Thada
-
లవ్ థ్రిల్లర్
చేతన్ చీను హీరోగా ఎస్.కె. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తడ’. 24 ఆర్ట్స్ ప్రొడక్ష¯Œ ్స బ్యానర్‌పై మిథున్ మురళి, పద్మ సత్య తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. చేతన్ చీను బర్త్‌డే సందర్భంగా ‘తడ’ ఫస్ట్ లుక్ పోస్టర్ని డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో చేతన్ వైవిధ్యభరితమైన మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. గుబురు గడ్డం, బనియన్ , తలకు చుట్టిన రుమాలు, చేతిలో పదునైన ఆయుధంతో దేనికోసమో వేటాడుతున్నట్లు సునిశితమైన చూపుతో కనిపిస్తున్నారు. ‘‘చేతన్ లుక్ ‘తడ’ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. షూటింగ్ తుది దశలో ఉంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతాం’’ అని చిత్రబృందం తెలియజేసింది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, కెమెరా: కన్నా. -
తడలో కరోనా కలకలం
నెల్లూరు, తడ: తడ మండలంలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఎంపీడీఓ జి.శివయ్య సమాచారం మేరకు తడకండ్రిగ పంచాయతీ పరిధిలోని గుమ్మిడిపూండి అరుంధతీయవాడకు చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం, కాళంగి గ్రామానికి చెందిన ఓ యువకుడు కొద్దిరోజుల క్రితం వచ్చాడు. మిత్రులతో గడిపి తిరిగి గ్రామానికి వెళ్లిన అనంతరం అనారోగ్యానికి గురికావడంతో అక్కడ పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతని సన్నిహితుల వివరాలు సేకరించిన సమయంలో గుమ్మిడిపూండి లింకులు తెలిసి నాలుగు రోజుల క్రితం గ్రామంలో పరీక్షలు నిర్వహించారు. ట్రూనాట్ పరీక్షల్లో నలుగురు యువకులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని నెల్లూరు ఐసొలేషన్‌కి తరలించారు. వీరి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపారు. ఈ ప్రాంతంలో పారిశుధ్య పనులు ముమ్మరం చేసి బ్లీచింగ్ చల్లారు. గోపాల్‌రెడ్డిపాళెంలోనూ.. సూళ్లూరుపేట రూరల్: సూళ్లూరుపేట మండలంలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. నిన్నటివరకు పట్టణాలకే పరిమితమైన కరోనా పాజిటివ్ కేసులు నేడు గ్రామాలకు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో గ్రామీణులు కూడా భయందోళన చెందుతున్నారు. శుక్రవారం సూళ్లూరుపేట మండలం గోపాలరెడ్డిపాళెం గ్రామంలో కరోనా కలకలం రేగింది. సూళ్లూరుపేట పట్టణంలోని మహదేవయ్యనగర్ ప్రాంతం కంటైన్మెంట్ జోన్‌గా ఉంది. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ కుంటుంబంలోని అందరికీ ఇటీవల కరోనా టెస్టులు చేశారు. ఆ ఇంట్లో తల్లీబిడ్డలను తప్ప మిగిలిన అందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఆ తల్లీబిడ్డలను సొంత గ్రామమైన గోపాల్‌రెడ్డిపాళెంలో అమ్మగారి ఇంట్లో వదిలివెళ్లారు. ప్రస్తుతం ఆ మహిళకు పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో తల్లీబిడ్డలను నెల్లూరులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎంపీడీఓ నర్మద, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు గ్రామానికి చేరుకున్నారు. అయితే ఇది మహదేవయ్యనగర్ ప్రాంతానికి చెందిన కేసు అని ఎంపీడీఓ తేల్చారు. కానీ గ్రామంలో ఆ మహిళ సెకండరీ కాంట్రాక్ట్‌లో 50 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ శనివారం కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. -
