
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నర కిందట తప్పిపోయిన అస్సాం బాలికను తెలంగాణ పోలీస్ రూపొందించిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఇంటికి చేర్చింది. అస్సాంలోని లక్మీపూర్ బోగినోడి గ్రామానికి చెందిన అంజలి టిగ్గా(16) 2017, ఆగస్టులో ఇంటి నుంచి తప్పిపోయి ఢిల్లీకి చేరి అక్కడ నెల రోజుల పాటు కార్మికురాలిగా పనిచేసింది. పనిచేస్తున్న చోట ఇతర కార్మికులందరూ కలిసి మళ్లీ తనను అస్సోం పంపించారు. అస్సాం రైల్వే స్టేషన్‌కు చేరిన అంజలి ఇంటికి వెళ్లేందుకు భయపడి సోనిత్‌పూర్‌లో ఏదైనా పనిచేసుకుని జీవించాలని నిర్ణయించుకుంది. అయితే, రైల్వే స్టేషన్‌లో అంజలిని గుర్తించిన రైల్వే పోలీసులు ఆమెను చైల్డ్, ఉమెన్ కేర్ (సీడబ్ల్యూసీ) సంస్థ ప్రతినిధులకు అప్పగించారు.
తెలంగాణ పోలీసులు తయారుచేసిన ఫేస్ రికగ్నైజ్ యాప్‌లోని డేటా బేస్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రా ల్లో అదృశ్యమైన వారి ఫొటోలు, వివరాలు అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రుల వివరాలు చెప్పేందుకు అంజలి నిరాకరించగా అక్కడి సంస్థ ప్రతినిధులు ఆమె ఫొటోలను తెలంగాణ పోలీస్ రూపొందించిన ఫేస్ రికగ్నైజేషన్ డేటా బేస్‌లో సరిపోల్చి చూశారు. దీంతో అంజలి అడ్రస్ అందుబాటులో ఉండగా ఆమెను ఆదివారం అస్సాంలోని బోగినోడిలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించినట్లు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా ఒక ప్రకటనలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment