చేతన్ చీను హీరోగా ఎస్.కె. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తడ’. 24 ఆర్ట్స్ ప్రొడక్ష¯Œ ్స బ్యానర్‌పై మిథున్ మురళి, పద్మ సత్య తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. చేతన్ చీను బర్త్‌డే సందర్భంగా ‘తడ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చేతన్ వైవిధ్యభరితమైన మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. గుబురు గడ్డం, బనియన్ , తలకు చుట్టిన రుమాలు, చేతిలో పదునైన ఆయుధంతో దేనికోసమో వేటాడుతున్నట్లు సునిశితమైన చూపుతో కనిపిస్తున్నారు. ‘‘చేతన్ లుక్ ‘తడ’ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. షూటింగ్ తుది దశలో ఉంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతాం’’ అని చిత్రబృందం తెలియజేసింది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, కెమెరా: కన్నా.
Comments
Please login to add a commentAdd a comment