వేనాడు, ఇరకం దీవుల ప్రకృతి అందాలు
ఆధునిక ప్రపంచం.. ఎటుచూసినా కాలుష్యం.. భయాందోళనకు గురిచేస్తున్న వాతావరణం.. ఇలాంటి పరిస్థితులకు దూరంగా స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉన్న పల్లెలు ప్రస్తుతం చాలా అరుదుగా ఉన్నాయి. స్వచ్ఛతకు ప్రతిరూపమైన తడ మండలంలోని వేనాడు, ఇరకం దీవుల్లో ప్రతిదీ విలువైనదే. ఈ దీవులకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నారనే భావన తప్ప నేటి కాలుష్య జీవితం నుంచి దూరంగా ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడుపుతున్నారన్న వీరి సంతృప్తిని చూసి ఎవరైనా అసూయ పడాల్సిందే. పర్యాటక కేంద్రంగా ఇరకం పులికాట్ సరస్సు నడుమ ప్రకృతి అందాలతో కాలుష్య కోరలకు దూరంగా ప్రశాంతంగా ఉండే దీవి గ్రామం ఇరకం. ఈ గ్రామానికి చేరుకోవాలంటే పడవ ప్రయాణం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. గ్రామం చుట్టూ ఉప్పునీరు ఉన్నప్పటికీ గ్రామంలో మాత్రం తియ్యటి మంచినీళ్లు లభించడం దీని ప్రత్యేకత. గ్రామం నిండా మంచి నీటికోసం తవ్విన దొరువులు వాటి పక్కన మొగలి పొదలు కనిపిస్తాయి. వరి ప్రధాన పంట కాగా ఇక్కడ మొగలి పొదలు, వెదురు, పేము, కొన్ని రకాల మూలికా వేర్లు విరివిగా లభిస్తాయి. ఈ పంటలను వ్యాపారాత్మకంగా పెంచేలా ప్రభుత్వం అవగాహన కల్పించి సహకరిస్తే ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుంది. వేనాడులో ప్రకృతి కనువిందు రాకెట్ ప్రయోగ కేంద్రం షార్కు సమీపంలో ఉన్న ఈ గ్రామం కూడా పులికాట్ సరస్సు మధ్యలో ఉంటూ గతంలో దీవిగా ఉండేది. కానీ షార్ రోడ్డు నుంచి వేనాడు వరకు పసల పెంచలయ్య మంత్రిగా పనిచేసిన కాలంలో ఏర్పాటు చేసిన గ్రావెల్ రోడ్డు ఒక్కటే మార్గం. ప్రస్తుతం అది కూడా గతుకులమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపుతోంది. గ్రామం కాలుష్యపు కోరలకు దూరంగా తెల్లటి ఇసుక దిబ్బలతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ షేక్ షావలి అల్లా దర్గా, శ్రీశృంగేశ్వర శ్రీరంగ పెరుమాళ్ ఆలయం వంటి ఆధ్యాత్మిక విశేషాలు చాలానే ఉన్నాయి. వరి ప్రధాన పంట. తాగునీటికి సమస్య లేదు. కానీ ఈ గ్రామం నుంచి గ్రామస్తులు పనులపై మండల కేంద్రం తడకు రావాలంటే దాదాపు 33 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ జీడిమామిడి, పేము, వెదురు, తంగేడిపూలు, సీగిరేణి(అరిపాకు) ఆకు విరివిగా లభిస్తాయి. గతంలో ఈ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సీగిరేణి ఆకుతోనే తల స్నానాలు చేసేవారు. దీని వల్ల చుండ్రు, జుత్తురాలే సమస్యలు తగ్గడంతోపాటు చలవ చేసే గుణం కూడా ఉండేది. అనంతర కాలంలో షాంపులు రావడంతో ఈ ఆకును వాడే వారు కరువైపోయారు. ఇక్కడ లభించే ఉత్పత్తులను వాణిజ్యపరంగా సాగు చేసేలా ఇక్కడి గిరిజనులు, ఇతరులను ప్రోత్సహించడం ద్వారా పలువురికి ఉపాధి లభించే అవకాశం ఏర్పడుతుంది. వేనాడు, ఇరకం దీవులకు కూతవేటు దూరంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం ఉండగా మరికొద్ది దూరంలోనే శ్రీసిటీ, మాంబట్టు పారిశ్రామిక వాడలు ఉన్నాయి. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో ఈ గ్రామాల్లోని యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయి గ్రామాలకే పరిమితమవుతున్నారు. ఈ రెండు గ్రామాల చుట్టూ పులికాట్ సరస్సు ఉప్పు నీళ్లు ఉన్నా గ్రామాల్లో మాత్రం స్వచ్ఛమైన తియ్యటి నీళ్లు ఉండడం వీరు అదృష్టంగా భావిస్తారు. ఈ నీటి ఆసరాగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ భూమి పరిమితంగా ఉండి కూలీలు ఎక్కువగా ఉండడంతో వీరికి సరైన పని లభించడం లేదు. ఇరకం, వేనాడు దీవుల్లో ప్రశాంతమైన వాతావరణంతోపాటు ప్రతి చెట్టూ, వేరూ, ఆకూ, పువ్వూ, కాయ, పండూ అన్నీ ఏదో ఒక అద్భుతమైన ఔషధగుణం కలిగినవిగా ఉంటాయి. వేనాడులో ఎక్కువ శాతం చెట్లు క్లోనింగ్ మొక్కల తరహాలో ఓ మోస్తరు ఎత్తు మాత్రమే పెరుగుతాయి. భారీ వృక్షాలు ఇక్కడ పెద్దగా కనిపించకపోవడం విశేషం. బయటి ప్రాంతాల్లో రావి, వేపచెట్ల తరహాలో ఈ గ్రామంలో వేపచెట్లు ఆరిపాకు చెట్లతో పెనవేసుకుని కనిపిస్తాయి. ఈ గ్రామాలకు వెళ్లే మార్గంలో పులికాట్ సరస్సులో నీళ్లు ఉన్న సమయంలో దేశ, విదేశీ విహంగాలు చేసే విన్యాసాలు కనువిందు చేస్తాయి. ఈ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. ఆ దీవుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం వేనాడు, ఇరకం దీవులు అద్భుత గ్రామాలు. ఇక్కడి ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు అందించడంతోపాటు ఈ గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చేపట్టాల్సిన చర్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నెరవేరుస్తాం. ఇరకం దీవిలో పర్యాటక పెట్టుబడుల కోసం ఇప్పటికే చెన్నైలోని ‘వీజీపీ’ ప్రతినిధులతో చర్చలు జరిపాం. వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడి ప్రజల సౌకర్యార్థం రోడ్డు వసతి, పులికాట్ ముఖద్వారాల పూడికతీత, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తా. – కిలివేటి సంజీవయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే గతంలో అరిపాకే అందరికీ మా చిన్నతనంలో అరిపాకుతోనే తల స్నానం చేసే వాళ్లం. దీని వల్ల జుట్టుకి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చేవి కావు. ఈ ఆకును పొడి కొట్టించడం, స్నానం చేసేందుకు కూడా ఎక్కువ సమయం పట్టడం వంటి కారణాలతో ప్రజలు షాంపూల వైపు మళ్లారు. తిరిగి ప్రస్తుతం పాత అలవాట్లకు వస్తున్న ప్రజలు ఇప్పుడిప్పుడు ఈ ఆకు కోసం గ్రామానికి వస్తున్నారు. గ్రామంలో నీటి చెమ్మ ఉన్న ప్రాంతాల్లో పేము బాగా పెరుగుతుంది. ఇక్కడ పట్టా భూముల్లో సాగయ్యే పేముని వేలం పాట ద్వారా విక్రయిస్తాం. ఆకు నుంచి, కాడ వరకు ముళ్లతో ఉండే ఈ పేముని గిరిజనులు తప్ప ఇతరులు కొయ్యలేరు. ఈ రెండింటినీ బాగా సాగు చేసి వినియోగంలోకి తెస్తే కొందరికైనా ఉపాధి లభిస్తుంది. – కె.వాసుమొదలి, వేనాడు గ్రామం, తడ మండలం -
అట్రాసిటీ కేసులపై విచారణ
తడ: ఇటీవల కాలంలో తడ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రెండు అట్రాసిటీ కేసులకు సంబంధించి బుధవారం ఆ విభాగం డీఎస్పీ సుధాకర్ విచారణ చేపట్టారు. అండగుండాల గ్రామ దళితులకు సంబంధించిన స్మశాన స్థలాన్ని చేనిగుంటకు చెందిన రైతు శ్రీనివాసులురెడ్డి ఆక్రమించే ప్రయత్నం చేశాడని కేసు నమోదు అయింది. ఈ కేసుతో పాటు తడకు చెందిన ఓ గిరిజన యువతిని తిరుపతికి చెందిన వ్యక్తి మోసం చేశాడనే ఫిర్యాదుపైనా విచారణ జరిపారు. అండగుండాలలో పొలాన్ని పరిశీలించిన అనంతరం తడలోని పున్నమి అతిథిగహంలో బాధితుల నుంచి వివరాలు సేకరించారు. -
రెండిళ్లల్లో చోరీ
రూ.65 వేల నగదు, 3 సవర్ల బంగారు, రెండు సెల్ఫోన్ల చోరీ తడ : తడలో శనివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు రెండిళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న కుప్పంపాటి నాగరాజకు చెందిన 14ఏ క్వార్టర్స్, దానికి వెనుక వైపున కోనేటి కట్ట వద్ద ఉన్న వెంకటేశ్వర్లు ఇంట్లో దుండగులు చోరీలు చేశారు. నాగరాజ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని విషయం గమనించి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాలోని సుమారు రూ.50 వేల నగదు, మూడు సవర్ల బంగారు నగలను, విలువైన చీరలను అపహరించారు. ఉదయం ఇంటికి వచ్చిన చూసిన బాధితుడు చోరీ జరిగినట్లు గుర్తించాడు. మరో ఇంట్లో జరిగిన చోరీని పరిశీలిస్తే వెంకటేశ్వర్లుకు చెందిన ఇంట్లో శ్రీసిటీలో పనిచేసే ఉత్తరాది ప్రాంతానికి చెందిన యువకులు అద్దెకు ఉంటున్నారు. వారు తలుపులు తీసి నిద్రిస్తుండగా లోనికి ప్రవేశించిన దొంగలు వారి బ్యాగులు బయటకు తీసుకు వచ్చి అందులోని రూ.15 వేల నగదు, రెండు సెల్ఫోన్లను అపహరించారు. ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో కూడా చోరీ జరగలేదని వీరు తెలిపారు. బాధితుల ఫిర్యాదు అందుకున్న తడ పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెక్‌పోస్టులో ఆధునిక కెమెరాల ఏర్పాటు
బీవీపాళెం(తడ) : బీవీపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. గతంలో ఏర్పాటుచేసిన కెమెరాల స్థానంలో మూడు కొత్త కెమెరాలను ఏర్పాటుచేశారు. వీటి ద్వారా జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలకు సంబంధించిన నంబర్లను క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. రాత్రి వేళల్లోనూ అవి బాగా పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. -
జాతీయ రహదారిపై ఆక్రమణల తొలగింపు
తడ: నెల్లూరు జిల్లా తడ ఐదవ నంబర్ జాతీయ రహదారిపై ఆక్రమణలను రెవెన్యూ, పోలీసు అధికారులు తొలగించే చర్యలు చేపట్టారు. దీంతో స్థానిక వ్యాపారులు ఆందోళనకు దిగారు. తడ మండలం బీవీ పాలెం చెక్‌పోస్ట్ సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా అక్రమంగా సుమారు 100 వరకు షాపులు వెలిశాయి. దీంతో రహదారి మార్గం కొంత కుచించుకుపోయింది. జాతీయ రహదారుల, ప్రాధికార సంస్థ ఫిర్యాదు మేరకు రెవెన్యూ , పోలీసు అధికారులు మంగళవారం రంగంలోకి దిగారు. షాపులు తీసివేయాలని అధికారులు ముందు నుంచే చెబుతున్నా స్థానికులు వినకపోయే సరికి చివరికి తొలగింపు చేపట్టారు. -
ఆటో బోల్తా : 9మందికి గాయాలు
