
సాక్షి, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటి రేఖ కెమెరాను చూసి పరుగులు తీశారు. రీసెంట్‌గా షాపింగ్ వెళ్లిన ఆమెను చిత్రీకరించేందుకు ఓ అభిమాని ప్రయత్నించాడు. కంప్లీట్ తెలుపు దుస్తుల్లో ఉన్న ఆమె షాపు నుంచి బయటకు వచ్చారు.
ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెను వీడియో తీస్తున్న దృశ్యాన్ని ఆమె గమనించారు. ఒక్కసారిగా ఆ కెమెరాను చూసి ముఖం చాటేసింది. ఆపై అలాగే వేగంగా వెళ్తూ కారులో కూర్చుని నిష్క్రమించింది. ఆ సమయంలో ఆమె మేనేజర్ ఆమె వెంటే ఉన్నారు.
కెమెరా ముందు ఏ మాత్రం బెణుకు లేకుండా నటించే రేఖ.. ఎందుకిలా చేసింది చెప్మా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment