆయా యాప్‌లో సమర్పించాలి. మాస్కో మెట్రో అప్లికేషన్ ద్వారా వారి డెస్టినేషన్ లొకేషన్స్, బ్యాంక్ కార్డులకు లింక్ చేయాలి. మెట్రోని ఉపయోగించడానికి, "ఫేస్ పే" తో నమోదు చేసుకున్న ప్రయాణికులు కేవలం ఒక నిర్దేశిత టర్న్‌స్టైల్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాను చూసిన వెంటనే పేమెంట్ జరిగిపోయినట్లు వస్తోంది . ఫేస్ పే ద్వారా ప్రయాణికుల డేటా సురక్షితంగా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: వన్‌ప్లస్ కోఫౌండర్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్...! లాంచ్ ఎప్పుడంటే...!
Comments
Please login to add a commentAdd a comment