తడ: నెల్లూరు జిల్లా తడ మండలం సమీపంలో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. తమిళనాడులోని ఆరంబాకం నుంచి సూళ్లూరుపేటకు వస్తున్న ఆటో తడ శివారులోని జాతీయరహదారిపై బుధవారం ఉదయం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలోని తొమ్మిది మంది ప్రయాణికలుల తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను తడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పూర్తి వివరాలున తెలియాల్సి ఉంది. -
ఎన్కౌంటర్ కు నిరసనగా బస్సుపై బాంబుతో దాడి
తడ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ పట్టణం సమీపంలోని పూడి వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. బైక్‌పై వెళ్తున్న దుండగులు బస్సుపై పెట్రోల్ బాంబు విసిరి వెళ్లిపోయారు. అయితే, అది బస్సు పక్కన పడటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులు దుండగులను అడ్డుకోగా వారు పరారయ్యారు. ఎన్ కౌంటర్ కు నిరసనగా నినాదాలు దుండగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడు సరిహద్దులో ఈ గ్రామం ఉంది. అయితే, తాజా ఘటన నేపథ్యంలో ఏపీ ఆర్టీసీ అధికారులు ఆంధ్రా నుంచి తమిళనాడు వైపు వెళ్లే బస్సులను నిలిపివేశారు. -
300 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
తడ, న్యూస్‌లైన్ : ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న 300 బస్తాల రేషన్ బియ్యాన్ని గురువారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. పోలీసుల కథనం మేరకు..రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయనే సమాచారం తడ ఎస్సై ఎం.నాగేశ్వరరావు తన సిబ్బందితో గురువారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. చేనిగుంట వద్ద ఓ లారీని ఆపగా డ్రైవర్ దూకి పరారయ్యాడు. లారీలోని సరుకును పో లీసులు పరిశీలిస్తుండగా నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆరా తీయసాగారు. వారిని లా రీకి పెలైట్లుగా అనుమానించిన పోలీసులు వెం టనే వాహనాలతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. లారీలోని 300 బస్తాల రే షన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పో లీసుల అదుపులో ఉన్న కారుడ్రైవర్ సూళ్లూరుపేటకు చెందిన వ్యక్తికాగా, మిగిలిన వారు వా టంబేడుకు చెందిన వారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించారు. శ్రీకాళహస్తి కేంద్రంగా స్మగ్లింగ్ చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి కేంద్రంగా కొం దరు ఆంధ్రా రేషన్ బియ్యాన్ని తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తడ మండలానికి చెందిన పలువురు రేషన్ డీలర్లు బియ్యం స్మగ్లర్లతో నేరుగా మంతనాలు సాగి స్తూ, గుట్టుచప్పుడు కాకుండా అక్రమ వ్యా పా రం చేస్తున్నట్లు సమాచారం. వరదయ్యపాళెం మండలంలోనూ బియ్యం సేకరణ, తరలింపు భారీస్థాయిలోనే జరుగుతోంది. ఇటీవల విజిలె న్స్ అధికారులు దాడులు జరిపి వరదయ్యపాళెం మండలంలో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం రా త్రి దొరికిన వ్యక్తులు తెలిపిన సమాచారం ప్ర కారం బియ్యాన్ని చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడుకు తరలించేందుకు ప్రయత్నించగా, చెక్‌పోస్టు వద్ద నిఘా ఉన్నట్టు సమాచారం రావడంతో దారి మళ్లించి చిక్కినట్టు తెలుస్తోంది.