చెక్‌పోస్టులో ఆధునిక కెమెరాల ఏర్పాటు
బీవీపాళెం(తడ) : బీవీపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. గతంలో ఏర్పాటుచేసిన కెమెరాల స్థానంలో మూడు కొత్త కెమెరాలను ఏర్పాటుచేశారు. వీటి ద్వారా జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలకు సంబంధించిన నంబర్లను క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. రాత్రి వేళల్లోనూ అవి బాగా పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు.