తడ: నెల్లూరు జిల్లా తడ మండలం సమీపంలో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. తమిళనాడులోని ఆరంబాకం నుంచి సూళ్లూరుపేటకు వస్తున్న ఆటో తడ శివారులోని జాతీయరహదారిపై బుధవారం ఉదయం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలోని తొమ్మిది మంది ప్రయాణికలుల తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను తడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పూర్తి వివరాలున తెలియాల్సి ఉంది.