ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో గత 9 రోజులుగా 41 మంది కూలీలు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో వారికి పైపు ద్వారా ఘన ఆహారాన్ని అందించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. దీనితోపాటు ఎండోస్కోపిక్ కెమెరా ద్వారా కార్మికుల పరిస్థితిని అధికారులు గమనించారు.
రెస్క్యూ బృందం ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున వారి దగ్గరకు ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరా పంపారు. వారి క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అందుకే ఎండోస్కోపిక్ కెమెరా అంటే ఏమిటో.. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండోస్కోపిక్ కెమెరాలను మానవ శరీరంలోని అంతర్గత అవయవాలను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. ఎండోస్కోపిక్ కెమెరాలు అత్యంత సాంకేతికంగా పనిచేస్తాయి. సరైన రోగనిర్ధారణ, వ్యాధులకు తగిన చికిత్స అందించేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వైద్యులు వినియోగిస్తారు. ఆధునిక ఎండోస్కోపిక్ కెమెరాలు ‘చిప్-ఆన్-టిప్’ సాంకేతికతతో పనిచేస్తాయి. కెమెరా చివరిలో ఉన్న సాఫ్ట్ ప్యాకేజీ ద్వారా ఫొటోలు తీయడం జరుగుతుంది.
ఈ కెమెరా పైన ఎల్‌ఈడీ లైట్ ఉంటుంది. ఫలితంగా ఈ కెమెరా చీకటిగా ఉన్న ప్రదేశాలలో కూడా చిత్రాలను క్లిక్ చేయగలుగుతుంది. ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం అధికారులు ఫ్లెక్సీ కెమెరాను ఉపయోగించారు. పైప్‌లైన్‌లోని చిన్న రంధ్రం ద్వారా కెమెరాను సొరంగం లోనికి పంపించి బాధితుల గురించి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: యాంటీమాటర్ అంటే ఏమిటి? ఎందుకు అత్యంత శక్తివంతం?
Comments
Please login to add a commentAdd a comment